Systematic Investment Plan: జీవితంలో ఉన్నతంగా జీవించాలని ఎవరికైనా ఉంటుంది. అయితే కొందరు వయసు ఉన్నంతసేపు మిషన్ లా పనిచేసిన బాగా డబ్బులు సంపాదించాలని అనుకుంటారు. ఇందులో కోసం నిద్రాహారాలు మానుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతిని వృథా ఖర్చులు పెరుగుతాయి. దీంతో ఎంత కష్టం చేసినా డబ్బులు నిల్వకు రావు. ఇలాంటి సమయంలో ఆర్థిక ప్రణాళికలు కచ్చితంగా అవసరం ఉంటాయి. ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోతే జీవితంలో కోట్లు సంపాదించినా అవసరానికి ఉపయోగపడవు. ముఖ్యగా చివరి మజిలీలో అవసరానికి డబ్బు లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.అయితే డబ్బును ఏ విధంగా ఇన్వెస్ట్ మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ ఉంటాయి? అనే విషయాలు తెలుసుకుందాం..
ఆర్థిక నిపుణుల ప్రకారం క్రమశిక్షణ పెట్టుబడుల వల్ల అధిక ఆధాయం వస్తుంది. ఇందులో సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ (SIP) ఒకటి. మనదేశంలో ఇటీవల సిప్ లల్లో పెట్టుబడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. 2023 జూన్ లో రూ.14,735 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు లెక్కలు చెబుతున్నాయి. అలాగే జూలైలో రూ.15,245 కోట్లకు చేరుకుంది. సిప్ లల్లో మొదటిసారిగా జూలైలోనే 15,000 తాకడం ఇదే మొదటిసారి. వీటిలో కొత్తగా 33.06 లక్షల కొత్త ఖాతాలు ప్రారంభమయ్యాయి.
సిస్టమెటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ ద్వారా భవిష్యత్ లో కోటీశ్వరు కావచ్చు. సిఫ్ ప్రకారం నెలకు రూ.7000 ఇన్వెస్ట్ మెంట్ చేస్తే చాలు కోటీశ్వరడు కావచ్చు. ఉదాహరణకు 30 ఏళ్ల వయసు ఉన్నవారు 2023 ఆగస్టు నుంచి ప్రతినెల రూ.7000 జమచేసుకుంటూ పోతే 60 సంవత్సరాలు వచ్చే సరికి రూ.25.2 లక్షలు అవుతుంది. ఇదే మొత్తాన్ని సిప్ లో పెడితే రూ. కోటి రూపాయల వరకు రిటర్న్స్ పొందుతారు. ప్రస్తుతం వడ్డీ రేటు 8శాతం ఉండే 30 ఏళ్ల వరకు 12 శాతంతో ఆదాయం పొందుతారు. అంటే మీకు ట్రిపుల్ ఆదాయం వస్తుంది.
ట్రూ వర్త్ ఫిన్సల్టెంట్స్ వ్యవస్థాపకుడు తివేష్ షా ప్రకారం పెట్టుబడులు పోర్ట్ ఫోలియో ఈక్విటీలతో ఎక్స్పోజర్ కలిగి ఉంటే ప్రతీ సంవత్సరం 10 శాతం వృద్ధి చెందే అవకాశం ఉంది. దీంతో నెలవారి రూ.4800 ఇన్వెస్ట్ చేసినా 30 ఏళ్లల్లో రూ. కోటి రావచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం రావాలనుకునేవారు సిస్టమెంట్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ మంచి సదుపాయం అని తివేష్ షా ఈ సందర్భంగా చెప్పారు.