Tesla Cybertruck: ప్రపంచవ్యాప్తంగా Tesla కంపెనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది.. దీని నుంచి ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన ఎలక్ట్రిక్ కార్లకు విశేష గుర్తింపు వచ్చింది. అయితే ఇప్పటివరకు ప్యాసింజర్ కారులను అందుబాటులో ఉంచిన టెస్లా.. ఇప్పుడు వాణిజ్య వాహనాల విషయంలో కూడా ముందడుగు వేయాలని చూస్తోంది. ఇందులో భాగంగా మిగతా కంపెనీల ట్రక్కులకు గట్టి పోటీ ఇచ్చేందుకు ఈ కంపెనీ సైబర్ ట్రక్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. పూర్తిగా ఎలక్ట్రిక్ వేరియంట్ లో వస్తున్న ఈ కారు అడ్వాన్స్డ్ టెక్నాలజీ తో పాటు.. అత్యధిక బరువులు మోయగల వాహనంగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ కారు విశేషాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
వాణిజ్య అవసరాల కోసం కొనుగోలు చేసే వారికోసం టెస్లా కంపెనీ సైబర్ ట్రక్ పేరుతో సురక్షితమైన వాహనాన్ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. పూర్తిగా ఎలక్ట్రిక్ పికప్ ట్రక్ గా దీనిని పిలుస్తున్నారు. ఇందులో రెండు మోటార్లు ఉన్నాయి. ఒకటి AWD ట్రై మోటర్, మరొకటి AWD సైబర్ బీస్ట్ ఉన్నాయి. ఇవి ఒకసారి చార్జింగ్ చేస్తే 2.6 సెకండ్లలోనే జీరో నుంచి 60 మైళ్ళ వరకు చేరగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఒకసారి చేసిన చార్జింగ్ పై 320 నుంచి 325 మైళ్ళ వరకు ప్రయాణం చేయవచ్చు. ఇందులో 123 కిలోవాట్ స్ట్రక్చరల్ బ్యాటరీ బ్యాక్ ను అమర్చారు. ఈ చార్జర్ 325 కిలోవాట్+ సపోర్ట్ తో చార్జింగ్ అవుతుంది.
టెస్లా సైబర్ ట్రక్ ముందటి భాగంలో ఐదుగురు సురక్షితంగా కూర్చునే విధంగా సెట్అప్ చేశారు. ఈ కారు డ్రైవర్ కు అనుగుణంగా డిజిటల్ డిస్ప్లేను అమర్చారు. ఇది నావిగేషన్ తోపాటు ప్రీమియం ఆడియో కూడా ఇవ్వనుంది. రక్షణ కోసం ఆటో పైలెట్ లేని అసిస్ట్, అత్యవసర బ్రేకింగ్ ను అమర్చారు. ఈ మోడల్ బాడీ మొత్తం స్టెయిన్ లెస్ స్టీల్ తో తయారు చేశారు. అలాగే ఇందులో అడాప్టివ్ సస్పెన్షన్ను అమర్చారు.
పూర్తిగా ఎలక్ట్రిక్ మయంతో ఉన్న ఈ వాహనం టోయింగ్ సామర్థ్యం 11,000 పౌండ్లు గా గుర్తించారు. పేలోడు 2,500 పౌండ్లు సామర్థ్యం ఉంది. దీనిని అమెరికాలో 79,000 డాలర్లతో విక్రయిస్తున్నారు. పర్యావరణ కాలుష్య నివారణకు, లేటెస్ట్ టెక్నాలజీతో వాహనం కావాలని అనుకునే వారికి ఈ వాహనం బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. దీని నుంచి ఎలాంటి కాలుష్యం వెలువడకుండా ఉండడంతో కొన్ని ప్రదేశాల్లో ఇది ప్రత్యేకంగా నిలవనుంది. అలాగే తక్షణమే వేగాన్ని అందుకునే ఇది అన్ని రోడ్లపై సురక్షితంగా వెళ్లగలిగే విధంగా సెట్ అప్ చేశారు.