Pakistan: భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఆగస్టు 15 అన్న విషయం మనందరికీ తెలుసు. అలాగే మన నుంచి విడిపోయిన పాకిస్తాన్ కు ఆగస్టు 14న స్వాతంత్రం వచ్చింది. ఈ సందర్భంగా నిన్న తమ స్వాతంత్ర దినోత్సవానికి దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా భవనంలో. . తమ జాతీయ జెండా యొక్క రంగులు వేయకపోవడంతో పాకిస్తాన్ జాతీయులు నిరసనకు దిగారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండాను ప్రదర్శించింది. అంతేకాకుండా తన అఫీషియల్ ఇంస్టాగ్రామ్ అకౌంట్లో ఈ వీడియోతో పాటు .. పాకిస్తాన్ ప్రజలు తమ దేశం యొక్క వారసత్వాన్ని ఇలాగే గొప్పగా, గర్వంగా జరుపుకుంటూ ఐక్యతతో ఉంటారని ఆశిస్తున్నాను. రాబోయే భవిష్యత్తులో పాకిస్తాన్ ప్రజలు మరిన్ని విజయాలను సంతోషాలను పొందాలని ఆకాంక్షిస్తూ.. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.”అని పోస్ట్ చేశారు.
యుఎఇ వైస్ ప్రెసిడెంట్,ప్రధాన మంత్రి ,దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా పాకిస్తాన్ కు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందించారు. ఆగస్టు 14 2023 న పాకిస్తాన్ తన 77వ స్వాతంత్ర వేడుకలను జరుపుకుంటుంది. ఈ సందర్భంగా పాకిస్తాన్ ప్రజలకు అభినందనలు అని ఇంతకు ముందు ట్విట్టర్ గా అందరికీ పరిచయం ఉన్న ఎక్స్ లో పోస్ట్ చేశారు.
నిన్న పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించు కొని ప్రపంచంలోని అత్యంత పెద్దదిగా ప్రసిద్ధి చెందిన బుర్జ్ ఖలీఫా దగ్గర పాకిస్తాన్ ప్రజలు నినాదాలు చేస్తూ గుమిగూడారు. అయితే వారు గడియారం 12 కొట్టగానే భవనంలో పాకిస్తాన్ జాతీయ జెండా కనిపించలేదు. కొన్ని క్షణాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురి అయిన పాకిస్తాన్ పౌరులు.. తీవ్రంగా స్పందించారు. ఇక ఆ తర్వాత కాసేపటికి వారి జెండాను ప్రదర్శించడం జరిగింది.
దుబాయ్లో పాకిస్తాన్, భారత్ నుంచి వెళ్లిన ప్రవాసులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అందుకే స్వాతంత్ర దినోత్సవం నాడు ఆ దేశ జెండాలను బుర్జ్ ఖలీఫా పై ప్రదర్శిస్తారు. ఈరోజు ఇండియా ఇండిపెండెన్స్ డే సందర్భంగా కూడా బుర్జ్ ఖలీఫా పై మన దేశ త్రివర్ణ పతాకం నిండుగా కనిపిస్తుంది.