Gold Buying Tips: బంగారం ధర విపరీతంగా పెరుగుతుంది.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా సూచనలు చేయడంతో బంగారం ధర కాస్త తగ్గినప్పటికీ.. ఇప్పటికీ లక్షల లోనే విహరిస్తోంది. మనదేశంలో ఎటువంటి వేడుకలకైనా బంగారం కచ్చితంగా కావాలి. అందువల్లే ధర ఎంతైనా పర్వాలేదు కొనుగోలు చేస్తూనే ఉంటారు.
మన దేశ అవసరాలకు సంబంధించిన బంగారం దిగుమతి తీసుకోవాల్సిందే. బంగారం దిగుమతి కోసం మనదేశంలో భారీగా విదేశీ మారకద్రవ్యం ఖర్చు పెడుతున్నారు. అలాంటప్పుడు సాధ్యమైనంతవరకు బంగారం కొనుగోలు ను పరిమితంగా చేయాలని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. దీంతో బంగారాన్ని కొనుగోలు చేసేవారు జాగ్రత్త పడుతున్నారు. అధికంగా కాకుండా.. పరిమితంగా కొనుగోలు చేస్తున్నారు.
వాస్తవానికి బంగారం కొనుగోలు అంటే చాలామంది పెద్దపెద్ద దుకాణాలకు.. పేరుపొందిన కార్పొరేట్ వర్తకుల దగ్గరికి వెళ్తుంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు రకరకాల పన్నులు మన మీద వేస్తుంటారు. చట్టబద్ధంగా చెల్లించాల్సిన జీఎస్టీతో పాటు.. ఇంకా అదనపు ఖర్చులు మన మీద వేస్తుంటారు. కాకపోతే జేబుకు తెలియకుండానే పర్స్ కొట్టేసినట్టు.. బంగారం షాపుల నిర్వాహకులు రకరకాల పేర్లతో వినియోగదారుల నుంచి వసూలు చేస్తుంటారు.
ఒకవేళ వినియోదారులు ఆ బంగారాన్ని అదే వర్తకులకు అమ్మినప్పుడు.. ఇంత స్థాయిలో డబ్బులు చెల్లించరు. ముఖ్యంగా జిఎస్టి విషయంలో వర్తకులు వినియోగదారులకు ఒక్క రూపాయి కూడా చెల్లించరు. అలాంటప్పుడు బంగారం కొనుగోలు చేసేవారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మజూరీ.. తరుగు వంటి వాటి పేరుతో పెద్దపెద్ద షాపుల నిర్వాహకులు వినియోగదారులను నిలువు దోపిడీ చేసే అవకాశం ఉంది. అలాంటప్పుడు వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి.
బంగారం కొనుగోలు చేస్తున్నప్పుడు పెద్దపెద్ద వర్తకులు.. కార్పొరేట్ దుకాణాలలో కాకుండా.. సామాన్య వర్తకుల దగ్గర కొనుగోలు చేయడం ఉత్తమం. అక్కడ అదనపు పన్నులు ఉండవు. చట్టబద్ధంగా చెల్లించాల్సిన టాక్స్ లు మాత్రమే ఉంటాయి. దీనికి తోడు తరుగు.. మజూరి విషయంలో వినియోగదారులు మోసపోవడానికి ఆస్కారం ఉండదు. కొన్ని సందర్భాలలో బేరం ఆడేందుకు కూడా ఆస్కారం ఉంటుంది.
చిన్న స్థాయి వర్తకుల వద్ద బంగారం కొనుగోలు చేస్తున్నప్పుడు వినియోగదారులు కొన్ని నిబంధనలు పాటించాలి. ముఖ్యంగా హాల్ మార్క్ … 916 కార్డు.. 24 క్యారెట్లు లేదా 22 క్యారెట్ల నాణ్యత పరిశీలించుకోవాలి. బంగారం కొనుగోలు చేస్తున్నప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. బంగారం తీసుకున్న తర్వాతనే డబ్బులు చెల్లించాలి. అలాకాకుండా ముందుగానే డబ్బులు చెల్లిస్తే మోసానికి గురి అయ్యే ప్రమాదం ఉంది.. అన్నిటికంటే ముఖ్యంగా బంగారం పేరు పొందిన వర్తకుల దగ్గర మాత్రమే కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంటుంది.
ఈ కథనం వివిధ వేదికల వద్ద తీసుకున్న సమాచారం ఆధారంగా పాఠకుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో బంగారం కొనుగోలు చేసే విషయంలో కొనుగోలుదారులు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి.
