MG Astor : ఇండియాలో ఆటోమొబైల్ పరిశ్రమ రోజురోజుకు వృద్ధి చెందుతుంది. మన దేశంలో మధ్య తరగతి ఎక్కువ కాబట్టి వాళ్లను టార్గెట్ చేస్తూ కంపెనీలు కార్లను తయారు చేస్తుంటాయి. ఇప్పటికే చాలా విదేశీ కంపెనీలు భారత మార్కెట్లోకి మీడియం రేంజ్ కార్లను రిలీజ్ చేస్తున్నాయి. ఎంజీ మోటార్ ఇండియాలో ప్రసిద్ధి చెందిన ఆటోమొబైల్ కంపెనీ. ఇది మహీంద్రా, టాటా మోటార్స్ వంటి దేశీయ కంపెనీలతో పోటీ పడుతుంది. ఫిబ్రవరి చివరి నాటికి దాని పాపులర్ మోడల్ ఆస్టర్ విక్రయాల గణాంకాలను విడుదల చేసింది. ఎంజీ మోటార్స్ ఆస్టర్ ఈ నెల అమ్మకాల్లో వెనుకబడింది. ఇది చాలా కాలంగా కస్టమర్ల విశ్వాసాన్ని కోల్పోయింది. ఫిబ్రవరి 2025లో ఎంజీ ఆస్టర్ కేవలం 264 యూనిట్లను మాత్రమే విక్రయించింది. గతేడాది ఫిబ్రవరి 2024లో ఇది 1,036 ఆస్టర్ వాహనాలను విక్రయించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు అంతర్జాతీయంగా 772 యూనిట్లు అమ్ముడయ్యాయి.
Also Read : TaTa టియాగో కొత్త కారు.. దీని ఫీచర్స్ తెలిస్తే వెంటేనే కొనేస్తారు.. అవెలా ఉన్నాయంటే?
ఎప్పటి మాదిరిగానే ఆస్టర్ చాలా కాలంగా తక్కువ విక్రయాలను నమోదు చేస్తుంది. గత నెలలో భారీ క్షీణత దేశీయంగా ఎంజీ కంపెనీ పరిస్థితి గురించి ఆలోచించేలా చేసింది. కంపెనీ ఈ కారును 2021లో మార్కెట్లోకి రిలీజ్ చేసింది. కోవిడ్ తర్వాత ఈ మిడిల్ రేంజ్ ఎస్ యూవీని మధ్యతరగతి కస్టమర్లకు అందించింది. 2019 లో ఈ కంపెనీ కార్లకు అధిక డిమాండ్ ఉంది. ఆ సమయంలో కస్టమర్ డిమాండ్ ఆధారంగా అనేక నాణ్యమైన మోడల్స్ లాంచ్ చేసింది. హెక్టర్, విండ్సర్ కార్ల ప్రజాదరణ తర్వాత, ఆస్టర్ కారును అదే నమ్మకంతో కంపెనీ విడుదల చేసింది.కంపెనీ దీని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ ఆ కారును భారతీయ వినియోగదారులు అంతగా ఆదరించలేదు. భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కలిగిన మొట్టమొదటి కారు ఎంజీ ఆస్టర్.
MG ఆస్టర్ అనేది ఒక కాంపాక్ట్ SUV. ఏఐ ఆధారిత కారుగా విడుదలైన ఈ మోడల్ పనోరమిక్ సన్‌రూఫ్ ఆప్షన్‌తో వచ్చింది. 4 మీటర్ల కంటే కొంచెం ఎక్కువ పొడవుతో ఉంటుంది. దేశంలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతున్న సమయంలో మధ్యతరగతి భారతీయ వినియోగదారుల కోసం ఆస్టర్‌ను విడుదల చేసిన ఎంజీ దానిలో అద్భుతమైన ఫీచర్స్‌ను అందించింది. ఇంటీరియర్‌లో డజన్ల కొద్ది లేటెస్ట్ ఆప్షన్స్ అందించింది. ఇందులో పవర్ డ్రైవర్ సీటు, ఎయిర్ కండిషన్డ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 10.1-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్మార్ట్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, లెదర్ కోటెడ్ డ్యాష్‌బోర్డ్, సీట్లు, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, ప్రమాదం సమయంలో లోపల కూర్చున్న ప్రయాణీకులను రక్షించడానికి ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్) ఉన్నాయి. ఈ కారు రూ. 10 లక్షల ప్రారంభ ధరతో దేశంలో లాంచ్ అయినప్పటికీ, భారతీయ వినియోగదారులను ఆకట్టుకోలేకపోయింది. దీనికి కారణాలు మాత్రం తెలియవు.
Also Read : ఆ కారుపై రూ.35,000 తగ్గించిన కంపెనీ.. ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయంటే?