Hero Dhanush Divorce Issue
Hero Dhanush : యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న నటులలో ఒకరు ధనుష్. తమిళనాడు లో ఈయన యూత్ ఆడియన్స్ ఉర్రూతలు ఊగిపోయే సినిమాలు ఎన్నో చేశాడు. తెలుగు లో కూడా ధనుష్(Hero Dhanush) కి మంచి క్రేజ్ ఉంది. రీసెంట్ గానే ఆయన తెలుగు లో ‘సార్’ అనే మూవీ చేశాడు. ఇది ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన శేఖర్ కమ్ముల(Shekar Kammula) తో ‘కుబేర'(Kubera Movie) అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇలా అన్ని ప్రాంతీయ భాషల్లో సినిమాలు చేస్తూ అన్ని వర్గాల ఆడియన్స్ లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ధనుష్, నిజంగానే దేశం గర్వించదగ్గ నటులలో ఒకరు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఈయనకు కోలీవుడ్ లో జల్సా రాయుడు అనే పేరుంది.
Also Read : రజినీకాంత్ స్టార్ డమ్ ను బీట్ చేయలేకపోయిన కమల్ హాసన్…కారణం ఏంటంటే..?
ఆయనకు రజినీకాంత్(Superstar Rajinikanth) కూతురు ఐశ్వర్య తో పెళ్లి అయ్యి చాలా కాలం అయ్యింది, అయినప్పటికీ హీరోయిన్స్ తో ఎక్కువగా కలిసి తిరగడం, వాళ్ళతో అఫైర్స్ నడపడం వంటివి చేసేవాడని, ఐశ్వర్య ధనుష్ లో ఉన్న ఈ బలహీనత ని చాలా కాలం వరకు భరించిందని, ఇక భరించే ఓపిక లేకనే ఆమె విడాకులు తీసుకుందని అందరూ కోలీవుడ్ లో అంటుంటారు. ఇటీవలే ప్రముఖ సీనియర్ తమిళ జర్నలిస్ట్ చేయార్ బాలు ధనుష్ గురించి చెప్పిన కొన్ని మాటలు తమిళ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ధనుష్ ప్రముఖ హీరోయిన్ అమలాపాల్(Amala Paul) తో కలిసి ‘రఘువరన్ బీటెక్’, ‘రఘువరన్ బీటెక్ 2’ వంటి సినిమాలు చేశాడు. అయితే రెండవ సార్ ఆమెతో కలిసి చేస్తున్నప్పుడు ఎక్కువగా అమలాపాల్ ఇంట్లోనే గడిపేవాడట ధనుష్. ఈ విషయం తెలుసుకున్న ఐశ్వర్య అక్కడ నీకేం పని అంటూ పలుమార్లు గొడవ పెట్టుకుందట.
ఇలా అమలాపాల్ తో ధనుష్ బాగా క్లోజ్ గా ఉంటున్నాడు అనే విషయం సూపర్ స్టార్ రజినీకాంత్ కి తెలిసిందట. ఆయన వెంటనే అమలాపాల్ ఇంటికి వెళ్లి, ఇలాంటి రూమర్స్ వసున్నాయి, మీ మధ్య నిజాంగా అలాంటి సంబంధమే ఉంటే ఇక్కడితో ఆపేయి, ధనుష్ కి పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు అని అన్నాడట. ఇవన్నీ మీరు మీ అల్లుడికి చెప్పకుండా నాకెందుకు చెప్తున్నారు అని అమలాపాల్ కూడా చాలా సీరియస్ గా రియాక్షన్ ఇచ్చిందట. ఇలా ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, ఎన్నో సార్లు ధనుష్ ఇలా చేయడం చూసి విసుగెత్తిపోయిన ఐశ్వర్య విడాకులు తీసుకుందని కోలీవుడ్ లో నడిచే ఒక చర్చ అన్నమాట. అయితే అమలాపాల్ ముందుగా విజయన్ అనే డైరెక్టర్ ని పెళ్లాడింది, ఆ తర్వాత అతనితో అభిప్రాయం బేధాలు వచ్చి విడిపోయింది. కొన్నాళ్ల తర్వాత ఆమె జగత్ దేశాయ్ అనే అతన్ని 2023 లో పెళ్ళాడి స్థిరపడిపోయింది.