https://oktelugu.com/

Milk: ఖాళీ కడుపుతో పాలు తాగుతున్నారా? ఈ సమస్యలు తప్పవు..

పాలు ఆరోగ్యకరమైనవి, పోషకమైనవని. అందుకే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు పాలు తాగుతుంటారు. ఇవి ఎలాంటి ఏజ్ గ్రూప్ వారికి అయినా సరే మంచి ప్రయోజనాలను అందిస్తాయి. అయితే ఉదయం పూట ఖాళీ కడుపుతో పాలు తాగవచ్చా లేదా అనే అనుమానం కొందరిలో ఉంటుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : July 30, 2024 / 02:20 PM IST

    Milk

    Follow us on

    Milk: ప్రతిరోజు ఒక గ్లాసు పాలు తాగాలి అంటారు నిపుణులు. పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. కానీ కొందరు ఉదయం తాగితే కొందరు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తాగి పడుకుంటారు. మరికొందరు సాయంత్రం సమయంలో పాలు తాగుతారు. కానీ ప్రస్తుతం స్వచ్ఛమైన పాలు దొరకడం కూడా చాలా కష్టమే. కలుషితం అయినా పాలు ఎక్కువ లభిస్తున్నాయి.. కొన్ని ప్రాంతాల్లో బర్రె పాలు, ఆవు పాలు అంటూ ఇంటికి తీసుకొని వచ్చిన ఇస్తున్నారు. కానీ ఇందులో కూడా కలుషితమే ఉంటుంది. ప్యాకెట్ పాలను కలిపి పాల డబ్బాలో తీసుకొని వచ్చి గేదె పాలు ఆవు పాలు అంటున్నారు వ్యాపారస్థులు. ఈ విషయం తెలియని చాలా మంది పాలను కొనుగోలు చేస్తున్నారు. అయితే అన్ని పాల ప్యాకెట్ల వల్ల సమస్య లేకున్నా కొన్ని పాల ప్యాకెట్ లోని పాల వల్ల మాత్రం సమస్యలు వస్తున్నాయి అంటున్నారు నిపుణులు. నాణ్యత లేని పాలు, రసాయనాలు కలిపిన పాల వల్ల కచ్చితంగా సమస్యలు వచ్చే ఆస్కారం ఉందట. కలుషితమైన, స్వచ్ఛమైన పాలు అయినా సరే మరి వీటిని తాగడానికి ఎలాంటి సమయం అనువైనదో తెలుసా? ఇంతకీ ఉదయం పాలు తాగుతున్నారా? అది కూడా పరిగడుపున పాలు తాగుతున్నారా? మరి ఈ సమయంలో పాలు తాగవచ్చా? లేదా? అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

    పాలు ఆరోగ్యకరమైనవి, పోషకమైనవని. అందుకే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు పాలు తాగుతుంటారు. ఇవి ఎలాంటి ఏజ్ గ్రూప్ వారికి అయినా సరే మంచి ప్రయోజనాలను అందిస్తాయి. అయితే ఉదయం పూట ఖాళీ కడుపుతో పాలు తాగవచ్చా లేదా అనే అనుమానం కొందరిలో ఉంటుంది. మరి ఆ డౌట్ మీకు కూడా ఉంటే ఇక్కడ క్లియర్ చేసుకోవచ్చు. పాలలో పోషకాలు ఉంటాయి. కాల్షియం, ప్రోటీన్లు ఉంటాయి. మన శరీరానికి అవసరమైన కొవ్వు ను కూడా కలిగి ఉంటాయి పాలు. రోజూ పాలను తాగడం వల్ల అందులో ఉండే కాల్షియం వల్ల ఎముకలు బలపడతాయి.

    ఆవు, గేదె పాల కంటే మేక పాలలో లాక్టోజ్ తక్కువ ఉంటుంది. అయితే ఈ మేక పాలను తాగడం వల్ల సులభంగా జీర్ణమవుతాయి. పాలలో విటమిన్ డి మెదడు పని తీరుకు తోడ్పడుతుంది. అంతా బాగుంది ఇంతకీ ఖాళీ కడుపుతో పాలను తాగడం గురించి కద మన టాపిక్ అనుకుంటున్నారా? ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. పాలు ఎప్పుడు తాగుతున్నామో దాన్ని బట్టి శరీరానికి పోషకాలు అందుతాయి అంటున్నారు నిపుణులు. సాయంత్రం రాత్రి పాలు తాగడం వల్ల గరిష్ట ప్రయోజనాలు లభిస్తాయట. పాలు కాకుండా పాలతో చేసిన మజ్జిగ, పెరుగు, వెన్న, నెయ్యి వంటివి కూడా ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి.

    ఖాళీ కడుపుతో పాలు తాగడం వల్ల జీర్ణక్రియ పని తీరు మెరుగవుతుంది. అలాగే ఎముకలు బలహీనంగా ఉన్న వారు కూడా ఖాళీ కడుపుతో పాలు తాగితే వెంటనే ఎముకలు బలపడతాయి. కాబట్టి ఉదయాన్నే పాలు తాగడం మంచిది. అయితే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి అంటున్నారు నిపుణులు. కొందరు ముందు నుంచే లాక్టోస్ సమస్యలతో బాధపడుతుంటారు. దీనివల్ల కడుపునొప్పి వస్తుంది. వీరు పాలు తాగితే ఈ సమస్య మరింత పెరిగే సమస్య ఉందట. అంతేకాదు కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కూడా ఈ సమయంలో పాలు తాగకూడదు. టిఫిన్ లేదా అన్నం తిన్న గంట తర్వాత పాలను తీసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి సమస్య ఉండదు అంటున్నారు నిపుణులు.