Tata Altroz : వచ్చే నెల 21న కార్ల మార్కెట్‌లో పెద్ద కుదుపు రాబోతుంది. ఆ రోజు 2 సీఎన్జీ సిలిండర్లతో వస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ విడుదల కానుంది. ఆ కారు మరేదో కాదు, చాలా కాలంగా ఎంతో మంది వినియోగదారులు ఎదురుచూస్తున్న టాటా ఆల్ట్రోజ్. ఈ కారు మే 21న విడుదల కాబోతోంది.
టాటా మోటార్స్ తన ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కేవలం సీఎన్జీ మోడల్‌ను మాత్రమే ఫేస్‌లిఫ్ట్ చేయట్లేదు. ఆల్ట్రోజ్ ఐటర్బో, ఆల్ట్రోజ్ రేసర్ మోడళ్లలో కూడా మార్పులు చూడవచ్చు. ఈ కారును 2020లో భారతదేశంలో మొదటిసారిగా విడుదల చేశారు.
టాటా మోటార్స్ సీఎన్జీ కార్ల కోసం ఒక ప్రత్యేకమైన టెక్నాలజీని అభివృద్ధి చేసింది. దీనిని కంపెనీ iCNG అని పిలుస్తుంది. వారి దాదాపు ప్రతి సీఎన్జీ కారులోనూ దీనిని ఉపయోగించారు. ఈ టెక్నాలజీ ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో ఒక పెద్ద సిలిండర్‌కు బదులుగా రెండు చిన్నసీఎన్జీ సిలిండర్‌లను ఉపయోగిస్తారు. దీనివల్ల కారు బూట్ స్పేస్‌కు ఎటువంటి నష్టం జరగదు. సీఎన్జీ సిలిండర్‌లతో కూడా కారులో మంచి స్టోరేజ్ లభిస్తుంది.
Also Read : పిచ్చెక్కించే ఫీచర్స్‌తో మారుతి మోడల్.. టెన్షన్లో టాటా, హ్యుందాయ్
ఇంతే కాదు, ఈ టెక్నాలజీతో కంపెనీ లీకేజ్ డిటెక్షన్ సిస్టమ్‌ను కూడా తయారు చేసింది. కారులో సీఎన్జీ ట్యాంక్ లేదా పైపులో ఎక్కడైనా లీకేజ్ ఉంటే, ఈ టెక్నాలజీ దానిని గుర్తించి సీఎన్జీ సరఫరాను ఆపివేస్తుంది. కారును పెట్రోల్‌పైకి మారుస్తుంది. ఈ విధంగా ఇది కారు సేఫ్టీ కూడా పెంచుతుంది.
కొత్త టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్‌లో మెకానికల్‌గా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు, అయితే దీని ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్‌లో అనేక మార్పులు చూడవచ్చు. ఈ కారు ముందు భాగం పూర్తిగా కొత్తగా డిజైన్ చేశారు. కాబట్టి మీకు కొత్త గ్రిల్, ట్విన్ LED హెడ్‌ల్యాంప్‌లు ఈ అప్‌డేట్‌లో లభించవచ్చు. ఇవి కొత్త నెక్సాన్, కర్వ్, హారియర్ లాగా ఉండవచ్చు.
టాటా మోటార్స్ దీని ముందు భాగం, బంపర్, ఏరోడైనమిక్స్‌ను మెరుగుపరిచింది. దీనికి సంబంధించిన అనేక స్పై షాట్‌లు ఇప్పటికే బయటకు వచ్చాయి. కారులో కొత్త రకమైన ఫాగ్ ల్యాంప్‌లతో పాటు కొత్త డిజైన్‌తో కూడిన అల్లాయ్ వీల్స్, స్లీకర్ DRLలు లభించవచ్చు. కంపెనీ దీని టెయిల్ లైట్‌ను కూడా మార్చే పనిలో ఉంది.
ఇంటీరియర్, ఫీచర్ల విషయానికి వస్తే.. మీడియా నివేదికల ప్రకారం ఇందులో కెమెరా ఆధారిత ADAS ఉండవచ్చు. అలాగే క్లైమేట్ కంట్రోల్, 10.2 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, యాంబియన్స్ లైటింగ్, పవర్ డ్రైవర్ సీట్ ఆప్షన్ కూడా లభించవచ్చు. 10 లక్షల రూపాయల కంటే తక్కువ ధరలో ఇది మార్కెట్‌లో మారుతి స్విఫ్ట్, బ్రెజ్జాతో పోటీపడుతుంది.
Also Read : ఏప్రిల్ 1నుంచి కార్ల ధరలు పెరగుతుంటే.. ఈ 7సీటర్ మాత్రం భారీగా తగ్గింది