Homeక్రీడలుVirat Kohli- Da Silva: కోహ్లీ కోసమే ఆమె వస్తోంది

Virat Kohli- Da Silva: కోహ్లీ కోసమే ఆమె వస్తోంది

Virat Kohli- Da Silva: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. విరాట్ కోహ్లీని పిచ్చిగా అభిమానించే వారి సంఖ్య కోట్లలో ఉంటుంది. ఈ జాబితాలో ఎంతోమంది ప్రముఖులు కూడా ఉన్నారు. ఇదే జాబితాకు చెందుతాడు వెస్టిండీస్ జట్టు కీపర్ జాషువా డా సిల్వా. డా సిల్వాతోపాటు వాళ్ళ అమ్మకు కూడా కోహ్లీ ఆట అంటే చాలా ఇష్టం. కోహ్లీ ఆటను చూసేందుకు అని డా సిల్వా తల్లి చెప్పిన విషయాన్ని కోహ్లీతో చెప్పాడు. కోహ్లీ, డా సిల్వా మధ్య జరిగిన సంభాషణ స్టంపు మైక్ లో రికార్డు అయింది. ప్రస్తుతం వీరిద్దరి మధ్య సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

వెస్టిండీస్ పర్యటనలో భాగంగా భారత జట్టు రెండో టెస్ట్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ఆడడం ద్వారా విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను దక్కించుకున్నాడు. ప్రపంచ క్రికెట్ లో 500 మ్యాచ్ ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు కోహ్లీ. అయితే కోహ్లీ అంటే అమితంగా ఇష్టపడే వెస్టిండీస్ జట్టు కీపర్ డా సిల్వా తల్లి.. కోహ్లీ ఆటను చూసేందుకు వస్తానని కొడుకుతో చెప్పింది.

ఈ విషయాన్ని రెండో టెస్టులో వేగంగా బ్యాటింగ్ కు వచ్చిన కోహ్లీకి చెప్పాడు డా సిల్వా. ” మా అమ్మ నాకు ఫోన్ చేసి విరాట్ కోహ్లీ కోసం మ్యాచ్ చూడటానికి వస్తున్నానని చెప్పింది. అది నేను నమ్మలేకపోయాను” అని కోహ్లీతో డా సిల్వా చెప్పాడు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో కోహ్లీ అదరగొట్టాడు. 206 బంతుల్లో 121 పరుగులు చేశాడు కోహ్లీ. 500 మ్యాచ్ ఆడడం ఒక ఎత్తు అయితే ఈ మ్యాచ్ లో సెంచరీ చేయడం మరో ఎత్తు. 500 మ్యాచ్ లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు.

RELATED ARTICLES

Most Popular