https://oktelugu.com/

Devara: దేవర క్లైమాక్స్ ఫైట్ కోసం అంత ఖర్చుపెడుతున్నారా..? తేడా కొడితే మాత్రం కష్టమే…

ఇక సినిమా సక్సెస్ మీదనే మేకర్స్ యొక్క స్టార్ డమ్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒక సినిమా సక్సెస్ అవ్వడం అనేది చాలా కీలకం...దానికోసమే అందరు చాలా కష్టపడుతూ అంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : August 22, 2024 / 10:52 AM IST

    Devara(8)

    Follow us on

    Devara: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న దేవర సినిమా సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతుంది. అయితే ఇంకా ఈ సినిమా రిలీజ్ కి నెల రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ విషయంలోనే చాలావరకు ఖర్చు చేసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక దాంతో పాటుగా దానికి భారీగా సీజీ వర్క్ కూడా ఉండడంతో ఆ ఖర్చు అనేది విపరీతంగా పెరిగిపోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ ఒక్క ఫైట్ వల్ల సినిమా టాక్ మొత్తం మారిపోతుంది అనే ఉద్దేశ్యంతోనే ఆ ఫైట్ ని చాలా గ్రాండ్ గా తెరకెక్కిచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక దానికి తగ్గట్టుగానే గ్రాఫిక్స్ వర్క్ లో కూడా ఎక్కడ తగ్గకుండా ఫైట్ లో ఉన్న ఫీల్ మిస్ అవ్వకుండా ఉండే విధంగా దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక దానికోసం ప్రొడ్యూసర్స్ తో విపరీతంగా డబ్బులు కూడా ఖర్చు పెట్టిస్తున్నట్టుగా కూడా వార్తలు అయితే వస్తున్నాయి. మరి దానికి అనుకూలంగానే ఈ సినిమాతో కొరటాల శివ ఒక భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు… అందువల్లే ఈ ఫైట్ కోసం దాదాపు 10 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

    మరి అన్ని కోట్లు పెట్టి ఒక్క ఫైట్ ని తెరకెక్కించడం ఎందుకు అంటూ కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నప్పటికీ ఆ ఫైట్ సినిమాలో కీలకం కాబట్టే అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నట్టుగా మేకర్స్ అయితే సమాధానం చెబుతున్నారు. మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఎన్టీఆర్ ఫ్యూచర్ లొ పాన్ ఇండియా స్టార్ హీరోగా వెలుగొందాలి అంటే ఈ సినిమా సక్సెస్ అనేది అతనికి చాలా కీలకం.. కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదనే ఉద్దేశ్యం తోనే ఎన్టీఆర్ కూడా కొరటాల శివ కి పూర్తి స్వేచ్ఛనిచ్చినట్టుగా తెలుస్తుంది.

    తను ఎలా అయితే అనుకుంటున్నారో అలాంటి ఒక సినిమాని తీసి పెట్టమని ఆయన కోరినట్టుగా కూడా తెలుస్తుంది. అయినప్పటికీ సినిమా సక్సెస్ అయితే పర్లేదు కానీ ఫెయిల్యూర్ అయితే మాత్రం ప్రొడ్యూసర్ కి భారీగా నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది కూడా చూసుకుంటే మంచిది అంటూ కొంతమంది సినీ విమర్శకులు దేవర సినిమా యూనిట్ ని హెచ్చరిస్తున్నారు…

    ఇక ఈ విషయం పక్కన పెడితే ఎన్టీయార్ – కొరటాల కాంబినేషన్ లో ఇంతకు ముందే వచ్చిన ‘జనతా గ్యారేజ్’ ఎంత పెద్ద హిట్ అయితే సాధించిందో అలాగే ఈ సినిమా కూడా అంతకు మించి భారీ బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని సాధించాలని వాళ్లు భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే పాన్ ఇండియా లెవెల్లో ఎన్టీఆర్ సత్తా చాటుకుంటాడని అతని అభిమానులు కూడా మంచి ఆశ భవాన్ని వ్యక్తం చేస్తున్నారు…