Motorola Edge 60 Neo 5G: ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే చాలామంది చేతిలో స్మార్ట్ మొబైల్ ఉంటోంది. అయితే ఎప్పటికప్పుడు మొబైల్ అప్డేట్ చేసుకోవాలని ఉద్దేశంతో మార్కెట్లోకి వచ్చే కొత్త డివైస్ ను కొనుగోలు చేయాలని చాలామంది ఆసక్తి చూపుతారు. ఇందులో భాగంగా Motorla కంపెనీ కొత్త మొబైల్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చింది. దీని డిస్ప్లే తోపాటు బ్యాటరీ సామర్థ్యం అదరహో అన్నట్లు ఉండడంతో చాలామంది దీనిని కొనుగోలు చేయాలని చూస్తున్నారు. అయితే ధర సైతం అందుబాటులో ఉండడంతో ఈ ఫోన్ గురించి తెలుసుకుంటున్నారు. మరి మోటరోలా కంపెనీకి చెందిన ఈ మొబైల్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
Motorola కంపెనీ లేటెస్ట్ గా Edge 60 Neo 5G మొబైల్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీనిని చూడగానే కొనుగోలు చేసేలా ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉంది. తేలికైనా బాడీతో పాటు మృదువైన మ్యాట్ ఫినిష్ బ్యాక్ ప్యానెల్ చేతిలో సౌకర్యవంతంగా ఉంటుంది. కెమెరా మాడ్యూల్ వెనుక ఉన్న భాగం ప్రీమియం లుక్ ను అందిస్తుంది. ఈ ఫోన్ కు ప్రధాన ఆకర్షణ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఇందులో 6.36 Poled డిస్ప్లేను సెటప్ చేశారు. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. గొరిల్లా గ్లాస్ 7i తో ఉండే ఈ మొబైల్ స్క్రోలింగ్ స్మూత్ గా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్ లో మూవీస్ తో పాటు గేమింగ్ కోరుకునే వారికి సౌకర్యవంతమైన డిస్ప్లేను అందిస్తుంది.
ప్రతి మొబైల్ లో నేటి తరం కెమెరా బాగుండాలని కోరుకుంటుంది. వీరికి అనుగుణంగా మోటరోలా కంపెనీ అద్భుతమైన కెమెరాను అమర్చింది. ఇందులో 50 MP కెమెరాలు సెటప్ చేశారు. 13 MP అల్ట్రావైడ్ కెమెరాతో పాటు 10 MP టెలిఫోటో కూడా తీసుకోవచ్చు. అలాగే ఆప్టికల్ జూమ్ కూడా చేసుకోవచ్చు. సెల్ఫీలు కోరుకునే వారికి ఈ మొబైల్ 32 MP కెమెరాను అందిస్తుంది. ఇక వీడియో రికార్డింగ్ కోసం కూడా అనుగుణంగా కెమెరా ఉండి ఫోటోగ్రఫీ ఎంచుకున్న వారికి సపోర్టును ఇస్తుంది.
ప్రస్తుతం రోజంతా ఫోన్ వినియోగం తప్పడం లేదు. ఈ క్రమంలో రోజంతా వాడినా కూడా బ్యాటరీ వినియోగం ఉండేందుకు వీలుగా ఇందులో 5,200 mAh బ్యాటరీ సెట్టర్ను అమర్చారు. ఈ బ్యాటరీ 68 వాట్ టర్బో పవర్ తో చార్జింగ్ అవుతుంది. 15 వాట్ వైర్లెస్ చార్జర్ కూడా అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇందులో డౌన్ టైం కూడా తక్కువగా ఉండడంతో రోజువారి మొబైల్ వినియోగం చేసే వారికి అనుకూలంగా ఉండనుంది.
5జి కనెక్టివిటీ తోపాటు మొబైల్లో 8GB Ram ను సెట్ చేశారు. అలాగే 128 నుంచి 512 GB వరకు స్టోరేజ్ చేసుకుని అవకాశం ఉండడంతో ఉద్యోగులకు ఇది బాగా పనిచేస్తుందని అంటున్నారు. ప్రస్తుతం ఇది మార్కెట్లో 8 జిబి రామ్, 256 జిబి స్టోరేజ్ కలిగిన మొబైల్ రూ.28,999 తో విక్రయిస్తున్నారు. స్పెసిఫికేషన్ మారితే ధర కూడా మారే అవకాశం ఉంటుంది.