Mangroves: వృక్షాలన్నీ ఒకే చోట ఉండి.. జంతువులకు, పక్షులకు ఆవాసాలుగా నిలిచే ప్రాంతాలను అడవి అంటారు. ప్రపంచ వ్యాప్తంగా 9.4 శాతం భూమిని అడవులు ఆక్రమించి ఉన్నాయి. అడవుల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇవి ఉండడం వల్ల స్వచ్ఛమైన వాతావరణం మనుషులకు అందుతుంది. ఎన్నో కాలుష్య కారకాలను గ్రహించి స్వచ్ఛమైన ఆక్సిజన్ ను అడవులు అందిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా రకరకాల అటవీ ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో కోని ఫెరస్ అడవులు, సతతహరిత సమశీతోష్ణ అడవులు, వర్షాధార అడవులు ఉన్నాయి. అయితే వీటిల్లో మడ అడవుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మడ అడవుల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇవి అంతరించిపోవడం వల్ల మనుషులకు ప్రమాదం. ఎలాగంటే?
ఓ వైపు సముద్రం.. మరోవైపు నదీ ప్రవాహానికి ఇరువైపులా చెట్లు పెరుగుతూ ఉండే అటవీ ప్రాంతాన్ని మడ అడవులు అంటారు. మడ అడవులు ఉప్పునీటిలో ఎక్కువగా ఉంటాయి. ఇవి ఓ వైపు నదీ పరివాహ ప్రాంతాల్లో ఉంటూనే.. మరోవైపు సముద్రానికి అడ్డుగోడగా ఉంటాయి. సముద్రం నీరు పైకి రాకుండా మడ అడవులు అడ్డుకునే విధంగా ఒక గోడలాగా పెరుగుతాయి.సముద్రం పోటుగా ఉన్న సమయంలో, తుఫాను సమయంలో ఇవి అడ్డుగోడగా ఉంటాయి. మడ అడవులు ఉన్న ప్రాంతాల్లో తుఫానులు తక్కువగా సంభవిస్తాయి. సముద్రం ఎంత ఎగిసి పడినా ఇవి అడడ్డుకునే ప్రయత్నం చేస్తాయి.
మడ అడవులు ప్రపంచవ్యాప్తంగా 1.36 లక్షలు ఉన్నట్లు 2021 లెక్కల ప్రకారం తెలుస్తోంది. వీటిలో ఎక్కువగా ఇండోనేషియా ప్రాంతాల్లోనే ఉన్నాయి. భారతదేశంలో మడ అడవులు 5000 కిలోమీటర్ల విస్తీర్ణంలో మడ అడవులు విస్తరించి ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ లోని సుందర్ బన్స్ మడల అడవులను యూనెస్కో గుర్తించింది. ఈ అడవుల్లో రాయల్ బెంగాల్ టైగర్, ఆలివ్ రిడ్లే తాబేళ్లు, నీటి పిల్లులు వంటివి ఇక్కడ జీవిస్తాయి. ఆంధ్రప్రదేశ్ లో గోదావరి, కృష్ణా ముఖ ద్వారాల్లో మడ అడవులు విస్తరించి ఉన్నాయి. ఇవి సుమారు 580 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి. ఇక్కడి అడవుల్లో మరక పిల్లి ప్రత్యేకంగా నిలుస్తుంది.
మడ అడవులను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి లేకపోవడం వల్ల సముద్రం నుంచి నీరు పైకి వచ్చే అవకాశం ఉంది. అయితే కొందరు కలప, తదితర ఖనిజాలు మడ అడవుల్లో ఎక్కువగా దొరికే వనరుల కోసం చెట్లను నరికి వేస్తున్నారు. ఇవి అంతరించిపోవడం వల్ల నదీ నీటితో పాటు సముద్రపు నీరు కలిసి ఆ ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉంది. అందువల్ల మడ అడవులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
సముద్రం మాత్రమే కాకుండా నదీ వెంట చెట్లు ఉండడం వల్ల నీటి ఉప్పెనను తగ్గించుకోవచ్చు. ప్రస్తుత కాలంలో ఏ చిన్న వర్షం వచ్చినా నదీజలాలు ఉప్పొంగడంతో జనవాసాలు మునిగిపోతున్నాయి. అయితే చెట్లను పెంచుకోవడం ద్వారా నీటి ఉధృతి తగ్గే అవకాశం ఉందని కొందరు పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఈ అడవుల్లో కొన్ని అరుదైన జంతువులు జీవించే అవకాశం ఉంటుంది.