https://oktelugu.com/

TCS: టీసీఎస్ ఉద్యోగుల్లో ‘తొలగింపు’ భయం.. గతేడాదిలో 25,995 మంది ఉద్యోగులు ఔట్..

ఇన్ఫోసిస్ ఉద్యోగులను తీసేయడానికి నష్టాల బాట పట్టడమే కారణం అని తెలుస్తోంది.ఈ కంపెనికి చెంది ఆట్రిషన్ రేటు గత ఏడాదిగా 12.9 నుంచి 12.6 శాతానికి తగ్గింది. వరుసగా 5 త్రైమాసిక ఫలితాల్లో ఓవరాల్ గా నష్టాలను చవి చూస్తోంది. అయితే 4వ త్రైమాసికం ఫలితాలను గత వారం కంపెనీ వెల్లడించింది.

Written By:
  • Srinivas
  • , Updated On : April 19, 2024 / 10:17 AM IST

    Tcs Employees Fear

    Follow us on

    TCS: కరోనా తరువాత ఉద్యోగుల జీవితాలు పూర్తిగా మారిపోయాయి. ఉద్యోగం ఉంటుందో? ఊడుతుందోననే భయం అందరిలో నెలకొంది. భయపడినట్లుగానే కొన్ని కంపెనీలు నిర్దాక్షిణ్యంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అయితే ఇటీవల ఓ కంపెనీ పెద్ద ఎత్తున మ్యాన్ పవర్ ను వదులకుంది. ప్రస్తుతం కరోనా పరిస్థితి లేకున్నా.. కొన్ని కారణాల వల్ల అత్యధికంగా ఉద్యోగాలను తొలగించడంపై తీవ్ర చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో మిగతా కంపెనీలు కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకుంటాయా? అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంతకీ ఆ కంపెనీ ఎంతమంది ఉద్యోగులను వదులుకుంది? ఆ వివరాలేంటి?

    దేశంలో ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ గురించి ఫైనాన్స్ రంగంలో ఉన్న ప్రతీ ఒక్కరికి తెలుస్తుంది. ఐటీ సెక్టార్ లో రాణించాలనుకునేవారు ఈ కంపెనీలో జాబ్ వస్తే ఎంతో హ్యాపీగా ఫీలవుతారు. కానీ ఇప్పుడు ఇందులో పనిచేసేవారు దినదినగండంగా బతుకుతున్నారు. ఎందుకంటే ఈ కంపెనీ 2023-24 ఆర్థిక సంవత్సంలో మొత్తం 25,995 మంది ఉద్యోగులను తొలగించినట్లు లెక్కలు చెబుతున్నాయి. 2001 నుంచి ఇన్పోసిస్ ఉద్యోగులను తీసేస్తేన్నా.. ఇంత పెద్ద మొత్తంలో తొలగించడం ఇదే మొదటిసారి.

    ఇన్ఫోసిస్ ఉద్యోగులను తీసేయడానికి నష్టాల బాట పట్టడమే కారణం అని తెలుస్తోంది.ఈ కంపెనికి చెంది ఆట్రిషన్ రేటు గత ఏడాదిగా 12.9 నుంచి 12.6 శాతానికి తగ్గింది. వరుసగా 5 త్రైమాసిక ఫలితాల్లో ఓవరాల్ గా నష్టాలను చవి చూస్తోంది. అయితే 4వ త్రైమాసికం ఫలితాలను గత వారం కంపెనీ వెల్లడించింది. ఈ ఫలితాల్లో కంపెనీ లాభాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. 2021 మార్చి 31 వరకు 30 శాతం వృద్ధి సాధించి రూ.7969 కోట్ల లాభాలు ఆర్జించినట్లు ప్రకటించింది.

    ఓ వైపు భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించినా.. కొత్త వారిని చేర్చుకునే పనిలో ఉన్నారు. అయితే ఇది తొలగించిన దాని కంటే తక్కువే అని చెప్పాలి. 2024 జనవరి నుంచి మార్చి వరకు కొత్తగా 5,423 మంది కొత్తవారిని చేర్చుకున్నారు. దీంతో ప్రస్తుతం కంపెనీలో 3,17, 240 మంది పనిచేస్తున్నారు. అయితే నైపుణ్యం కారణంగా పాత వారిని తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కొత్త వారిని చేర్చుకుంటున్నామని చెబుతున్నా.. తక్కువ స్థాయిలోనే ఉండడంతో లాభాలు తక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఏదీ ఏమైనా టీసీఎం ఉద్యోగుల్లో ఒక రకంగా భయం నెలకొందని చెప్పవచ్చు.