Tata Electric Cycle: నేటి కాలంలో విద్యార్థులు కళాశాలకు వెళ్లాలంటే బస్సును సంప్రదించాల్సిందే. కొందరు ఇంటి నుంచి కళాశాలకు వెళ్లాలంటే ఈ సౌకర్యం కూడా ఉండదు. దీంతో వారు సొంతంగా వెహికిల్ ను కొనాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో విద్యార్థులకు ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ సైకిల్ ఉంటే వారికి ఎన్నో రకాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. బైక్ తో పని లేకుండా ఎలక్ట్రిక్ సైకిల్ కొనడం వల్ల పెట్రోల్ ఖర్చు లేకపోవడంతో పాటు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండే ఆస్కారం ఉంటుంది. మరి అలాంటి ఎలక్ట్రిక్ సైకిల్ Tata కంపెనీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టింది. అయితే దీనిని విద్యార్థులతో పాటు రోజువారి అవసరాలకు మిగతావారు కూడా ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా నగరాల్లో ఉండే వారికి ఈ సైకిల్ అన్ని రకాల అవసరాలను తీరుస్తుంది. మరి ఈ సైకిల్ లో ఉండే ఫీచర్స్, బ్యాటరీ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం..
Tata కంపెనీ నుంచి ఎక్కువ శాతం మధ్యతరగతి ప్రజలకు అనుగుణంగా వాహనాలు వస్తుంటాయని కొందరి భావన. ఇందులో భాగంగా లేటెస్ట్గా కళాశాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ సైకిల్ ను ప్రవేశపెట్టారు. ఈ సైకిల్ లో ప్రత్యేకంగా కొన్ని ఫీచర్లను సెట్ చేశారు. బ్యాటరీ చార్జింగ్ గురించి డిస్ప్లే తోపాటు అసిస్టమోడును చూపించే బిగ్ స్క్రీన్ సైకిల్ కు ఉండనుంది. అలాగే సాయంత్రం సమయంలో కూడా సైకిల్ వెనుక వైపు ఉన్న లైట్లు రక్షణను ఇస్తాయి. టైర్ టు పట్టణాల్లో ఉండే వారికి సైతం ఇంధనం సేవ చేసుకోవడానికి.. కేవలం చార్జింగ్ సపోర్ట్ తో ఈ సైకిల్ పై ప్రయాణం చేయవచ్చు.
టాటా ఎలక్ట్రిక్ సైకిల్ లో హై డెన్సిటీ లిథియం అయాన్ బ్యాటరీని అమర్చారు. దీనిని మూడు గంటలపాటు చార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. అయితే రైడర్ బరువు, టైర్ ప్రెజర్, రోడ్ల నాణ్యతను బట్టి వేగం పై మైలేజ్ ఆధారపడుతుంది. కానీ 60 నుంచి 150 కిలోమీటర్ల లోపు మైలేజ్ ఖచ్చితంగా ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ సైకిల్ పై ఒక విద్యార్థి రోజుకు 12 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే 60 కిలోమీటర్ల రియల్ రేంజ్ కు చార్జింగ్ సపోర్ట్ ఇచ్చి మరో ఐదు రోజులు ప్రయాణం చేసేందుకు అనుగుణంగా ఉంటుంది. మూడు గంటలపాటు చార్జింగ్ చేస్తే 100% పూర్తవుతుంది.
దీనిని మార్కెట్లో రూ.3,799 ప్రారంభ ధరతో విక్రయించేందుకు నిర్ణయించారు. ఆకర్షణీయమైన డిజైన్తో పాటు భారతీయ విద్యార్థులకు అనుగుణంగా ఈ సైకిల్ ఉండడంతో చాలామంది దీన్ని చూసి ఇంప్రెస్ అవుతున్నారు.