Homeబిజినెస్Tecno Pova 8 gaming smartphone: గేమింగ్ యూజర్లు, బ్యాటరీ లైఫ్ కోరుకునేవారికి బెస్ట్ ఫోన్...

Tecno Pova 8 gaming smartphone: గేమింగ్ యూజర్లు, బ్యాటరీ లైఫ్ కోరుకునేవారికి బెస్ట్ ఫోన్ ఇదే..

Tecno Pova 8 gaming smartphone: శక్తివంతమైన బ్యాటరీ, ఆకర్షణీయమైన డిజైన్, గేమింగ్ ఫీచర్లు కావాలని కోరుకునే మొబైల్ యూజర్లకు అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ మార్కట్లోకి త్వరలో రాబోతుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్, భారీ బ్యాటరీతో పాటు గ్లిఫ్-స్టైల్ లైటింగ్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. అయితే దీని వివరాల్లోకి వెళితె..

ఇండియాలో 11 జూన్ 2026 తేదీన Tecno Pova 8 స్మార్ట్ఫోన్ విడుదల కాబోతుందని అధికారికంగా ప్రకటించింది. ఈ మొబైల్ లో అత్యంత విశేషమైన ఫీచర్ బలమైన బ్యాటరీ. ఇందులో 8,000mAh బ్యాటరీ ఉండనుంది. ఇది Tecno బ్రాండ్ లోనే అత్యంత పెద్ద బ్యాటరీగా పేర్కొంటున్నారు. ఈ బ్యాటరీకి 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.

ఈ కొత్త మొబైల్ లో లో 6.76 అంగుళాల HD+ AMOLED డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్ తో ఉండడంతో గేమింగ్ యూజర్లకు అద్భుతమైన అనుభవం ఇస్తుంది. ప్రాసెసర్ విషయంలో మీడియాటెక్ డైమెన్సిటీ 7100 చిప్ ఉండనుంది. Android 16 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేసే ఇందులో 8GB RAM, 128GB స్టోరేజ్ ఉండే అవకాశం ఉంది.

Tecno Pova 8 మొబైల్ లో 50MP మెయిన్ కెమెరా ఉండనుంది. 13MP సెల్ఫీ కెమెరాను అమర్చారని తెలుస్తోంది. డిజైన్ విషయంలో, Tecno Pova 7నే పోలి ఉంటుందని తెలుస్తోంది. బ్యాక్ పానెల్ డిజైన్ కంపెనీ ఆఫీషియల్గా రివీల్ చేసింది. ఫోన్ యొక్క ఫ్రంట్ పానెల్ గ్లాస్తో తయారీ అయ్యింది. ఈ మొబైల్ ఇండియాలో రూ.25,000 నుండి రూ.30,000 మధ్యలో విక్రయిస్తారని అంచనా. ఈ మొబైల్ ప్రధానంగా గేమింగ్ యూజర్లు, బ్యాటరీ లైఫ్ కోసం ప్రయోజనం పొందే వ్యక్తులను టార్గెట్ చేసి తయారీ చేయబడిందని తెలుస్తోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version