Tata Vs Mahindra Car Sales February 2026: Tata Motors, Mahindra కంపెనీలకు ఆటోమోబైల్ మార్కెట్లో మంచి గుర్తింపు ఉంది.. పెట్రోల్ నుంచి డీజిల్ కార్ల వరకు విక్రయించిన ఈ రెండు కంపెనీలు.. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల సేల్స్ లో పోటీపడుతూ దూకుడును ప్రదర్శిస్తున్నాయి. మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ రెండు కంపెనీలు అనేక మోడల్స్ తీసుకువచ్చి తమ సత్తా చాటుతున్నాయి. దీంతో టాటా మోటార్స్ ఇప్పటివరకు 40 శాతానికి పైగా అగ్రస్థానంలో ఉండగా.. మహీంద్రా సైతం ఆధిపత్యం కోసం పోటీపడుతుంది. అయితే ఈ కంపెనీలకు చెందిన రెండు కార్లు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇవి పూర్తిగా ఎలక్ట్రిక్ కార్లు కావడంతో చాలామంది వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. మరి ఆ కార్ల విశేషాలేవో ఇప్పుడు చూద్దాం..
Also Read: ఐపీఎల్ 16 రోజులేనా.. బీసీసీఐ ఇచ్చిన ట్విస్ట్ వెనుక అసలు కారణం ఇది
దేశంలో నెంబర్ 2 కంపెనీగా కొనసాగుతున్న Tata మోటార్స్ 2026 ఫిబ్రవరి నెలలో తన కారు హారియర్ ICE తోపాటు ఎలక్ట్రిక్ కార్లు అన్ని కలిపి 3096 యూనిట్లను విక్రయించింది. 2025 ఫిబ్రవరి నెలలో 1376 యూనిట్ల సేల్స్ మాత్రమే నమోదు చేసింది. గత ఏడాది కంటే ఇప్పుడు 125% అమ్మకాల వృద్ధి సాధించడం విశేషం. ఇదే కంపెనీకి చెందిన SUV ఫిబ్రవరి నెలలో 16.57% వృద్ధిని సాధించింది. టాటా హారియర్ ఎలక్ట్రిక్ వెహికల్ లో రెండు బ్యాటరీలు ఉండనున్నాయి. వీటిలో ఒకటి 65 kWh ఉండగా.. మరొకటి 75 kWh ఉండనుంది. మొదటి కారు ధర రూ.21.49 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. రెండో కారు ధర రూ.29.74 ధరతో ఉంది.
మరో కంపెనీ Mahindra సైతం ఫిబ్రవరి నెలలో అత్యధిక కార్లను సేల్స్ చేసింది. ఈ కంపెనీ 3539 యూనిట్ల XEV 9S సెవెన్ సీటర్ ఎలక్ట్రిక్ కారును విక్రయించింది. ఈ ఒక్క నెలలోనే 478.27 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ కారులో మూడు బ్యాటరీలు ఉండనున్నాయి. వీటిలో ఒకటి 59 కే డబ్ల్యూహెచ్, 70 కే డబ్ల్యూహెచ్, 59 కే డబ్ల్యూహెచ్ అనే బ్యాటరీ ఎంపిక చేసుకోవచ్చు. ఈ మూడింటిలో మొదటిది 521 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా.. రెండో బ్యాటరీ 600.. మూడో బ్యాటరీ 679 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. ఈ మూడు వేరియంట్లు రూ.19.95 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. మహీంద్రా ఎలక్ట్రిక్ SUV కారు INGLO ఆర్కిటెక్చర్ పై ఆధారపడింది.