Kia Seltos Global Premium: దక్షిణ కొరియాకు చెందిన Kia భారత ఆటోమోబైల్ మార్కెట్లో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి వచ్చిన ఎన్నో కార్లు కస్టమర్స్ ను ఇంప్రెస్ చేశాయి. దీంతో ఇక్కడే ప్లాంట్ ఏర్పాటు చేసి ఆకర్షణ ఏమైనా వెహికల్స్ ను ఉత్పత్తి చేస్తుంది. అయితే కియా నుంచి వచ్చిన seltos మోడల్ కు అత్యంత ఆదరణ లభించింది. కానీ వినియోగదారుల అభివృద్ధిలకు అనుగుణంగా దీనిని అప్డేట్ చేయాల్సి వచ్చింది. అందుకే Kia Seltos Global Premium పేరుతో కారు ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఇది డిజైన్ తో పాటు ఇంటీరియర్ ఫీచర్స్, ఇంజన్ పనితీరు అద్భుతంగా ఉందని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు. గతంలో వచ్చినా కార్ల కంటే ఇది ఇప్పటి తరానికి అనుగుణంగా తీర్చిదిద్దినట్లు చెబుతున్నారు. మరి ఈ కారు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
హైబ్రిడ్ పవర్ ట్రెయిన్, ఆల్ విల్ డ్రైవ్ ఎంపికతో ఉన్న కొత్త కియా కారు విభినంగా కనిపిస్తోంది. ఇందులో పెట్రోల్, డీజిల్ ఇంజన్లు, ఫ్రంట్ వీల్ డ్రైవ్ లు వినియోగదారులను ఇంప్రెస్స్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఎక్స్టీరియర్ డిజైన్ విషయానికి వస్తే.. ఆకట్టుకునే ఎల్ఈడి టెయిల్ lamp, స్టైలిష్ గా ఉండే 18 అంగుళాల వీల్స్ పూర్తిగా ఆధునికరించబడ్డాయి. స్టైలిష్ కారు కోరుకునే వారికి ఇది బాగా నచ్చుతుంది. ఇన్నర్ విషయానికి వస్తే.. రెండు స్క్రీన్ లను చూడవచ్చు. వీటిలో ఒకటి ఇన్ఫోటైన్మెంట్ సిస్టం మరొకటి డ్రైవర్ డిస్ప్లే కనిపిస్తుంది. ఈ రెండు కూడా 12.3 అంగుళాల స్క్రీన్లు ఉంటాయి. ఆటోమేటిక్ క్లైమేట్ ఉండడానికి వెంటిలేటెడ్ సీట్స్ సౌకర్యంగా ఉన్నాయి. అలాగే పనోరమిక్ sunroof, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, యాంబీయంట్ లైటింగ్ ఆకర్షిస్తుంది.
అలాగే ఇందులో లేటెస్ట్ టెక్నాలజీని అమర్చారు. ఇవి ఇప్పటి తరం వినియోగదారులను ఎంతో ఆకట్టుకుంటాయి. వీటిలో భాగంగా వైర్లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 360 డిగ్రీ కెమెరా, లెవెల్ 2 ADAS తో అప్గ్రేట్ చేయబడిన ఇన్ఫోటైన్మెంట్ పవర్ ట్రెయిన్ వంటివి మెరుగైన పనితీరును అందిస్తాయి. SUV వేరియంట్ లో ఉన్న ఈ కారు ప్రీమియం అనుభవాన్ని పొందవచ్చు. అత్యధిక వేగంతో ప్రయాణం చేసినా కూడా స్థిరత్వాన్ని పొందుతుంది. సున్నితమైన పవర్ డెలివరీ, సమర్థవంతమైన ఇంజన్ తో నిర్వహణ ఖర్చులను తగ్గిస్తుంది.