Tata Nano 2025: టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా దేశంలోని మధ్య తరగతి ప్రజల కారు కలను నెరవేర్చడానికి 2008లో టాటా నానోను విడుదల చేశారు. అప్పట్లో రూ.లక్ష ప్రారంభ ధరతో వచ్చిన ఈ కాంపాక్ట్ కారు మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మరోసారి టాటా నానో 2025 రూపంలో సరికొత్త అవతారంలో మార్కెట్లోకి తిరిగి రావడానికి సిద్ధమవుతుంది. బడ్జెట్ ధర, కొత్త ఫీచర్లతో నానో మళ్లీ దూసుకుపోతుందని అంచనా వేస్తున్నారు. కొత్త టాటా నానో ఇప్పుడు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ లాగా కనిపిస్తుంది. ఇందులో హెక్సాగోనల్ ఫ్రంట్ గ్రిల్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, డీఆర్‌ఎల్స్ ఉంటాయి. బోల్డ్ అల్లాయ్ వీల్స్‌తో పాటు అనేక న్యూ కలర్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి. కేవలం 3.1 మీటర్ల పొడవు, 180 మి.మీ.ల గ్రౌండ్ క్లియరెన్స్ తో భారతదేశంలోని రద్దీగా ఉండే సిటీ ట్రాఫిక్, పార్కింగ్ ప్రాబ్లమ్స్ కు ఇది అద్భుతమైన పరిష్కారంగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
Also Read: ఏపీ లిక్కర్ స్కాం.. కదులుతున్న తెలంగాణ డొంక!
కొత్త టాటా నానోలో 624 సీసీ ట్విన్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది సుమారు 38పీఎస్ పవర్, 51ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కూడా ఉంటుంది. భవిష్యత్తులో టర్బో-పెట్రోల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ మోడళ్లను కూడా తీసుకురావడానికి కంపెనీ ప్లాన్ చేస్తుంది. దీని ఈవీ వెర్షన్ 250 కి.మీ వరకు రేంజ్ ఇవ్వగలదని అంచనా. కొత్త టాటా నానో ఒక కొత్త రికార్డు సృష్టించబోతోంది. ఈ హ్యాచ్‌బ్యాక్ పెట్రోల్ కారు లీటరుకు 40 కి.మీ వరకు మైలేజీని అందిస్తుంది. కొత్త నానోలో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ క్లస్టర్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, బ్లూటూత్, యూఎస్‌బీ, ఏయూఎక్స్ సపోర్ట్, పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్ వంటి ఫెసిలిటీలు ఉంటాయి. దీంతో పాటు సన్‌రూఫ్, రిక్లైనింగ్ ఫ్రంట్ సీట్లు కూడా ఉంటాయి.
Also Read: అనిల్ అంబానీపై ఈడీ ఉక్కుపాదం.. దాడుల వెనుక కారణం అదేనా ?
సేఫ్టీకోసం ఇందులో 4 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ తో పాటు ఈబీడీ, ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, రియర్ పార్కింగ్ సెన్సార్‌లు, కెమెరా, స్ట్రాంగ్ స్టీల్ బాడీ షెల్, సీట్‌బెల్ట్ రిమైండర్, ఈఎస్‌సీ, సైడ్ ఇంపాక్ట్ బీమ్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి. టాటా నానో 2025 ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.2.80 లక్షల నుండి ప్రారంభమవుతుంది. కొన్ని బేసిక్ వేరియంట్లు కేవలం రూ.1.45 లక్షలకు అందుబాటులో ఉండవచ్చు. దీని ఈవీ వేరియంట్ ధర రూ.5-7 లక్షల మధ్య ఉంటుందని అంచనా.