https://oktelugu.com/

Thar Roxx : పవర్ ఫుల్ అప్ డేట్స్ తో మార్కెట్లోకి వచ్చిన థార్ రాక్స్

Thar Roxx : థార్ రాక్స్‌ను అన్‌లాక్ చేయడానికి , లాక్ చేయడానికి కస్టమర్లు కీఫాబ్‌ను ఉపయోగించాల్సి వచ్చేది. అయితే, ఇప్పుడు కీలెస్ ఎంట్రీతో, డోర్ హ్యాండిల్‌పై ఒక బటన్ ఉంది, దానిని నొక్కినప్పుడు కారును అన్‌లాక్ చేసి లాక్ చేస్తుంది. కాబట్టి కస్టమర్లు ఇకపై తమ జేబులోంచి కీఫోబ్ తీయాల్సిన అవసరం లేదు.

Written By: , Updated On : March 19, 2025 / 09:17 PM IST
Mahindra Thar Roxx

Mahindra Thar Roxx

Follow us on

Thar Roxx :ఇండియా మార్కెట్లో మహీంద్రా థార్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు దాని అప్ డేట్ చేస్తూనే ఉంటుంది కంపెనీ. ఈ క్రమంలోనే మరోసారి మహీంద్రా థార్ రాక్స్ అప్ డేట్ వెర్షన్ 2025 మోడల్ లాంచ్ చేసింది. ఇది మాత్రమే కాదు, మహీంద్రా SUV లో 3 కొత్త ఫీచర్లను కూడా అప్‌డేట్ చేసింది. దీని కారణంగా ఇది మునుపటి కంటే మరింత సౌకర్యవంతంగా, లగ్జరీగా మారింది. మహీంద్రా దానిలో కీలెస్ ఎంట్రీ, స్లైడింగ్ ఆర్మ్‌రెస్ట్, ఏరో వైపర్‌లను అందించింది.

Also Read : షాకింగ్.. రూ.1000కోట్ల విలువైన మెర్సిడెస్ కొన్న ఇండియన్స్

ఇప్పటి వరకు, థార్ రాక్స్‌ను అన్‌లాక్ చేయడానికి , లాక్ చేయడానికి కస్టమర్లు కీఫాబ్‌ను ఉపయోగించాల్సి వచ్చేది. అయితే, ఇప్పుడు కీలెస్ ఎంట్రీతో, డోర్ హ్యాండిల్‌పై ఒక బటన్ ఉంది, దానిని నొక్కినప్పుడు కారును అన్‌లాక్ చేసి లాక్ చేస్తుంది. కాబట్టి కస్టమర్లు ఇకపై తమ జేబులోంచి కీఫోబ్ తీయాల్సిన అవసరం లేదు.

ఇప్పుడు దీనిలో స్లైడింగ్ ఆర్మ్‌రెస్ట్ కూడా అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఆర్మ్‌రెస్ట్ డ్రైవర్‌కు మాత్రమే అందుబాటులో ఉండేది..కానీ ఇప్పుడు కో-డ్రైవర్, బ్యాక్ సీట్లలో కూర్చున్న ప్రయాణికులకు కూడా ఆర్మ్ రెస్ట్ సౌకర్యం లభిస్తుంది. అలాగే ఈ SUV కి కొత్త వైపర్లు అందించారు. అవి ఏరోట్విన్ స్టైల్లో ఉన్నాయి. ఇది స్టాండర్డ్ వైపర్ల కంటే తక్కువ సౌండ్ ఉత్పత్తి చేస్తుంది. గ్లాస్ ను పూర్తిగా క్లీన్ చేస్తుంది.

మహీంద్రా థార్ రాక్స్ ధర రూ. 12.99 లక్షల నుండి ప్రారంభమై రూ. 23.09 లక్షల(ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుంది. మహీంద్రా థార్ రాక్స్‌ను 2.2-లీటర్ డీజిల్ ఇంజన్, 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. రెండు ఇంజన్లు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తాయి. దీనితో పాటు థార్ రాక్స్ డీజిల్ ఇంజిన్‌తో కూడిన 4×4 పవర్‌ట్రెయిన్‌తో కూడా వస్తుంది.

మహీంద్రా థార్ రాక్స్ అనేది 5 డోర్ల వేరియంట్, ఇది MX1, MX3, AX3L, MX5, AX5L, AX7L వంటి ఆరు వేర్వేరు వేరియంట్లలో లభిస్తుంది. AX3L వేరియంట్ స్పెషల్ గా డీజిల్ ఇంజిన్, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. AX5L వేరియంట్ డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. కానీ ఇది ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తుంది. మిగిలిన వేరియంట్లు పెట్రోల్ ఇంజన్లతో పనిచేస్తాయి. ఫోర్-వీల్ డ్రైవ్ (4WD) ఎంపికలు MX5 వేరియంట్ నుండి ప్రారంభమవుతాయి. టాప్ మోడళ్లలో అందుబాటులో ఉన్నాయి. 4WD మోడల్‌కు పెట్రోల్ ఇంజన్ ఆఫ్షన్ అందుబాటులో లేదు.