https://oktelugu.com/

Top Sold Cars : 2024లో అత్యధికంగా విక్రయాలు జరుపుకున్న కార్లు ఇవే..

మారుతి నుంచి టాటా వరకు తమ కొత్త మోడళ్లను విక్రయించాయి. కానీ మొత్తంగా చూస్తే ఈ ఏడాదిలో ఎక్కువగా మారుతికి సంబంధించిన కార్లను ఎక్కువగా కొనుగోళ్లు చేసినట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన హ్యాచ్ బ్యాక్ నుంచి ఎస్ యూవీ వరకు వీటి సేల్స్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

Written By: Srinivas, Updated On : September 26, 2024 3:19 pm
Top Sold Cars

Top Sold Cars

Follow us on

Top Sold Cars :  దేశంలో కార్ల వినియోగం రోజురోజుకు పెరిగపోతుంది. సొంత అవసరాలతో పాటు ట్రావెలింగ్ కోసం చాలా మంది సొంత కార్లను కలిగి ఉంటున్నారు. దేశంలో జనవరి నుంచి జూలై వరకు 21,61,655 కార్లు అమ్ముడు పోయాయి. గత ఏడాది కంటే ఈ సంవత్సరం 7.5 శాతం వృద్ధి సాధించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏడాది కొన్ని కార్లు విపరీతంగా పోటీ పడ్డాయి. వీటిలో మారుతి నుంచి టాటా వరకు తమ కొత్త మోడళ్లను విక్రయించాయి. కానీ మొత్తంగా చూస్తే ఈ ఏడాదిలో ఎక్కువగా మారుతికి సంబంధించిన కార్లను ఎక్కువగా కొనుగోళ్లు చేసినట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన హ్యాచ్ బ్యాక్ నుంచి ఎస్ యూవీ వరకు వీటి సేల్స్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం ఆటోమోబైల్ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. అయినా పాత కార్లకు ఉన్న డిమాండ్ తగ్గడం లేదు. కొందరు తమ అవసరాల రీత్యా హ్యాచ్ బ్యాక్ నుంచి 7 సీటర్ వరకు ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న కార్లే ప్రధాన్యం ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఏదీ తమకు అనుగుణంగా ఉంటుందో చూసి వాటి కొనుగోలుకు ఆసక్తి చూపుతన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు చూస్తే టాటా, మారుతి, మహీంద్రా కంపెనీల మధ్య మాత్రమే పోటీ ఉందని తెలుస్తోంది. ఈ కంపెనీలకు చెందిన కార్లే టాప్ 10 మోడళ్లలో నిలిచాయి. కానీ వీటిలో మారుతికి సంబంధించిన 8 మోడళ్లు హైలెట్ గా నిలిచాయి.

దేశంలో మారుతి కార్ల కంపెనీ అగ్రగామిగా నిలుస్తోంది. సామాన్యుల నుంచి ప్రీమీయం కార్లు కొనేవారి వరకు అందరినీ ఆకట్టుకునే విధంగా వివిధ మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తుంది. అయితే ఎక్కువగా మిడిల్ క్లాస్ పీపుల్స్ కార్లు కొనాలనుకుంటే మారుతి కార్లను ఎక్కువగా కోరుకుంటారు. ఇవి లో బడ్జెట్ లో అందుబాటులో ఉండడమే కాకుండా కావాల్సిన ఫీచర్లను అందిస్తాయి. అంతేకాకుండా పలు సందర్భాల్లో మారుతి కంపెని వినియోగదారులను ఆకర్షించే విధంగా ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటుంది. దీంతో ఈ కార్ల సేల్స్ ఎప్పుడూ హయ్యెస్ట్ గా ఉంటాయి.

జనవరి నుంచి ఆగస్టు వరకు టాటా కంపెనీకి చెందిన పంచ్ నెంబర్ వన్ గా నిలుస్తోంది. ఈ మోడల్ ఎస్ యూవీ వేరియంట్ లో వినియోగదారులను ఆకర్షిస్తోంది. దీనిని రూ.6.13 లక్షల ప్రారంభ ధర నుంచి విక్రయిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో దీని ధర మారుతూ ఉంటుంది. ఎస్ యూవీ అయిన ఈ మోడల్ తక్కువ ధరలో రావడంతో దీని సేల్స్ పెరిగినట్లు తెలస్తోంది. ఆ తరువాత మారుతికి చెందిన వ్యాగన్ ఆర్ నిలిచింది. ఈ కారు దశాబ్దాలుగా సేల్స్ లో రారాజుగా నిలుస్తోంది. గత ఏడాది వరకు నెంబర్ వన్ లో ఉన్న ఈ కారు ఈ సారి మాత్రం ఒక స్టెప్ డౌన్ అయింది. అయితే టాప్ 10 కార్లు ఎన్ని సేల్స్ నమోదు చేసుకున్నాయో ఈ కింద చూడండి..

1. టాటా పంచ్ 1,42,072

2. మారుతి సుజుకీ వ్యాగన్ ఆర్ 1,32, 309

3. హ్యుందాయ్ క్రెటా 1,25,460

4. మారుతి సుజుకీ బ్రెజా 1,24,019

5. మారుతి సుజుకీ ఎర్టీగా 1,22,659

6. మారుతి సుజుకీ బాలెనో 1,16, 315

7. మారుతి సుజుకీ డిజైర్ 1,16, 085

8. మారుతి సుజుకీ స్విప్ట్ 1,13, 870

9. మహీంద్రా స్కార్పియో 1,11, 350

10. టాటా నెక్సాస్ 1,06,517