Maruti Suzuki 800
Maruti Suzuki 800: తత్కాల్ ఈ పేరు వినగానే ఏం గుర్తొస్తుంది. రైల్వే టికెట్ బుకింగ్ తత్కాల్ లో బుక్ చేసుకున్నట్లు గుర్తుకు వస్తుంది కదా. కానీ ఇలాంటి విధానం తొలుత వాడుకలోకి తీసుకొచ్చింది మారుతి సుజుకీ అని తెలుసా ? మారుతీ 800 తత్కాల్ వేరియంట్ గురించి మీకు తెలుసా? 35 ఏళ్ల క్రితమే మారుతి సుజుకీ 800 వెర్షన్ కారుకు స్పెషల్ గా తత్కాల్ వేరియంట్ లాంచ్ చేశారు. 1989-1990లలో అధిక డిమాండ్ నేపథ్యంలో మారుతి సుజుకి 800 ఆ కంపెనీ ఈ స్పెషల్ వెర్షణ్ రిలీజ్ చేసింది. కస్టమర్లు బుక్ చేసిన తర్వాత వెయిటింగ్ పిరియడ్ తగ్గించడానికి దీనిని భారత మార్కెట్లోకి ప్రవేశ పెట్టారు. మారుతి సుజుకి 800 కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు కొన్ని సార్లు చాలా నెలలు లేదా ఏళ్ల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. ఆ అవసరం లేకుండా ఫాస్ట్ ట్రాక్ లేదా క్విక్ డెలివరీ ఆఫ్షన్ గా తత్కాల్ వేరియంట్ ప్రవేశపెట్టారు. మారుతీ సుజుకీ 800 టీకే వేరియంట్ పేరుతో విడుదల చేసిన ఈ కారు కావాలంటే కస్టమర్లు రూ. 50వేలు అధిక ధర చెల్లించాల్సి వచ్చేది.
Also Read : మధ్యతరగతి కోసం తెచ్చిన కారు.. కొనే దిక్కులేక ఖాళీగా షోరూంలు..లబోదిబో అంటున్న వ్యాపారులు
అయితే మారుతీ సుజుకీ టీకే వేరియంట్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేది కాదు. ప్రొడక్ట్ కెపాసిటీ ఆధారంగా కాలానుగుణంగా ప్రవేశపెట్టేవారు. మారుతీ సుజుకీ 800 తత్కాల్ వేరియంట్ బేసిక్ మారుతి 800కి సమానంగా ఉంటుంది. తత్కాల్ స్కీమ్ మొదట స్టాండర్డ్ (ఎస్‌టీడీ) మోడల్ కోసం దీనిని అందించారు. తర్వాత డీలక్స్ వేరియంట్ కు విస్తరించారు. మారుతీ సుజుకీ టీకే వేరియంట్‌లో ఏసీ ఆప్షన్ కూడా ఉండేది. అయితే డీఎక్స్, ఎస్టీడీ వేరియంట్స్ ఫాబ్రిక్ సీట్స్, డోర్ ట్రిమ్స్, స్ప్లిట్ రియర్ సీట్స్, లామినేటెడ్ విండ్ షీల్డ్ తో వచ్చాయి.తత్కాల్ వాహనాలను స్పెషల్ గా గుర్తించేలా బూట్ క్యాప్ పై టీకే స్టిక్కర్ ఉంటుంది. మారుతీ సుజుకీ 800మోడల్ 796 సీసీ ఎఫ్8బీ ఇంజిన్‌తో వస్తుంది. అందువల్ల ఈ కారు 5,500 ఆర్‌పీఎం వద్ద 39.5 బీహెచ్‌పీ పవర్, 5000 ఆర్‌పీఎం వద్ద 59 ఎన్ఎం టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు 4-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ అందిస్తుంది.
మారుతీ సుజుకి 800దేశంలో మొట్టమొదటి బడ్జెట్ ధరలో లాంచ్ చేసిన కారు. ఈ కారు బాగా ప్రజాదరణ పొందడంతో డిమాండ్ సరఫరాను మించిపోయింది. అందువల్ల కారు కొనుగోలు చేయాలనుకునే వాళ్లకు ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది. మారుతి 800 బుకింగ్స్ కు చాలా కాలంగా వెయిటింగ్ లిస్ట్‌లు ఉండడం వల్ల ప్రజలు తమ బుకింగ్ స్లాట్స్ ను అధిక ధరకు అమ్ముకునే వాళ్లు. ఇలాంటి సమస్యకు పరిష్కారంగా తత్కాల్ వేరియంట్ లాంచ్ చేశారు. కాలక్రమేణ తత్కాల్ వేరియంట్ మారుతీ సుజుకీ ఆపేసింది. అయితే ఇప్పటికీ కార్ల బుకింగ్స్ కోసం ఓ ప్రత్యేక తత్కాల్ వేరియంట్ లాంచ్ చేసిన మోడల్ గా మారుతి నిలుస్తుంది.
Also Read : TaTa టియాగో కొత్త కారు.. దీని ఫీచర్స్ తెలిస్తే వెంటేనే కొనేస్తారు.. అవెలా ఉన్నాయంటే?
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Tatkal scheme for maruti suzuki 800 car bookings
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com