TATA Avinya New Model: దేశంలోని కార్ల కంపెనీలో టాప్ లెవల్ లో ఉన్న వాటిలో Tata కంపెనీ ఒకటి. SUV కార్లను తీసుకురావడంలో ముందు ఉండే ఈ కంపెనీ నుంచి ఇప్పటికే ఎన్నో రకాల వేరియంట్స్ మార్కెట్లోకి వచ్చి వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అయినా కూడా ఎప్పటికప్పుడు కార్లను అప్డేట్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. 2026 కొత్త సంవత్సరం సందర్భంగా ఈ కంపెనీ నుంచి కొత్త కారు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. దీని గురించి ఇప్పటికే పరిచయం చేసింది. ఆ కారు అవిన్య. పూర్తిగా EV వేరియంట్ లో తీసుకు వస్తున్న ఈ కారు గురించి ఇప్పటికే కొన్ని విషయాలు బయటపెట్టినప్పటికీ.. ఇది ఎప్పుడూ మార్కెట్లోకి వస్తుందోనన్న ఆత్రుత చాలామందిలో ఉంది. మరి ఈ కారు గురించి మరిన్ని విషయాల్లోకి వెళ్తే..
ప్రస్తుతం చాలామంది ఎలక్ట్రిక్ వేరియంట్ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగా టాటా కంపెనీ కొత్తగా SUV ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకురావాలని అనుకుంటుంది. ఇందులో భాగంగా Avinya మోడల్ గురించి ఇప్పటికే పరిచయం చేసింది. SUV వేరియంట్ లో ఇది కీలకం కానుంది. దీని బాహ్య విజయానికి వస్తే T ఆకారంలో ఉండే LED DRL లాంప్స్ ఆకట్టుకోనున్నాయి. పాప్ అవుట్ ఫ్లాష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, అందమైన ఎల్ఈడి టెయిల్ లాంప్ ఆకర్షణీయంగా ఉన్నాయి. వెనుక ఉండే స్కిట్ ప్లేట్స్ టైర్లకు అందం తీసుకొస్తాయి.
ఈ కారు ఇన్నర్ విషయానికి వస్తే.. క్యాబిన్ లాంజ్ స్టైల్ లో ఆకర్షిస్తుంది. అద్భుతమైన డాష్ బోర్డు తో పాటు డిజిటల్ ఇంటర్ఫేస్ కలిగి ఉంది. ప్రీమియం కార్లను తలపించే విధంగా క్యాబిన్ లేఅవుట్ ఆకట్టుకుంటుంది. ఇందులో Gen 3 ఎలక్ట్రిక్ వెహికల్ ఆర్కిటెక్చర్ తో పాటు స్కేట్బోర్డ్ స్టైల్ ప్లాట్ఫారంపై నిర్మించానున్నారు. డ్రైవింగ్ తోపాటు వేగవంతమైన చార్జింగ్ టెక్నాలజీని ఇందులో అమర్చారు. దీని పొడవు 4,300 మిల్లి మీటర్లు ఉండే అవకాశం ఉంది. 200 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్, 2,900 మిల్లీమీటర్ల వీల్ బేస్ ఉండనుంది.
దీనిని 2026 చివరిలో మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ కారులో 65 కిలో వాట్ బ్యాటరీ బ్యాక్ అమర్చే అవకాశం ఉంది. అలాగే మరొకటి 75 కిలోవాట్ బ్యాటరీ కూడా ఉండనుంది. ఇవి చార్జింగ్ కావడానికి శక్తివంతమైన ఎలక్ట్రిక్ సెటప్ ను అమర్చారు. అలాగే సేఫ్టీ కోసం సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉండాను ఉందని తెలుస్తోంది. వీటితోపాటు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ కూడా ఉండనుంది. ఇప్పటివరకు వచ్చిన SUV ఎలక్ట్రిక్ వేరియంట్లకు విభిన్నంగా ఉండనుంది. ఇది మార్కెట్లోకి వస్తే రూ. 30 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది.