Hindustan Motors Ambassador: భారతదేశంలో ఒకప్పుడు ధనవంతుల ఇళ్లల్లో మాత్రమే కార్లు ఉండేవి. వీటిలో ఎక్కువగా Ambassador కార్లు కలిగి ఉన్నవారు కొంతమంది మాత్రమే ఉండేవారు. 1957లో పురుడు పోసుకున్న ఈ కారు దశాబ్దాలుగా కార్ల వినియోగదారుల మనసును దోచుకొని 2014 నుంచి మార్కెట్లోకి రావడం ఆగిపోయింది. ఆ తర్వాత ఎన్నో రకాల అప్డేట్ కాళ్లు రావడంతో అంబాసిడర్ గురించి ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఈ కారును అప్డేట్ వర్షంతో మార్కెట్లోకి Hindustan company తీసుకురాబోతోంది. దీనికి సంబంధించిన వివరాలను ఇటీవల ఆన్లైన్లో పొందుపరిచింది. అచ్చం పాతకారుల అనిపించేలా ఉన్న ఈ కారు లో నేటి తరానికి ఉపయోగపడేలా ఫీచర్స్, ఇంజన్ విధానాన్ని తీర్చిదిద్దారు. మరి దీని గురించి పూర్తి వివరాలు లోకి వెళ్తే..
Hindustan Ambassador అంటే ఒక వెహికల్ కాకుండా సెంటిమెంటు కారుగా భావించేవారు చాలామంది ఉన్నారు. అందుకే ఈ కారు డిజైన్ పాత కారు వాలే తీర్చిదిద్దారు. స్పష్టమైన సిలౌట్ తో నిర్మించినప్పటికీ.. నేటి తరానికి ఆకట్టుకునేలా ఆధునిక LED హెడ్ లాంప్స్ ఆకట్టుకుంటాయి. గ్రిల్, అల్లాయ్ వీల్స్ ఎదుటివారిని ఇంప్రెస్ చేస్తాయి. దీనిపై తీర్చిదిద్దిన క్రోమ్ ఎటువంటి వాతావరణాన్ని అయినా తట్టుకునే విధంగా తయారు చేశారు. అలాగే ఈ కారులో స్మూత్ పవర్, రిఫైన్డ్ డ్రైవింగ్ కోసం పెట్రోల్ తో పాటు డీజిల్ ఇంజన్ ను అమర్చారు. ఈ ఇంజన్ మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. నగరాలతో పాటు దూర ప్రయాణాలు చేసే వారికి ఇది అనుగుణంగా ఉంటుంది. ఇందులో మొత్తం 5 సీడ్స్ అమర్చారు. ఇవి కూర్చునే వారికి అద్భుతమైన లెగ్ రూమ్ తోపాటు హెడ్ రూమ్ ఉండే విధంగా కంపోర్టుతో ఉంటాయి.
అప్డేట్ అయినా ఈ కారులో సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉంచారు. కావాల్సిన ఎయిర్ బ్యాగ్స్ తోపాటు ABS టెక్నాలజీ తో కూడిన స్టెబిలిటీ కంట్రోల్ ఇందులో అమర్చారు. సస్పెన్షన్ ట్యూనింగ్ రైడ్ సౌకర్యంపై దృష్టి పెడుతుంది. ఇలాంటి రోడ్లపైనైనా సులభంగా వెళ్లే విధంగా క్యాబిన్ ను అమర్చారు. కంఫర్టబుల్ చట్రం క్రూసింగ్తో డ్రైవర్లకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక ఈ కారులో ఇన్నర్ స్పెసిఫికేషన్ లేటెస్ట్ కార్ల వినియోగదారులకు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్, ఆడియో కంట్రోల్ వంటివి ఉన్నాయి, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్ విండోస్, కీలెస్ ఎంట్రీ వంటివి సౌకర్యాన్ని ఇస్తాయి. అలాగే ఇన్, అవుట్ కోసం సులభంగా తీర్చుకునే డోర్స్ వంటివి నవీకరించబడ్డాయి. విశాలమైన క్యాబిన్ ఉండడంతో పాటు లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఈ కారును ఫ్యామిలీ మెంబర్స్ కు అనుగుణంగా ఉంటుంది. అలాగే కార్యాలయ అవసరాలకు కూడా ఇది హోదాను ఇస్తుంది. ఆధునికరించబడిన అంబాసిడర్ కారు 2026 మార్చి లో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని రూ.10 లక్షల ప్రారంభ ధరతో విక్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.