Tesla
Tesla: కార్ల ప్రపంచంలో TESLA గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ కంపెనీ వివిధ దేశాల్లో తనకారులను విక్రయిస్తుంది. అయితే ఈ కంపెనీ భారత్ లో అడుగు పెట్టేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. భారత్లో కార్ల విక్రయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ తమ ఉత్పత్తులను అత్యధికంగా సేల్స్ చేసుకోవచ్చని భావిస్తోంది. అయితే విదేశీ కార్ల విషయంలో భారత్ అధిక సుంకాలను విధిస్తూ వస్తోంది. అయితే ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తెస్లా కంపెనీ అధినేత ఎలన్ మస్క్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వీరిద్దరి సమావేశం తో టెస్లా కారు భారత్లో అడుగు పెట్టేందుకు మార్గం సుగమం అయిందని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..
భారత్లో తమ కంపెనీ కోసం వివిధ ఉద్యోగాలను ప్రకటిస్తూ టెస్లా కంపెనీ సోషల్ మీడియా పేజీలో అడ్వర్టైజ్మెంట్ను ఇచ్చారు. దీంతో ఈ కంపెనీ త్వరలో అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇండియాలోని మెట్రోపాలిటన్ సిటీలో టెస్లా కంపెనీ కస్టమర్ ఎగ్జిక్యూటివ్, ఆర్డర్ ప్రాసెసింగ్, సర్వీస్ మేనేజర్ వంటి ఉద్యోగాలను కోరుతోంది. ముందుగా ముంబైలో ఈ రిక్రూమెంట్ నిర్వహించనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. మొత్తంగా 13 పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అయితే టెస్లా భారత్లో అడుగుపెట్టడానికి ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. కానీ భారత్లో విధిస్తున్న సుంకాల విషయంలో ఆ కంపెనీ వెనుకడుగు వేస్తోంది. అంతేకాకుండా ఈ సుంకాల విషయంపై కూడా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇప్పటికే స్పందించారు.
అయితే ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో దిగుమతి సుంకం పై కీలక ప్రకటన చేశారు. 40,000 డాలర్ల కంటే అధిక ధర చేసే లగ్జరీకారులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 110% నుంచి 70% వరకు తగ్గించారు. దీంతో టెస్లా కంపెనీ తయారు చేసే ఎలక్ట్రిక్ కారును భారత్లో అడుగు పెట్టేందుకు అవకాశం గా లభించింది. అయితే ముందుగా తన కారులను భారత్లో దింపి విక్రయించాలని చూస్తోంది. ఆ తర్వాత ఇక్కడ ప్లాంట్ ను నెలకొల్పే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇందులో భాగంగానే జాబ్ ఆఫర్లను ప్రకటిస్తుందని పేర్కొంటున్నారు. ఇదే సమయంలో భారత ప్రధానమంత్రి టెస్లా కంపెనీ అధినేత సమావేశం కావడంతో ఈ కంపెనీ భారత్లో అడుగుపెట్టే అవకాశాలు మరింతగా మెరుగుపడే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే టెస్లా భారత్ లోకి అడుగుపెడితే ఏ కంపెనీకి పోటీ అవుతుందోనన్న చర్చ సాగుతోంది. కానీ టెస్లా కంపెనీ లగ్జరీ కార్లను మాత్రమే తయారు చేస్తోంది. ఈ కారు నుంచి ఇప్పటికే బయటకు వచ్చిన ఎన్నో కార్లు ఆదరణ పొందాయి. కానీ వీటి ధర మాత్రం అధికంగానే ఉంటుంది. భారత్ లోనూ లగ్జరీ కార్లను కొనే వారి సంఖ్య అధికంగానే ఉంది. ఈ నేపథ్యంలో టెస్లా తన ఆధిపత్యాన్ని చెలాయించడానికి భారత్లో అడుగు పెట్టాలని చూస్తుందని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం ప్రపంచంలో గుర్తింపు పొందిన కార్లు ఇక్కడికి వస్తాయని పేర్కొంటున్నారు. ఏదిఏమైనా ఎలాంటి మాస్క్ ఎంతోకాలంగా అనుకుంటున్నా కోరిక నెరవేరుతుందా లేదా అనేది చూడాలి..