Best Family cars :  త్వరలో మార్కెట్లోకి.. హాయిగా కూర్చొని వెళ్లే బెస్ట్ ఫ్యామిలీ కార్లు ఇవే..వాటి ఫీచర్స్ ఏంటంటే?

సొంత కారు ఉంటే ఎక్కడికైనా తక్కువ ఖర్చతో ప్రయాణించవచ్చు. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు ఫ్యామిలీకి అనుగుణంగా ఉండే కార్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. వీటిలో ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఉండడంతో మరింత వెసులుబాటుగా ఉండే అవకాశం ఉంది. అయితే ఫ్యామిలీకి అనుగుణంగా ఉండే కార్లు ఏవో చూద్దాం.

Written By: Srinivas, Updated On : October 21, 2024 4:36 pm

Best Family cars

Follow us on

Best Family cars :  ప్రస్తుతం కాలంలో సొంత కారు ఉండాలని చాలా మంది కోరుకుంటున్నారు. సొంత అవసరాలతో పాటు కార్యాలయ అవసరాల కోసం కారు తప్పనిసరిగా మారింది. అయితే మిడిల్ క్లాస్ పీపుల్స్ ఫ్యామిలీకి అనుగుణంగా ఉండే కారును చూసుకుంటారు. ఎందుకంటే కుటుంబం మొత్తం కలిసి ప్రయాణాలు చేయాలని అనుకుంటే భారీగా ఖర్చు అవుతుంది. అదే సొంత కారు ఉంటే ఎక్కడికైనా తక్కువ ఖర్చతో ప్రయాణించవచ్చు. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు ఫ్యామిలీకి అనుగుణంగా ఉండే కార్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. వీటిలో ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఉండడంతో మరింత వెసులుబాటుగా ఉండే అవకాశం ఉంది. అయితే ఫ్యామిలీకి అనుగుణంగా ఉండే కార్లు ఏవో చూద్దాం…

మధ్యతరగతి వివినియోగదారులు ఎక్కువ శాతం కాంపాక్ట్ ఎస్ యూవీ కార్లను కోరుకుంటున్నారు. ఈ వేరియంట్ లో నిస్సాన్ కంపెనీ నుంచి కాంపాక్ట్ ఎస్ ఎంపీవీని తీసుకురాబోతుంది. ఈ మోడల్ 1.0 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 72 బీహెచ్ పీ పవర్, 96 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అయితే దీని ధర గురించి పూర్తి సమాచారం ప్రకటింలేదు. కానీ ఇది చిన్న ఫ్యామిలీకి అనుగుణంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

దక్షిణ కొరియా కంపెనీకి చెందిన కియా కార్లు దేశంలో దూసుకుపోతున్నాయి. ఈ కంపెనీ నుంచి త్వరలో కారెన్స్ ఈవీని తీసుకురాబోతుంది. ఎలక్ట్రిక్ వేరియంట్ లో వస్తున్న ఈ మోడల్ 2025లో మార్కెట్లోకి రాబోతుంది. ఇందులో 45 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటుంది. పవర్ ట్రెయిన్ క్రెటా మాదిరిగా ఉంటూ దాని ఫీచర్లను కలిగిన ఈ కారు సింగిల్ ఛార్జింగ్ తో ఎక్కువ మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. ఇదే కంపెనీ నుంచి మరో కారు ఫేస్ లిప్ట్ కూడా రాబోతుంది. ఇందులో ఎల్ ఈడీ లైట్స్, డీఆర్ఎల్ రివైజ్ట్ ప్రంట్ బంపర్లు ఉన్నాయి. 6 ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్ టెక్నాలజీ వంటి సేప్టీ ఫీచర్లో ఉన్న ఈ కారు త్వరలో వినియోగదారులకు చేరువలో కానుంది.

ఎస్ యూవీ ల దిగ్గజ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి కొత్త కారు రాబోతుంది. దీని నుంచి 7 సీటర్ ఈవీ పరిచయం కావడానికి రెడీగా ఉంది. ఇందులో 80 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ ను లకలిగి ఉండడంతో పాటు 227 బీహెచ్ పీ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. ప్రయాణికుల కోసం పెద్ద క్యాబిన్ ను అమర్చారు. పెద్ద ఫ్యామిలీ ఉన్న వారు ఇందులో సుదూరం ప్రయాణం చేయొచ్చు. మహీంద్రా కంపెనీ నుంచే మరో కారు XUVఈవీ 9 త్వరలో మార్కెట్లోకి రాబోతుంది. 80 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉన్న ఈ కారు ఎస్ యూవీ కూపే వెర్షన్ లో రాబోతుంది. ఇందులో 350 బీహెచ్ పీ పవర్ ఉత్పత్తి కానుంది. ఇవే కాకుండా చాల వరకు ఈవీలు ఫ్యామిలీకి అనుగుణంగ ఉండేందుకు రంగంలోకి దిగనున్నాయి.