Homeబిజినెస్Anil Ambani: అనిల్ అంబానీ మాస్ ఎంట్రీ.. వ్యాపారాన్ని లాభాల పాట పట్టించిన కొడుకులు

Anil Ambani: అనిల్ అంబానీ మాస్ ఎంట్రీ.. వ్యాపారాన్ని లాభాల పాట పట్టించిన కొడుకులు

Anil Ambani: రిలయన్స్‌ గ్రూప్‌ అధినేత అనిల్‌ అంబానీ ఒకప్పుడు భారత్‌తో సహా ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో అగ్రగామిగా నిలిచారు. ప్రస్తుత భారత కుబేరుడు, అతని సోదరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కూడా అనిల్ వెనుకే ఉండేవారు. కానీ కాలం వేగంగా కదిలింది. పరిస్థితి మారింది. అనిల్ అంబానీ తన వ్యాపారాన్ని విస్తరించే క్రమంలో అప్పులపాలయ్యాడు. అతని చాలా కంపెనీలు దివాళా తీశాయి. దీంతో ఆయా కంపెనీల షేర్లు పడిపోయినంత వేగంగా అనిల్ అంబానీ ఆస్తి కరిగిపోయింది. 2009లో ఒకానొక సమయంలో తన సంపదను జీరోగా పేర్కొనడం గమనార్హం. గత రెండేళ్లుగా అనిల్ అంబానీ మళ్లీ వార్తల్లో నిలిచారు. ఆపై దివాలా ప్రకటనలతో వార్తల్లో నిలిచిన ఈ కోటీశ్వరుడు.. ఇప్పుడు మళ్లీ తన వ్యాపారాల్లో రాణిస్తున్నాడు. అప్పుల ఊబి నుంచి బయటపడి మళ్లీ గాడిలో పడుతున్నారు. బ్యాంకులకు రుణాలు కూడా క్రమంగా చెల్లిస్తున్నారు. అదే సమయంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అప్పుల్లో కూరుకుపోయిన అనిల్ అంబానీకి ఇప్పుడు మంచి రోజులు మొదలైనట్లు కనిపిస్తున్నాయి. రిలయన్స్ పవర్ రుణ రహితంగా మారడంతో పాటు రిలయన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ తన రుణాన్ని 87శాతం తగ్గించుకుంది. అయితే… దీనికంతటికీ కారణం ఇద్దరే ఇద్దరు. వారే అనిల్ అంబానీ వారసులు. అన్మోల్ అంబానీ, అన్షుల్ అంబానీ.. అవును.. రిలయన్స్ పవర్ షేర్లు 5శాతం పెరిగి.. 52 వారాల గరిష్ట స్థాయి రూ.53.65కి చేరుకుంది. దీంతో నష్టాల్లో, అప్పుల్లో చిక్కుకున్న అనిల్ అంబాన్నీ కీలక పరిణామాన్ని ఎదుర్కోంటున్నారు. ఈ పునరుజ్జీవం.. కంపెనీలపై మళ్లీ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని సూచిస్తుందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం రిలయన్స్ పవర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,052.67 కోట్లు దాటింది. ఈ సంచలన మార్పుకు కారణం అనిల్ అంబానీ ఇద్దరు కొడుకులైన అన్మోల్, అన్షుల్ అంటున్నారు. వ్యాపారంలో వీరి వ్యూహాత్మక ప్రమేయమే ఈ కీలక మార్పుకు కారణం అని చెబుతున్నారు. రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ ని మళ్లీ పూర్వవైభవం సాధించడంలో అన్మోల్ నాయకత్వం పనిచేసిందని.. ఆయన నాయకత్వంలో పెట్టుబడిదారుల విశ్వాసం తిరిగి పుంజుకుందని కొందరు చెబుతున్నారు.

రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేర్లు 60శాతం పెరిగి రూ.336.20కి చేరాయి. 2018 తర్వాత ఇదే అత్యధిక పెరుగుదల అని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా… రిలయన్స్ ఇన్‌ఫ్రా తన ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేస్తూ విదేశీ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్ల ద్వారా రూ.2,930 కోట్లు సమీకరించేందుకు ఆమోదం పొందింది. కాగా… అన్మోల్ అంబానీ చిన్నప్పటి నుంచి నాయకత్వ పాత్రలు పోషించేవారన్నారు. 2014లో రిలయన్స్ మ్యూచువల్ ఫండ్స్‌తో ప్రారంభించిన అన్మోల్ 2017లో రిలయన్స్ క్యాపిటల్‌కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. అదే క్రమంలో… రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్‌లో వాటాను పెంచుకోవడానికి జపాన్‌కు చెందిన నిప్పన్ కంపెనీకి వెసులుబాటు కల్పించింది.

రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్, రిలయన్స్ క్యాపిటల్ అసెట్ మేనేజ్‌మెంట్ వంటి వెంచర్లు అతని దర్శకత్వంలో అభివృద్ధి చెందాయి. ఫలితంగా అతని నికర విలువ రూ.2,000 కోట్లకు చేరింది. ఇక అన్షుల్ అంబానీ విషయానికొస్తే… అమెరికా పాఠశాలలో పాఠశాల విద్యను పూర్తి చేసి న్యూయార్క్ యూనివర్సిటీలోని ప్రతిష్టాత్మక స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి బ్యాచిలర్ డిగ్రీని అందుకున్నాడు. ఈ బలమైన విద్యా పునాది వ్యాపార ప్రపంచంలోని సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అతన్ని సన్నద్ధం చేస్తుందని చెబుతున్నారు.ఈ యువ అంబానీల నేతృత్వంలోని ఈ సమిష్టి కృషి అనిల్ అంబానీ తిరిగి బిలియనీర్ స్థితికి రావడానికి పునాది వేసిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version