National Weather Report : దేశంలో వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి. వర్షాకాలం పూర్తి కావడంతో శీతాకాలం సీజన్ మొదలవుతోంది. ఇప్పటికే దేశంలో ఎక్కువశాతం వర్షాలు కురిపించే నైరుతి రుతుపవాల తిరోగమనం పూర్తయింది. ప్రస్తుతం ఈశాన్య రుతుపవనాలు యాక్టివ్‌గా ఉన్నాయి. వీటి ప్రభావంతో తమిళనాడులో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడుతున్న అల్పపీడనాలతో తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణ భారత దేశంలోని మహారాష్ట్ర, కర్ణాకలోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఇక వాతావరణ మార్పులతో ఆకాశం చాలా వరకు మేఘావృతమై ఉంటుంది. దీంతో ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతున్నాయి. మంచు కూడా కురుస్తోంది. దీంతో చలి మొదలవుతోంది. ఉత్తర భారత దేశంలో గరిష్ట ఉష్ణోగ్రతలతోపాటు కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కన్నా తక్కువగా నమోదువుతున్నాయి. అహ్మదాబాద్‌లో ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కన్నా 1.5 డిగ్రీలు తక్కువగా 34.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రానున్న ఐదు రోజులు ఉష్ణోగ్రతలు ఇలాగే నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
అల్పపీడనం ప్రభావం..
అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడి భారత పశ్చిమ తీరానికి దూరంగా కదులుతోంది. నేపథ్యంలో మంగళవారం నుంచి వర్షాల తీవ్రత తగ్గే అవకాశం ఉంది. అల్పపీడనం ప్రభావంతో దేశంలోని 58 ప్రాంతాల్లో ఒక మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజ్‌కోట్‌లో 117 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జునాగఢ్‌లోని మాలియా హటినాలో 89 మిల్లీమీటర్లు, మోర్బిలో 87 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తంగా 12 తాలూకాల పరిధిలో 50 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. సోమవారం వడోదర, ఛోటా ఉదేపూర్, నర్మదా, బరూచ్, సూరత్, డాంగ్, నవ్‌సారి, వల్సాద్, తాపీ, రాజ్‌కోట్, పోర్‌బందర్, జునాగఢ్, అమ్రేలి, భావ్‌నగర్ మరియు గిర్–సోమ్‌నాథ్ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని అంచనా.
శీలత గాలులు..
ఇదిలా ఉంటే.. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర భారత దేశంలో శీతల గాలులు వీస్తున్నాయి. ఈ కారణంగా కూడా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. చలి ప్రభావం పెరుగుతోంది. ఢిల్లీలో ఇప్పటికే పొగమంచు పెరుగుతోంది. బిహార్‌లో చలి పెరిగింది. ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లోనూ చలి పెరుగుతోంది.