https://oktelugu.com/

Hero Motocorp share : భారీగా పడిపోయిన హీరో మోటార్ షేర్స్.. ఆ బైక్స్ మార్కెట్లోకి రావడమే కారణం..

హీరో మోటార్ కంపెనీకి చెందిన లిమిటెడ్ షేర్స్ ఈ ఏడాదిలో మొదటి ట్రైమాసికంలో 20 శాతం లాభాల్లో దూసుకుపోయినా.. తాజాగా లెక్కల ప్రకారం 45 శాతం తగ్గించని సూచికలు తెలుపుతున్నాయి. వాస్తవానికి రెండో త్రైమాసికం నాటికి 15 శాతం పెరుగుదల ఉంటుందని భావించారు. కానీ ఊహించని విధంగా ఈ నష్టాలు రావడంతో షాక్ తింటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.

Written By:
  • Srinivas
  • , Updated On : September 26, 2024 / 03:30 PM IST

    Hero Motocorp share

    Follow us on

    Hero Motocorp share :  భారతదేశంలో టూవీలర్స్ రారాజుగా ఉన్న హీరో కంపెనీ ఎప్పుడూ హైయ్యేస్ట్ సేల్స్ నమోదు చేసుకుంటూ ఉంటుంది. హోండా కంపెనీ నుంచి విడిపోయిన తరువాత కొత్త బైక్స్ అందుబాటులోకి వచ్చాయి. ఎక్కువ కాలం మన్నికగా ఉంటుందని భావించి చాల మంది హీరో బైక్స్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే తాజాగా హీరో కంపెనీకి చెందిన షేర్స్ భారీగా పడిపోయాయి. ఈ కంపెనీకి చెందిన లిమిటెడ్ షేర్స్ ఈ ఏడాదిలో మొదటి ట్రైమాసికంలో 20 శాతం లాభాల్లో దూసుకుపోయినా.. తాజాగా లెక్కల ప్రకారం 45 శాతం తగ్గించని సూచికలు తెలుపుతున్నాయి. వాస్తవానికి రెండో త్రైమాసికం నాటికి 15 శాతం పెరుగుదల ఉంటుందని భావించారు. కానీ ఊహించని విధంగా ఈ నష్టాలు రావడంతో షాక్ తింటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

    UBSనివేదిక ప్రకారం హీరో మోటార్స్ కంపెనీ సెప్టెంబర్ లో సానుకూల వాతావరణం ఉంటుందని అనుకున్నారు. ఎందుకంటే పండుగల సీజన్ కావడంతో కొత్త సేల్స్ ఎక్కువగా ఉంటుందని అనుకున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నాటికి 6 లక్షల యూనిట్లు ఉంటుందని ఊహించారు. కానీ ఇది 3 లక్షల యూనిట్లకు గణనీయంగా పడిపోయింది. 2023 ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి 11 శాతం పెరుగుదల ఉండగా ఈ ఏడాది మాత్రం 6 శాతం మాత్రమే రిటైల్ సేల్స్ నమోదు చేసుకుంది. దీంతో వార్షిక ప్రకారంగా చూస్తే 5 శాతం తగ్గినట్లు తెలుస్తోంది. కానీ అంచనాల ప్రకారం 45 శాతం వాల్యూమ్ తక్కువగా నమోదు అయింది.

    వాస్తవానికి పండుగల సీజన్ లో ఆటోమోబైల్ మార్కెట్లో టూవీలర్స్ అమ్మకాలు విపరీతంగా పెరుగుతాయని యూబీఎస్ అంచనా వేసింది. కానీ దేశంలో ప్రముఖంగా ఉన్న హీరో కంపెనీ నుంచి ఇటువంటి సేల్స్ ఊహించలేదని పేర్కొంటున్నారు. హీరో మోటార్స్ 2024 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 310 బేసిస్ పాయింట్లు తగ్గింది. దీంతో 28.8 శాతానికి చేరుకుంది. అంతేకాకుండా హోండా కంపెనీ కంటే హీరో 400 బేసిస్ పాయింట్లు వెనుకబడి ఉన్నాయి. కొత్త బైక్ లను తీసుకురావడంతో హరో కంపెనీ ముందు ఉన్నప్పటికీ సేల్స్ నమోదు చేసుకోవడం వెనుకబడినట్లు తెలుస్తోంది.

    అయితే టూ వీలర్స్ లో హోండా కంపెనీకి చెందిన షైన్ ఎక్కువగా సేల్స్ నమోదు చేసుకుంది. అలాగే మార్కెట్లోకి కొత్త ఈ బైక్ లు వస్తున్నాయి. దీంతో వినియోగదారులు సాంప్రదాయ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ తరుణంలో హీరో నుంచి రిలీజ్ అయ్యే బైక్ లపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తోది. హీరో నుంచి రిలీజ్ అయినా ఎక్స్ ట్రీమ్ 125 ఆర్ బైక్ లాంచ్ తరువాత హీరో తన మార్కెట్ వాటాను స్థిరంగా ఉంచుతుందని భావించింది. కానీ ఇదే సమయంలో హోండా వాటా పెరిగి హీరోను వెనక్కి నెట్టింది. దేశీయ మార్కెట్లో మరో మూడు సంవత్సరాల్లో హీరో తన స్థానాన్ని సంపాదించుకుంటుందని ఆశిస్తున్నారు. అయితే ఆ లోపు కోలుకోవాలని కొందరు కోరుకుంటున్నారు.