Green Card: గ్రీన్‌కార్డు ఇక ఈజీ.. వీసాదారులకు శుభవార్త చెప్పిన అమెరికా!

ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్, రిపబ్లిక్‌ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పోటీ పడుతున్నారు.

Written By: Raj Shekar, Updated On : June 19, 2024 8:14 am

Green Card

Follow us on

Green Card: అగ్రరాజ్యం అమెరికా అధినేత జోబైడెన్‌ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. పర్మనెంట్‌ రెడిడెంట్స్‌ (గ్రీన్‌ కార్డ్‌) పొందే ప్రక్రియను సులభతరం చేస్తూ జో బైడెన్‌ కొత్త నిబంధనలు అమలు చేయనున్నట్లు వైట్‌హౌస్‌ తెలిపింది.

అధ్యక్ష ఎన్నికల వేళ..
ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్, రిపబ్లిక్‌ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పోటీ పడుతున్నారు. ఈ తరుణంలో అమెరికా ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు బైడెన్‌ సర్కార్‌ పీఆర్‌ నిబంధనల్ని సడలించడానికి ముందుకు వచ్చింది.

కొత్త రూల్స్‌ ఇలా.
ఈ కొత్త రూల్స్‌ ప్రకారం..అమెరికా పీఆర్‌ కోసం అప్లయ్‌ చేసుకునేందుకు కాదని, ఇప్పటికే పీఆర్‌కు అర్హులైన వారికి మాత్రమే ఈ కొత్త నిబంధనలు వర్తించనున్నట్లు సమాచారం. గ్రీన్‌కార్డ్‌ కావాలంటే అర్హులైనవారు సొంత దేశంలోని యూఎస్‌ ఎంబీసీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇక కొత్త రూల్స్‌ అమెరికా విడిచి వెళ్లే అవసరం లేకుండా అక్కడి నుంచే పీఆర్‌ కోసం అప్లయ్‌ చేసుకోవచ్చు.

గతంలో ఇలా..
2024 జూన్‌ 17 వరకు అమెరికా ఇమిగ్రేషన్‌ నిర్ణయంతో గ్రీన్‌ కార్డు రావాలంటే కనీసం అమెరికా పౌరులుగా కనీసం 10 ఏళ్లు ఉండాలి. అప్పుడే పీఆర్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇమ్మిగ్రేషన్‌ అధికారుల అంచనా ప్రకారం.. పీఆర్‌ కోసం అప్లయ్‌ చేసుకునేవారి సంఖ్య 5 లక్షలు ఉండొచ్చు. అదనంగా అమెరికన్‌ సిటిజన్లు దత్తత తీసుకున్న 50 వేల మంది పిల్లలు ఉన్నారు.