Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Kalki Box Office Collection: బాక్సాఫీస్ వద్ద కల్కి ప్రభంజనం ప్రభంజనం... వెయ్యి కోట్లు కొల్లగొట్టిన...

Kalki Box Office Collection: బాక్సాఫీస్ వద్ద కల్కి ప్రభంజనం ప్రభంజనం… వెయ్యి కోట్లు కొల్లగొట్టిన ప్రభాస్, ఆ క్లబ్ లో షారుక్ తర్వాత మనోడే!

Kalki Box Office Collection: కల్కి 2829 AD చిత్రం అరుదైన మైలురాయిని చేరుకుంది. ఈ మూవీ వసూళ్లు రూ. 1000 కోట్లకు చేరాయి. దీంతో ఓ నయా రికార్డు ప్రభాస్ ఖాతాలో వేసుకున్నాడు. ప్రభాస్, షారుఖ్ ఖాన్ మాత్రమే ఈ క్లబ్ లో ఉన్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి మూవీ వరల్డ్ వైడ్ విశేష ఆదరణ దక్కించుకుంది. ఫస్ట్ షో నుండే హిట్ టాక్ తెచ్చకున్న ఈ చిత్రానికి వసూళ్లు అదే స్థాయిలో దక్కాయి. ముఖ్యంగా ఓవర్సీస్ లో కల్కి కోసం ఆడియన్స్ ఎగబడ్డారు. ఇతర దేశాల్లో కల్కి $30 మిలియన్ వసూళ్ళు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. ఒక్క యూఎస్ లోనే కల్కి $16 మిలియన్ కి పైగా కొల్లగొట్టింది.

రెండు వారాలు కల్కి వసూళ్లు సాలిడ్ గా ఉన్నాయి. మూడో వారం కూడా చెప్పుకోదగ్గ వసూళ్లు అందుకుంది. కల్కి హిందీ వెర్షన్ రూ. 250 కోట్లకు పైగా రాబట్టింది. హిందీలో ప్రభాస్ నాలుగు హిట్స్ నమోదు చేశాడు. గతంలో ఆయన నటించిన బాహుబలి, బాహుబలి 2, సాహో నార్త్ ఇండియాలో హిట్ స్టేటస్ అందుకున్నాయి. తాజాగా కల్కి అక్కడ సత్తా చాటింది. వరల్డ్ వైడ్ కల్కి వసూళ్లు రూ. 1000 కోట్లు దాటినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

కాగా ఇండియాలో వెయ్యి కోట్ల వసూళ్లు సాధించిన హీరోలుగా షారుఖ్ ఖాన్, ప్రభాస్ నిలిచారు. వరుస పరాజయాలతో ఇబ్బందిపడ్డ షారూఖ్ ఖాన్ కి 2023 గోల్డెన్ ఇయర్ అని చెప్పాలి. ఆయన నటించిన పఠాన్, జవాన్ వెయ్యి కోట్ల వసూళ్లు అధిగమించాయి. ఇక ప్రభాస్ సైతం ఈ క్లబ్ లో జాయిన్ అయ్యాడు. బాహుబలి 2, కల్కి వెయ్యి కోట్ల వసూళ్లు సాధించిన చిత్రాలుగా ఉన్నాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ మూవీతో వెయ్యి కోట్ల క్లబ్ లో చేరారు. టాలీవుడ్ నుండి మరొక హీరో వెయ్యి కోట్లు సాధించిన దాఖలాలు లేవు.

ఇక కల్కి చిత్రాన్ని మైథాలజీ-సైన్స్ ఫిక్షన్ మిక్స్ చేసి చాలా బ్యాలన్స్డ్ గా నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు. ఆయన రాసుకున్న కథకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. అలాగే పరిమిత బడ్జెట్ లో హాలీవుడ్ రేంజ్ మూవీ అందించారని అంటున్నారు ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ తెరకెక్కించాడనికి రూ. 600 కోట్ల బడ్జెట్ తక్కువనే చెప్పాలి. ఇందులో స్టార్స్ రెమ్యూనరేషన్ కే సగం పోయింది. మిగిలిన బడ్జెట్ తో క్వాలిటీ విజువల్స్ తో కూడిన చిత్రం నాగ్ అశ్విన్ రూపొందించాడు.

సినిమాలో ప్రభాస్ పాత్రను నాగ్ అశ్విన్ కొత్తగా డిజైన్ చేశాడు. ఫన్నీగా ప్రభాస్ చేసిన భైరవ పాత్ర సాగుతుంది. సినిమాకు అమితాబ్ బచ్చన్ పోషించిన అశ్వద్ధామ పాత్ర హైలెట్ గా నిలిచింది. అశ్వద్ధామ-భైరవ కాంబినేషన్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ మైండ్ బ్లాక్ చేస్తాయి. దీపికా పదుకొనె రోల్ ఎమోషనల్ గా సాగింది. కమల్ హాసన్ ఫస్ట్ పార్ట్ లో కొన్ని సన్నివేశాలకు పరిమితం అయ్యాడు. కానీ ప్రభావం చూపాడు.

దిశా పటాని, శోభన, రాజేంద్ర ప్రసాద్, పశుపతి ఇతర కీలక రోల్స్ చేశారు. కల్కి మూవీతో ప్రభాస్ క్లీన్ హిట్ అందుకున్నాడు. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కల్కి డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్న నేపథ్యంలో ఆగస్టు 15 నుండి స్ట్రీమ్ కానుందని సమాచారం. ఇక కల్కి పార్ట్ 2 కోసం ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version