https://oktelugu.com/

MLC Elections : కాంగ్రెస్‌కు అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి ప్లస్సా? మైనస్సా?

తెలంగాణ ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల ప్రచారం జోరందుకుంది. నామినేషన్ల ఘట్టం ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారంపై దృష్టి పెట్టారు. పట్టభద్రులు, టీచర్‌ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ పడుతున్న అభ్యర్థులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

Written By: , Updated On : February 19, 2025 / 02:59 PM IST
MLC Elections

MLC Elections

Follow us on

MLC Elections : తెలంగాణలో ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ, రెండు టీచర్‌ ఎమ్మెల్సీ స్థానాలకు ఫ్రిబ్రవరి 27న ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే నామినేషన్ల ఘట్టం పూర్తయింది. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానానికి 56 మంది, టీచర్స్‌ ఎమ్మెలీ స్థానాలకు 15 మంది బరిలో ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదర్, నిజాబాబాద్‌ పట్టభద్రుల స్థానానికి అధికార కాంగ్రెస్‌ పార్టీ తరఫున అల్ఫోర్స్‌(Alforse) విద్యా సంస్థల అధినేత వూట్కూరి నరేందర్‌రెడ్డి(Votkuri Narender Reddy) పోటీలో ఉన్నారు. అనూహ్యంగా ఆయన టికెట్‌ తెచ్చుకున్నారు. తెలంగాణ నేతలతో సంబంధం లేకుండా నేరుగా హైకమాండ్‌ నుంచే టికెట్‌ సాధించారని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.. ఇదే ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి, అటు నరేందర్‌రెడ్డికి మైనస్‌గా మారిందని అంటున్నారు.. కాంగ్రెస్‌ పార్టీలో జీవన్‌రెడ్డితోపాటు అద్దంకి దయాకర్, షబ్బీర్‌ అలీతోపాటు నాలుగు జిల్లాలకు చెందిన నేతలు టికెట్‌ ఆశించారు. కానీ, అల్ఫోర్‌ నరేందర్‌రెడ్డి తన ధన భలంతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy)తోగానీ, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌(Maheshkumar Goud)తోగానీ సంబంధం లేకుండా నేరుగా హైకమాండ్‌ను ప్రసన్నం చేసుకొని టికెట్ తెచ్చుకొని పోటీచేస్తున్నారని ఒక ప్రచారం అయితే బాగా నడుస్తోంది.. అధిష్టానం కూడా తెలంగాణ నేతలను సంప్రదించకుండానే నరేందర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఓకే చేసిందని అంటున్నారు. దీంతో ఇప్పుడు నరేందర్‌రెడ్డికి తెలంగాణలోని పార్టీ పెద్దలు సహకరించడం లేదట.. ప్రచారానికి భారీగానే ఖర్చు పెడుతున్నా కాంగ్రెస్‌ పార్టీ రూపాయి కూడా ఫండ్‌ ఇవ్వలేదని… దీంతో నరేందర్‌రెడ్డి సొంతంగా ప్రచారానికి ఖర్చుపెట్టుకుంటున్నట్టుగా చర్చ నడుస్తోంది.. విద్యా సంస్థల బలం చూసుకుని గెలుపుపై ధీమాగా నరేందర్ రెడ్డి ఉన్నారని అంటున్నారు.

-పెరుగుతున్న వ్యతిరేకత..

అయితే కాంగ్రెస్‌ అభ్యర్థికి పార్టీ నుంచి పూర్తిస్థాయిలో మద్దతు లభించడం లేదని కింది స్థాయి నేతలు అంటున్నారు.. ప్రచారంలో భాగంగా నాలుగు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో పట్టభద్రులను సమావేశానికి తీసుకురావాల్సిన పార్టీ నేతలు.. కార్యకర్తలను పిలుస్తున్నారు. కార్యకర్తలు మీటింగ్‌లకు వచ్చి వెళ్లిపోతున్నారు. మీటింగ్‌లకు వచ్చిన వారికి నరేందర్‌రెడ్డి సొంతంగా విందుతోపాటు డబ్బులు కూడా ఖర్చు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.. మీటింగ్‌లకు వచ్చినవారిలో నూటికి పది మంది కూడా పట్టభద్రులు(Graduates) ఉండడం లేదట.. మరోవైపు ప్రభుత్వంపై ఏడాదిన్న కాలంలోనే వ్యతిరేకత పెరిగింది. జాబ్‌ క్యాలెండర్‌ అమలు చేయడం లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేసింది. కాంగ్రెస్‌ కొత్తగా భర్తీ చేసిన ఉద్యోగాలు తక్కువే. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటనకే పరిమితమైది. విద్యార్థినులకు స్కూటీలు, ఉన్నత చదువులకు రుణ కార్డులు హామీలుగానే మిగిలాయి. దీంతో కాంగ్రెస్‌ పార్టీతోపాటు ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నరేందర్‌రెడ్డిపైనా ఈ వ్యతిరేకత బాగా పడుతోందని అంటున్నారు.

-ఫీజుల ఎఫెక్ట్ పడిందా?

ఇక నరేందర్‌రెడ్డిపై వ్యక్తిగతంగా కూడా చాలా మందిలో వ్యతిరేకత ఉందని ఓ ప్రచారం మొదలైంది.. తన విద్యాసంస్థల్లో చేరిన విద్యార్థులకు ఫీజుల్లో మినహాయింపులు ఇవ్వలేదని.. ఆయన విద్యాసంస్థల్లో చదువుతున్నవారిలో చాలా మంది ఆయన బాధితులేనని… ఫీజుల కోసం విద్యార్థులతోపాటు తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురిచేసేవాడన్న అభిప్రాయం విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.. దీంతో ఆయనకు అసలే ఓటు వేయొద్దని గ్రాడ్యుయేట్లు సైలెంట్‌గా ప్రచారం చేస్తున్నట్టు సమాచారం..

– సామాజికవర్గం కూడా దూరమే..

ఇక నరేందర్‌రెడ్డికి ఆయన సొంత సామాజికవర్గం కూడా దూరంగానే ఉంటోందని ప్రచారం నడుస్తోంది.. రెడ్డి సామాజికవర్గాని(Reddy Community)కి నరేందర్‌రెడ్డి ఏనాడు సాయం చేసిన దాఖలాలు లేవని… రెడ్డి సామాజికవర్గం పిల్లలకు ఫీజులో కూడా ఎలాంటి రాయితీలు ఇవ్వలేదని… మనం మనం ఒకే కులం అని చాలా మంది రెడ్డి సామాజికవర్గం తండ్రులు కలుపుకుపోయే ప్రయత్నం చేసినా.. వారితో దురుసుగా మాట్లాడిన సందర్భాలు కోకొల్లలు అని రెడ్డి నేతలు బాహాటంగానే అంటున్న పరిస్థితులున్నాయి.. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఓట్ల కోసం కుల సంఘాన్ని చేరదీసే ప్రయత్నం చేస్తున్నా వారు మనస్ఫూర్తిగా రావడం లేదట… పాత విషయాలను గుర్తు చేసుకుంటున్న చాలా మంది రెడ్డీలు నరేందర్‌రెడ్డి పట్ల వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని టాక్ నడుస్తోంది.

– ఫీజు డిస్కౌంట్‌ ఆఫర్లు..

గతంలో కాస్త ఫీజు తగ్గించమంటేనే ఇష్టానుసారం మాట్లాడి తల్లిదండ్రులు, విద్యార్థులను అవమానించారనే అపవాదు నరేందర్‌రెడ్డిపై పడింది.. తనపై గ్రాడ్యుయేట్లలో ఉన్న వ్యతిరేకతను తొందరగానే పసిగట్టారు. మొదట తన కాలేజీల్లో చదువుకున్నవారు ఓట్లే వేస్తారని భావించారు. కానీ అందరికన్నా ఎక్కువ వ్యతిరేత వారిలోనే ఉందని గుర్తించారు. దీంతో ఇప్పుడు ఫీజు రాయితీలు అంటూ ప్రచారం చేసుకుంటున్నట్టు భోగట్టా.. తన అనుచరులతో ప్రచారం చేయిస్తున్నారట.. తన కార్యాలయానికి పిల్లల తల్లిదండ్రులను పిలిపించి మరీ రాయితీ ఇస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.

– మీటింగ్‌లకు దూరంగా పట్టభద్రులు..

బీజేపీ, బీఎస్సీతోపాటు కొంత మంది స్వతంత్ర అభ్యర్థుల ప్రచారానికి గ్రాడ్యుయేట్లు హాజరవుతున్నారు. కానీ కాంగ్రెస్‌ పార్టీ తరఫున నరేందర్‌రెడ్డి ఏర్పాటు చేస్తున్న ప్రచారానికి, సభలకు గ్రాడ్యుయేట్లు దూరంగా ఉంటున్నారని ఓ ప్రచారం నడుస్తోంది.. రావాలని కోరినా ససేమిరా అంటున్నారట.. నరేందర్‌రెడ్డి సంగతి మాకు తెలుసు అని సమాధానం ఇస్తున్నారట.

మొత్తంగా కాంగ్రెస్‌ పార్టీ నరేందర్‌రెడ్డికి మైనస్‌ కాగా, కాంగ్రెస్‌ పార్టీకి నరేందర్‌రెడ్డి కూడా మైనస్‌ అయ్యారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.