Term Insurence Policy :ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించరు. ఇప్పుడున్న జీవితం ఎప్పటికీ ఒకేలా ఉంటుందని ఎవరూ అనుకోవద్దు. కాలగమనంలో అనుకోని ప్రమాదాలు, కష్టాలు వస్తుంటాయి. అందువల్ల ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండడానికి ఇన్సూరెన్స్ చాలా వరకు ఉపయోగపడుతుంది. ఒకవేళ దురదృష్టవశాత్తు కుటుంబ యజమానికి ఏదైనా ప్రమాదం జరిగినా ఆ తరువాత వారి పిల్లలకు ఇన్సూరెన్స్ సపోర్టుగా ఉంటుంది. అయితే ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కొందరు ఈ మిస్టేక్ చేస్తున్నారు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ఇన్సూరెన్స్ పై అవగాహన పెరుగుతుండడంతో చాలా మంది రకరకాల పాలసీలు తీసుకుంటున్నారు. కొందరు టర్మ్ పాలసీ తీసుకుంటే మరికొందరు టర్మ్ తో పాటు రిటర్న్స్ పాలసీలు తీసుకుంటున్నారు. ఈ సమయంలో వారు టర్మ్ విషయంలో ఓ తప్పు చేస్తున్నారు. టర్మ్ పాలసీల్లో నచ్చినది ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో ఒకటి 60 సంవత్సరాలు.. మరొకటి 80 సంవత్సరాల వరకు పెట్టుకోవచ్చు. అయితే కొంత మంది 80 సంవత్సరాలు సెలెక్ట్ చేసుకుంటున్నారు.
ఎక్కువ కాలం టర్మ్ పెట్టుకోవడం వల్ల ఎక్కువ లాభం ఉంటుందని ఆశిస్తున్నారు. కానీ అంత వరకు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎలాగంటే? ఒక వ్యక్తి 30 సంవత్సరాలు ఉండగా టర్మ్ పాలసీ తీసుకుంటే అతనికి 60 సంవత్సాలు వచ్చే సరికి అతని పిల్లలు 30 సంవత్సరాల వయసుకు వస్తారు. అప్పుడు వారు ఫైనాన్షియల్ గా సెటిల్ అవుతారు. ఆ తరువాత వారు తల్లిదండ్రుల ఆదాయంపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తికి టర్మ్ పూర్తయితే అతని అవసరాలకు ఉపయోగపడుతుంది.
ఈ మధ్య కాలంలో ఆ వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం ఇన్సూరెన్స్ కంపెనీ భరోసా ఉంటుంది. అయితే ఎక్కువ కాలం టర్మ్ ఎంచుకుంటే మాత్రం 60 సంవత్సరాలు రాగానే ఇబ్బంది పడుతారు. ఒక వేళ పిల్లలు సెటిల్ కాకపోతే మరిన్ని కష్టాలు ఎదుర్కోవలసి ఉంటుంది. అందువల్ల 60 సంవ్సరాల టర్మ్ చాలా మంచి ఆప్షన్. అయితే బెస్ట్ పాలసీ కోసం మాత్రం చూజ్ చేసుకోవాలంటే www.policybazar.comలోకి వెళ్లి సెలెక్ట్ చేసుకోవచ్చు.