https://oktelugu.com/

Stock Market : మధుపరులకు గుడ్ న్యూస్.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ మరింత పైపైకి..

కొన్ని రోజుల నుంచి తీవ్ర నష్టాలు చవి చూస్తున్న సూచీలు ఈ రోజు శాంతించాయి. మంగళవారం (ఆగస్ట్ 6) ఉదయం నుంచి సూచీల్లో కదలికలు మెరుగ్గా కనిపించారు. గ్లోబల్ మార్కెట్ పతనంతో భారత్ మార్కెట్ కూడా ప్రభావితమైంది. కానీ బ్లాక్ మండే టెన్షన్ నుంచి కోలుకున్నట్లు కనిపిస్తుంది.

Written By:
  • NARESH
  • , Updated On : August 6, 2024 / 02:39 PM IST
    Follow us on

    Stock Market : దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఉదయం నుంచి దూసుకెళ్తున్నాయి. నిన్నటి బ్లాక్ మండేను దాటి ఈ రోజు ఆరంభంలోనే టాప్ లేపాయి. దీంతో మదుపర్లలో సంతోషం వెల్లివిరిసింది. నిన్ననష్టాల బాట పట్టిన పలు సూచీలు ఈ రోజు లాభాల పట్టాయి. సోమవారం తీవ్ర నష్టాల బాట పట్టిన పలు కంపెనీలు మంళవారం కొంత తేరుకోవడం పెద్ద ఊరటగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా భారత్ స్టాక్ మార్కెట్లు మాత్రం ఈ రోజు మదుపర్లలో కొంత సంతోషాన్ని నింపాయి. భారత్ స్టాక్ మార్కెట్ మళ్లీలాభాల బాటపట్టింది. నిన్నటి నష్టాల నుంచి తేరుకొని భారీ లాభాల దిశగా సాగుతున్నాయి. ఉదయం పది గంటల సమయానికి సెన్సెక్స్ 915 పాయింట్లకు చేరుకుంది. ఇక నిఫ్టీ కూడా లాభాల బాట పట్టింది. నిఫ్టీ ఏకంగా 271 పాయింట్లు పెరిగి 24,326 వద్ద ట్రేడింగ్ నడుస్తున్నది. ఆసియా మార్కెట్లలో నెలకొన్న సానుకూల అంశాల నేపథ్యంలో మన సూచీలు పైపైకి వెళ్తున్నాయి. ఉదయం9.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 915 పాయింట్లు పైకి వెళ్లి 79, 675 వద్ద కొనసాగుతున్నది. నిఫ్టీ 271 పాయింట్లు పెరిగి 24,326 వద్ద ట్రేడింగ్ నడుస్తున్నది. మంగళవారం చూసుకుంటే రూపాయి విలువ డాలర్ తో 83.85 గా నమోదైంది. అమెరికాతో పాటు జపాన్ మార్కెట్లు ఇంకా కొంత నష్టాల్లోనే కొనసాగుతున్నాయి.

    కంపెనీల వారీగా చూసుకుంటే..
    భారత సెన్సెక్స్ లాభాల్లో కొనసాగుతున్నది. సెన్సెక్స్ సూచీల్లో చూసుకుంటే ప్రస్తుతం నెస్లే ఇండియా కొంత నష్టాల్లో కనిపిస్తున్నది. టాటా మోటర్స్, అదానీ స్పోర్ట్స్ మారుతి, ఎల్అండ్ట్ టీ , జేఎస్ డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, హెసీఎల్ టెక్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్ సర్వ్ తో పాటు ఎం అండ్ ఎం, ఎన్టీపీసీ, ఎస్బీఐ, రిలయన్స్, అల్ర్టాటెక్, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ కంపెనీలు అత్యధిక లాభాలతో దూసుకెళ్తున్నాయి. దీంతో మదుపర్లలో హర్షం వ్యక్తమవుతున్నది. ఇక నిన్నటి నష్టాల నుంచి తేరుకోవడం పెద్ద ఊరటగా నిలిచింది.

    అమెరికా సూచీలు డౌన్
    సోమవారం లాగే అమెరికాలో సూచీలు డౌన్ ఫాల్ లోనే కొనసాగుతున్నాయి. అమెరికా నిరుద్యోగ సంక్షోభ భయం ఇంకా వీడడంలేదు. దీని నుంచి తేరుకునేందుకు మరింత సమయం పట్టేలా కనిపిస్తున్నది. ఆసియా మార్కెట్లు మాత్రం నిన్నటి నష్టాల నుంచి తేరుకొని హై ఎండ్ దిశగా సాగుతున్నాయి. భారత్ లో స్టాక్ మార్కెట్ ఎక్చేంజీలు భారీ లాభాల దిశగా సాగుతున్నాయి. ఇక జపాన్ నికాయ్ 8, కోప్సీ 3, ట్రాపిక్స్ 12 శాతానికి పైగా లాభాల్లో దూసుకెళ్తున్నాయి.

    ఇక ప్రపంచ మార్కెట్ లో ప్రస్తుతం బ్యారెల్ బ్రెంచ్ చమురు ధర రూ. 77.20 గా కొనసాగుతున్నది. ఇది ఇలా ఉంటే విదేశీ మదుపర్లు తమ షేర్లు విక్రయించారు. వీటి విలువ మొత్తంగా రూ. 10, 074 కోట్లుగా ఉంది. ఇక దేశీయ మదుపర్లు మాత్రం పెద్ద ఎత్తున షేర్లు కొనుగోలు చేశారు. వీటి విలువ సుమారు రూ. 9వేల కోట్లుగా నమోదైంది. ఇజ్రాయెల్ , ఇరాక్ దేశాల మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భయాందోళనలు నెలకొన్నాయి.

    యుద్ధం వచ్చే అవకాశమున్నట్లు ప్రచారం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో కొంత ఒడిదొడుకులు తప్పవనే అంచనాలు మొదలయ్యాయి. పరిస్థితి మరికొన్ని రోజులు ఇలాగే ఉంటుందని మదుపర్లు తీవ్ర నిరాశ చెందారు. ఈ క్రమంలో దేశీయ మార్కెట్లు ఇలా లాభాల్లోకి వెళ్లడం అందరినీ సంతోషంలో ముంచెత్తింది.