https://oktelugu.com/

పది పైసలకే టేస్టీ బిర్యానీ.. కిలోమీటర్ల మేర క్యూ కట్టిన జనం..?

సౌత్ ఇండియాలో 100 మందిలో 80 శాతం మంది బిర్యానీని ఇష్టపడతారు. ఆదివారం వచ్చిందంటే చాలు దేశంలోని చాలా ఇళ్లల్లో రుచికరమైన బిర్యానీని వండుకుని తినడం లేదా హోటళ్ల నుంచి ఆర్డర్ చేసుకోవడం జరుగుతుంది. నగారాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లలో సైతం ఎక్కువ మంది బిర్యానీని ఆర్డర్ చేయడానికే ఇష్టపడతారు. కొందరికి చికెన్ బిర్యానీ నచ్చితే ఎక్కువ మందికి మటన్ బిర్యానీ నచ్చుతుంది. చాలా మంది స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ యాప్స్ లో బిర్యానీలపై డిస్కౌంట్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 11, 2020 / 07:49 PM IST
    Follow us on

    సౌత్ ఇండియాలో 100 మందిలో 80 శాతం మంది బిర్యానీని ఇష్టపడతారు. ఆదివారం వచ్చిందంటే చాలు దేశంలోని చాలా ఇళ్లల్లో రుచికరమైన బిర్యానీని వండుకుని తినడం లేదా హోటళ్ల నుంచి ఆర్డర్ చేసుకోవడం జరుగుతుంది. నగారాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లలో సైతం ఎక్కువ మంది బిర్యానీని ఆర్డర్ చేయడానికే ఇష్టపడతారు. కొందరికి చికెన్ బిర్యానీ నచ్చితే ఎక్కువ మందికి మటన్ బిర్యానీ నచ్చుతుంది.

    చాలా మంది స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ యాప్స్ లో బిర్యానీలపై డిస్కౌంట్ ఆఫర్లు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పటివరకు బిర్యానీకి సంబంధించి మనం రకరకాల ఆఫర్ల గురించి వినే ఉంటాం. అయితే తాజాగా కేవలం పది పైసలకే పలు హోటళ్లు ప్రజలకు బిర్యానీ ఆఫర్ చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం అక్టోబర్ 11వ తేదీని బిర్యానీ డేగా వ్యాపారులు జరుపుకుంటారు.

    ఈరోజు బిర్యానీ డే కావడంతో తమిళనాడు రాష్ట్రంలోని మధురై, దింగిగల్, చెన్నైలలో హోటల్ వ్యాపారులు పది పైసలకే బిర్యానీ ఆఫర్ ప్రకటించారు. పది పైసలకే బిర్యానీ అని తెలియడంతో జనం క్యూ లైన్లలో నిలబడి మరీ బిర్యానీని కొనుగోలు చేయడం గమనార్హం. పలు చోట్ల కరోనా నిబంధనలు పాటించకుండా జనం బిర్యానీని కొనుగోలు చేయడానికి ఎగబడ్డారు.

    దీంతో పలు ప్రాంతాల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అధికారులు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. బెంగళూరులో సైతం ప్రముఖ రెస్టారెంట్ బిర్యానీ ఆఫర్ ను ప్రకటించడంతో 1.5 కిలో మీటర్ల మేర బిర్యానీ ప్రియులు బారులు తీరి మరీ బిర్యానీని కొనుగోలు చేశారు. బిర్యానీ డే సందర్భంగా వ్యాపారులు తక్కువ ధరకు బిర్యానీని విక్రయించి వార్తల్లో నిలిచారు.