TATA Curvv EV: టాటా నుంచి కర్వ్ ఈవీ.. వచ్చే నెలలో మార్కెట్లోకి.. ధర చూస్తే షాక్ అవుతారు..

టాటా నుంచి సిద్ధమైన Curvv Ev ఆగష్టు 7న మార్కెట్లోకి రాబోతుంది. అయితే ఇప్పటి వరకు కంపెనీ ఎలాంటి వివరాలు ప్రకటించలేదు. కానీ లీకైన సమాచారం ప్రకారం ఫీచర్స్ అద్భుతం అని అంటున్నారు. ఈ మోడల్ లో 12.3 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్పోటైన్మెంట్ సిస్టమ్ తో పాటు ఈవీ యాప్ సూట్, మల్టీపుల్ వాయిస్ అసిస్టెంట్లు ఉండనున్నాయి.

Written By: Chai Muchhata, Updated On : July 30, 2024 2:27 pm

TATA Curvv EV

Follow us on

TATA Curvv EV: దేశంలో ఎలక్ట్రిక్ కార్ల హవా పెరిగిపోతుంది. ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ కార్ల ను కలిగి ఉన్న చాలా మంది వాటి స్థానంలో విద్యుత్ కార్లను చేర్చుకుంటున్నారు. ప్రభుత్వం సైతం ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తికి ప్రోత్సాహం అందిస్తోంది. ఈ తరుణంలో కొన్ని కంపెనీలు అప్డేట్ ఫీచర్స్ తో కొత్త కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. వీటిలో టాటా కంపెనీ నుంచి కొత్త మోడల్ ను మార్కెట్లోకి తీసుకురావడానికి రెడీ చేశారు. హ్యాచ్ బ్యాక్ నుంచి ఎస్ యూవీలను తీసుకురావడంలో టాటా ఇప్పటికే ముందంజలో ఉంది. ఇప్పుడు విద్యుత్ కారుతో హల్ చల్ సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఆ కారు పేరే Curvv Ev. ఈ మోడల్ గురించి కంపెనీ ఎప్పుడో తెలిపింది. కానీ కారుకు సంబంధించిన వివరాలు అధికారికంగా ఇప్పటి వరకు బయటపెట్టలేదు. అయితే ఇటీవల దీనికి సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి. దీంతో ఈ వివరాలు తెలుసుకున్న వారు షాక్ అవుతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఈవీల్లో కంటే ఇందులో బెటర్ ఫీచర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మైలేజ్ విషయంలో ఈ కారు అప్ గ్రేడ్ అయిందన్న చర్చ సాగుతోంది. కొత్తగా ఈవీని కొనాలనుకునేవారు టాటా కర్వ్ బెస్ట్ ఆప్షన్ అని కొనియాడుతున్నారు. అయితే ధర విషయం ఇంకా తెలియనప్పటికీ కొందరు తమకు అనుగుణంగా అంచనా వేస్తున్నారు. కానీ అధికారికంగా ప్రకటిస్తే గానీ.. ధర విషయంపై క్లారిటీ రాలేదని అంటున్నారు. మరి ఈ కారు గురించి పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వివరాల్లోకి వెళ్తాం.. పదండి..

టాటా నుంచి సిద్ధమైన Curvv Ev ఆగష్టు 7న మార్కెట్లోకి రాబోతుంది. అయితే ఇప్పటి వరకు కంపెనీ ఎలాంటి వివరాలు ప్రకటించలేదు. కానీ లీకైన సమాచారం ప్రకారం ఫీచర్స్ అద్భుతం అని అంటున్నారు. ఈ మోడల్ లో 12.3 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్పోటైన్మెంట్ సిస్టమ్ తో పాటు ఈవీ యాప్ సూట్, మల్టీపుల్ వాయిస్ అసిస్టెంట్లు ఉండనున్నాయి. అలాగే వైర్ లెస్ ఛార్జింగ్, రెండు వాహనాల ఫంక్షనాలిటీ ఇందులో ఉంది. వీటితో పాటు వెంటిలేటెడ్ సీట్స్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్ఉన్నాయి.

ఇక ఇందులో సేప్టీ కోసం 6 ఎయిర్ బ్యాగ్స్, లెవల్ 2 ఏడీఎస్, డ్రైవర్ డోజ్ ఆఫ్ అలర్ట్ వంటివి సెక్యూరిటీ ఇస్తాయి. ఈ ఫీచర్స్ ఇప్పటి వరకు అంచనా వేయగా తాజాగా టీజర్ ను రిలీజ్ చేసిన వాటిలో కొన్నింటి గురించి చెప్పారు. ఇందులో డ్రైవర్ కోసం డిజిటల్ టీఎఫ్టీ స్క్రీన్, యాంబియంట్ లైటింగ్ ఉన్నాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ తో పాటు ఫోర్ స్పోక్ స్టీరింగ్ వీల్స్ సౌకర్యాన్ని ఇస్తాయి.

టాటా కర్వ్ కు సంబంధించిన బ్యాటరీ వివరాలు ఎక్కడా ప్రకటించలేదు. అయితే ఇది మార్కెట్లోకి వస్తే మాత్రం సిట్రియెన్ బసాల్ట్ కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఇందులో ఎక్సీటీరియర్ ఫీచర్స్ విషయానికొస్తే.. 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ బూట్ కింద స్టోరేజ్ వంటివి సౌకర్యవంతంగా ఉండనున్నాయి. వీటితో పాటు ఎలక్ట్రిక్ పనోరమ ఫీచర్ కూడా ఆకర్షించనుంది. అయితే టాటా కర్వ్ ధరపై ఆసక్తి చర్చ సాగుతోంది. దీనిని రూ. 20 నుంచి రూ.24 లక్షల వరకు విక్రయించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కంపెనీ అధికారికంగా ప్రకటిస్తే మాత్రం ధరపై క్లారిటీ రాలేదు. కానీ ఇంచు మించు ఇదే రేంజ్ లో ఉంటుందిన నిపుణులు పేర్కొంటున్నారు.