Homeబిజినెస్Samsung Galaxy S23 : ఆఫర్ పోతే మళ్లీ రాదు త్వరపడండి.. రూ.1.5లక్షల ఫోన్ కేవలం...

Samsung Galaxy S23 : ఆఫర్ పోతే మళ్లీ రాదు త్వరపడండి.. రూ.1.5లక్షల ఫోన్ కేవలం రూ.75వేలకే

Samsung Galaxy S23 : ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. రోజుకు ఎన్నో వందల మోడల్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. తక్కువ ధరకే ఎన్నో ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. తమ దగ్గర ఫోన్ ఉన్నప్పటికీ అప్ డేట్ ఫోన్ కావాలని కొందరు చూస్తున్నారు. అలా స్మార్ట్ ఫోన్ తీసుకోవాలని భావించే వారి ఇది మంచి సమయం. ఎందుకంటే ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ పండుగ సేల్‌ను పొడిగించింది. ఇప్పటికీ ఉత్తమ డిస్కౌంట్లతో టాప్ కంపెనీల ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. తక్కువ బడ్జెట్లో గొప్ప ఫీచర్లతో ఉన్న స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఈ సేల్‌లో మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వాస్తవానికి, ఈరోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేటపుడు మొదటగా డిమాండ్‌ చేస్తున్నది కెమెరాకే. ఫోన్ కొనే ముందు తమ బడ్జెట్ తో పాటు అందరూ కెమెరాపై కూడా దృష్టి పెడుతున్నారు. చాలా మంది ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఫోటోలను వీడియోలను అప్ లోడ్ చేస్తుంటారు. అందుకు క్వాలిటీ గల ఫోటోలు, వీడియోలు అవసరం. కెమెరా మంచిగా లేకపోతే ఫోటోలు సరిగా రావు. అందుకే సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లు ఐఫోన్‌ని కలిగి ఉంటారు లేదా శాంసంగ్ S23ని కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. వాస్తవానికి, ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీరు డీఎస్ ఎల్ ఆర్ కెమెరా వంటి ఫోటోలు, వీడియోలను తీయవచ్చు. దీని అధిక ధర కారణంగా కొంతమంది దీనిని కొనుగోలు చేయలేకపోతున్నారు. కానీ ఇప్పుడు నిరాశ చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ ఫోన్‌ను చౌకగా కొనుగోలు చేయవచ్చు. దానిపై 49 శాతం తగ్గింపు ప్రయోజనాన్ని పొందవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అమెజాన్ తగ్గింపు
ఈ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 1,49,999 అయితే ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ మీకు బంపర్ తగ్గింపును అందిస్తోంది. 49 శాతం తగ్గింపుతో.. మీరు ఈ ఫోన్‌ను రూ.75,999కి పొందవచ్చచు. మీరు ఒకేసారి ఇంత పెద్ద మొత్తాన్ని చెల్లించలేకపోతే, ప్లాట్‌ఫారమ్ మీకు నో కాస్ట్ EMI ఆప్షన్ ను కూడా అందిస్తోంది. ఇందులో మీకు నచ్చిన విధంగా ప్లాన్ తీసుకోవచ్చు. ఇందులో, మీ నెలవారీ EMI ధర రూ. 7,630 వరకు ఉండవచ్చు. ప్లాట్‌ఫారమ్ ఈ ఫోన్‌పై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఈ ఫోన్‌పై రూ. 25,700 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ మొత్తం విలువ మీ పాత ఫోన్ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది, మోడల్, బ్యాటరీ, పనితీరు మొదలైనవన్నీ ప్లాట్‌ఫారమ్ టర్మ్-షరతులను అనుసరించాలి.

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఫీచర్లు
గెలాక్సీ ఆల్ట్రా S23లో 6.8 అంగుళాల కర్వ్డ్ డిస్‌ప్లేను పొందుతారు. స్మార్ట్‌ఫోన్‌లో Qualcomm Snapdragon 8 Generation 2 చిప్‌సెట్ అమర్చబడింది. ఇందులో మీరు 256 GB, 512 GB , 1 TB స్టోరేజ్ ఆప్షన్‌లను పొందుతారు. ఫోటో-వీడియో కోసం, మీరు 200 మెగాపిక్సెల్‌ల ప్రాథమిక కెమెరా, 12 మెగాపిక్సెల్‌ల సెకండరీ కెమెరా, 10 మెగాపిక్సెల్‌ల టెలిఫోటో కెమెరాను పొందుతారు. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం మీరు 12 మెగాపిక్సెల్ కెమెరాను పొందుతారు. 5000mAh బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్ ప్రతి ఒక్కరికి గొప్ప ఆప్షన్ అని నిరూపించవచ్చు.

 

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular