spot_img
Homeబిజినెస్Tata Sierra: కఠినమైన రోడ్లపై కూడా సాఫీగా సాగేలా.. టాటా కొత్త ప్రయోగం..

Tata Sierra: కఠినమైన రోడ్లపై కూడా సాఫీగా సాగేలా.. టాటా కొత్త ప్రయోగం..

Tata Sierra: ప్రస్తుత కాలంలో కారు కొనే ముందు చాలా విషయాలు ఆలోచిస్తున్నారు. కొందరు కేవలం సిటీలో మాత్రమే రన్ అయ్యే కారుపై ఆసక్తి చూపుతుండగా..మరికొందరు మాత్రం లాంగ్ డ్రైవ్ లో గతుకుల రోడ్లపై కూడా సాఫీగా ప్రయాణం అయ్యేలా ఉండే కార్లు కొనాలని చూస్తున్నారు. ఇటువంటి వారి విషయంలో టాటా కంపెనీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఈ కంపెనీకి చెందిన Sierra సిరీస్ లో భాగంగా కొత్త ఈవీని పరిచయం చేస్తోంది. ఈ కారు ఇప్పటి వరకు వచ్చిన వాటి కంటే ప్రత్యేకంగా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. ఇంతకీ ఇది ఏ కారు?

టాటా మోటార్స్ కంపెనీ నుంచి ఐకానిక్ SUV ‘టాటా సియెర్రా’ మోడల్ త్వరలో మార్కెట్లోకి రానుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఆటోమొబైల్ వర్గాల్లో ఆసక్తికరమైన వార్తలు బయటకొచ్చాయి. ఇటీవల సైలెంస్ ఎగ్జాస్ట్‌తో ఉన్న ఒక టెస్టింగ్ మోడల్ రహదారిపై ప్రత్యక్షమైంది. సియెర్రా ఐసిఈ (ICE – Internal Combustion Engine) వెర్షన్‌లో ఆల్ వీల్ డ్రైవ్, సీఎన్‌జీ వేరియంట్లతో ఈ కారును తీర్చిదిద్దుతున్నట్లు దాదాపు ఖాయమైంది.

ఈ కారును రహదారి పరీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇది సైలెన్సర్ పైపుతో కనిపించింది. ఈ టెస్ట్ మోడల్, సాధారణ పెట్రోల్ లేదాడీజిల్ ఫ్యూయల్ ఆప్షన్లతో పాటు కఠినమైన రహదారులను సైతం అధిగమించేందుకు AWD సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు సూచిస్తోంది. దీనితో పాటు మైలేజ్ ప్రియుల కోసం కంపెనీ ఐసిఎన్‌జీ ఆప్షన్‌ను కూడా అందించేందుకు సిద్ధమవుతోంది.

ఈ AWD ఆప్షన్‌ను టాటా మోటార్స్ కేవలం టాప్ స్పెక్ ఫ్లాగ్‌షిప్ ట్రిమ్‌లలో మాత్రమే అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మోడల్‌లో అధునాతన ట్రిపుల్ స్క్రీన్ డాష్‌బోర్డ్ సెటప్ , టిలేటెడ్ సీట్లు , విశాలమైన పానరోమిక్ సన్‌రూఫ్, వెనుక సీటు ప్రయాణికులకు గరిష్ట సౌకర్యాన్ని ఇచ్చే బాస్ మోడ్ టింగ్ సిస్టమ్ వంటి అత్యుత్తమ హంగులను చేర్చనున్నారు.

ఇప్పటికే అందుబాటులో ఉన్న.. త్వరలో రానున్న సియెర్రా ఇవి , జుబిలీ ఎడిషన్ లతో పాటు ఈ ఐసిఈ AWD వెర్షన్ చేరడం ద్వారా వినియోగదారులకు విభిన్న ఫ్యూయల్ ఆప్షన్లలో మోడల్స్ అందుబాటులోకి రానున్నాయి. తమ వినియోగదారుల వ్యక్తిగత స్టైల్, డ్రైవింగ్ అవసరాలు, ఇంధన ప్రాధాన్యతలకు తగినట్లుగా సియెర్రా మోడల్ లైన్-అప్‌ను టాటా మోటార్స్ మరింత బలోపేతం చేస్తోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి విషయంలో లైట్ తీసుకున్న స్టార్ డైరెక్టర్స్…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి దర్శకుడు ఇండస్ట్రీకి రావడానికి ముందే చిరంజీవి సినిమాలను చూసి వచ్చినవారే కాదా విశేషం.. ఇండస్ట్రీ లో సక్సెస్...
Vijay Deverakonda Vs Naveen Polishetty

Vijay Deverakonda Vs Naveen Polishetty: విజయ్ దేవరకొండ vs నవీన్ పోలిశెట్టి… పోటీ మామూలుగా లేదుగా…

Vijay Deverakonda Vs Naveen Polishetty: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికి సినిమాల విషయంలో వాళ్ళ మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉంటుంది. పర్సనల్ విషయాల్లో...
Nagababu Jabardasth

Nagababu Jabardasth: ‘జబర్దస్త్’ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నాగబాబు ఒక్కో ఎపిసోడ్ కి తీసుకునే రెమ్యూనరేషన్...

Nagababu Jabardasth: గత 13 సంవత్సరాల నుండి ఎలాంటి విరామం లేకుండా ఈటీవీ లో దిగ్విజయంగా సాగుతున్న షో ఏదైనా ఉందా అంటే , అది 'జబర్దస్త్' మాత్రమే. ఈ బిగ్గెస్ట్...
Oktelugu Epaper