Electric cars : ప్రస్తుతం లో బడ్జెట్ లో వచ్చే విద్యుత్ కార్లు ఇవే.. ధర ఎంతో తెలుసా?

కొన్ని కంపెనీలు సామాన్యులు సైతం కొనుగలు చేసేలా లో బడ్జెట్ విద్యుత్ కార్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. 2024 అక్టోబర్ లో రిలీజ్ చేసిన లిస్టు ప్రకారం ప్రస్తుతం మార్కెట్లో ఉన్న లో బడ్జెట్ కార్ల గురించి తెలుసుకుందాం.

Written By: Srinivas, Updated On : October 15, 2024 5:23 pm

Electric cars

Follow us on

Electric cars : దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగిపోతుంది. ముఖ్యంగా కార్లు ఎక్కువగా విద్యుత్ తో కూడినవి మార్కెట్లోకి వస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు దిగి రాకపోవడంతో పాటు అదనపు ఖర్చులు ఎక్కువగా ఉండడంతో చాలా మంది ఈవీలపై మనసు పెడుతున్నారు. దీంతో కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా ఈవీల ప్రొడ్యూస్ పైనే ఫోకస్ పెడుతున్నాయి. అయితే నిన్నటి వరకు ఈవీ కార్లు అధిక ధరతో మార్కెట్లోకి వచ్చాయి. కానీ కొన్ని కంపెనీలు సామాన్యులు సైతం కొనుగలు చేసేలా లో బడ్జెట్ విద్యుత్ కార్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. 2024 అక్టోబర్ లో రిలీజ్ చేసిన లిస్టు ప్రకారం ప్రస్తుతం మార్కెట్లో ఉన్న లో బడ్జెట్ కార్ల గురించి తెలుసుకుందాం..

దేశంలో అత్యధికంగా విక్రయాలు జరుపుకుంటున్న కార్ల కంపెనీలో టాటా కంపెనీ ఒకటి. మిగతా కంపెనీలకు గట్టి పోటీనిస్తూ దీని నుంచి టియాగో ఈవీని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇందులో రెండు బ్యాటరీ ప్యాక్ లు ఉన్నాయి. వీటిలో ఒకటి 24 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ కాగా.. మరొకటి 19.2 కిలో వాట్ తో పనిచేస్తుంది. మొదటి బ్యాటరీ ప్యాక్ 315 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. రెండో బ్యాటరీ 250 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. వీటి ఛార్జింగ్ కు ఓవరాల్ గా 3.6 గంటల సమయం పడుతుంది. దీనిని ప్రస్తుతం మార్కెట్లో రూ.7.99 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ ధర రూ.11.89 లక్షలుగా ఉంది.

టాటా నుంచి మరో కారు పంచ్ ఈవీ బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది. ఇందులో 25 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ ను అమర్చారు. దీనితో పాటు 35 కిలో వాట్ అనే మరో బ్యాటరీని కూడా సెట్ చేశారు. ఇవి పూర్తిగా ఛార్జింగ్ కావడానికి 5 గంటల సమయం పడుతుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 315 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ప్రస్తుతం దీనిని రూ. 10.99 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.

ఎంజీ మోటార్స్ నుంచి రిలీజ్ అయిన కామెటీ ఈవీ లో బడ్జెట్ లో పొందవచ్చు. దీని సైజ్ చాలా చిన్నగా ఉండి ఆకర్షిస్తుంది. రెండో కారు కొనాలసుకునేవారు, మహిళలకు ఇది అనుగుణంగా ఉంటుంది. ఇందులో 17.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ను సెట్ చేశారు. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 230 కిలోమీటర్ల వరకు దూసుకెల్తుంది. ఇది 42 బీహెచ్ పవర్ తో 110 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఎంజీ కామెట్ ఈవి ఫుల్ ఛార్జింగ్ కావడానికి 3.5 గంటల సమయం పడుతుంది. దీనిని రూ.6.99 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.

విదేశీ కంపెనీ అయినా సిట్రియొన్ దేశంలో ఇప్పుడిప్పుడే ప్రాధాన్యత సంతరించుకుంటోంది. దేశంలో తొలి ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టిన సిట్రియొన్ ఈసీ 3 అనే ఈవీని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇందులో 29.3 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ ను అమర్చారు. ఇది 57 బీహెచ్ పవర్, 143 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఫుల్ చార్జింగ్ కావడానికి 57 నిమిషాలు పడుతుంది. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 320 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీనిని రూ.11.61 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.