CNG Automatic Gare Car : కాలం మారుతున్న కొద్దీ కార్ల వినియోగం పెరుగుతోంది. దీంతో కొత్త కొత్త మోడళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. వినియోగదారుల అభిరుచి, అవసరాలకు అనుగుణంగా కంపెనీలు కొత్త కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇదే సమయంలో కస్టమర్లను ఆకర్షించేందుకు వారికి సౌకర్యంగా ఉండేందుకు కొన్నిఫీచర్స్ ను అప్డేట్ చేస్తున్నాయి. ఇంతకాలం CNG కార్లలో 5 స్పీడ్ లేదా 6 స్పీడ్ గేర్లు మాత్రమే ఉండేవి. కానీ కొందరు మరింత వేగంగా లేదా.. తక్కువ స్పీడ్ తో వెళ్లాలనుకునేవారికి అసౌకర్యంగా ఉండేది. దీంతో ఓ కంపెనీ తన రెండు కార్లను ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో కొత్తగా అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ కార్ల ధరలు, ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..
దేశీయ కార్ల ఉత్పత్తిలో మిగతా కార్లతో టాటా పోటీపడుతోంది. ఈ కంపెనీ నుంచివచ్చిన వివిధ మోడళ్లు వినియోగదారులను ఆకర్షించాయి. ఇప్పటికే రిలీజ్ అయినా టాటా టియాగో, టిగోర్ సైతం ఇంప్రెస్ చేశారు. ఈ కార్లు కొత్తగా ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను కలిగి అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో టాటా టియాగో CNG 1.2 లీటర్ 3 సిలిండ్ పెట్రోల్ సహజత్వాన్ని కలిగి ఉంటుంది. అలాగే 85 బీహెచ్ పీ పవర్, 113 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం ఇది 5 స్పీడ్ గేర్ బాక్స్ నుకలిగి ఉంది. త్వరలో ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో రానుంది. దీని ధర రూ.6.55 లక్షలతో ప్రారంభం అవుతుంది. టాప్ ఎండ్ లో దీనిని రూ.8.20 లక్షల వరకు విక్రయిస్తున్నారు.
టాటా కంపెనీ నుంచి అందుబాటులోకి వచ్చే మరో కారు టిగోర్. టిగోర్ సైతం టియాగో ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ను కలిగి ఉంటుంది. ఈ రెండు 5 స్పీడ్ గేర్ బాక్స్ ను కలిగి ఉన్నాయి. ఈ రెండు కార్లు ప్రస్తుతం 26.40 కిలోమీటర్ల మైలేజ్ ను ఇస్తున్నాయి. ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో అందుబాటులోకి వస్తే వీటి మైలేజ్ పెరిగే అవకాశం ఉంది. సీఎన్ జీ కార్లు 5 లేదా 6 స్పీడ్ గేర్ బాక్స్ ను కలిగి ఉండడంతో కొందరు వీటి కొనుగోలుకు అనాసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం గేర్ బాక్స్ మార్చడంతో విక్రయాలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
ప్రస్తుతం కాలంలో చాలా మంది ఎస్ యూవీకార్ల పై ఆసక్తి చూపుతున్నారు. అయితే హ్యాచ్ బ్యాక్ కార్లలో సైతం కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చి వాటి అమ్మకాలు పెంచుతున్నారు. ధర విషయంలో మిడిల్ క్లాస్ పీపుల్స్ ను దృష్టిలో పెట్టుకొని ఉత్పత్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటి ధరలు కూడా రాను రాను పెరిగే అవకాశం ఉంది.