Public Toilets: టాయిలెట్.. ఇప్పుడు అందరి ఇళ్లలో మనకు కనిపిస్తోంది. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్రం ప్రతీ ఇంట్లో టాయిలెట్ నిర్మించే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టింది. తర్వాత గ్రామాలు, పట్టణాల్లో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టింది. ఇంత వరకు బాగానే ఉంది. ఇంట్లో లేదా హోటల్ గదిలో ఉండే టాయిలెట్ తలుపు పై నుంచి కింది వరకు ఉంటుంది. చిన్న గ్యాప్ కూడా మనకు కనిపించదు. కానీ, షాపింగ్ మాల్స్, థియేటర్లు, ఆస్పత్రులు వంటి పబ్లిక్ టాయిలెట్లకు బిగించే డోర్‌ల కింద గ్యాప్ ఉంటుంది. డోర్ కింద ఖాళీగా వదిలి కనిపిస్తాయి. కొన్నింటికి పైన గ్యాప్ ఉంటుంది. మరి ఇలా ఎందుకు ఉంటుందో తెలుసుకుందాం.
= పబ్లిక్ టాయిలెట్ దిగువన ఉన్న తలుపులు తరచుగా మురికిగా ఉన్న ఫ్లోర్ శుభ్రం చేయడానికి ఇలా ఖాళీగా వదిలేస్తారు. టాయిలెట్ లోపలికి వెళ్లకుండానే క్లీన్ చేసే అవకాశం ఉంటంది.
= పబ్లిక్ టాయిలెట్‌ను చాలా మంది ఉపయోగిస్తారు. దీంతో దుర్వాసన ఎక్కువగా వస్తుంది. ఈ వాసన త్వరగా బయటకు పోవడానికి ఈ ఖాళీ ఉపయోగపడుతుంది.
= టాయిలెట్ లోపల ఉన్న వ్యక్తికి అకస్మాత్తుగా ఏమైనా జరిగినా, జారిపడినా, హార్ట్‌స్ట్రోక్ వచ్చినా.. సులభంగా తెలుసుకునే వీలు ఉంటుంది. లోపలికి గడియ పెట్టి ఉంటుంది కాబట్టి కింద నుంచి లోనికి వెళ్లి రక్షించడానికి కూడా ఖాళీ గ్యాప్ ఉపయోగపడుతుంది.
= ఇక ఎక్కువ మంది ఉపయోగించడం వలన.. తలుపుల కింది భాగం తడిసిసోతుంది. ఎక్కువగా తడవడం వలన డోర్లు త్వరగా చెడిపోయే అవకాశం ఉంటుంది.
= పైన ఉన్న ఖాళీ లోపల ఉన్న వ్యక్తి ఏదైనా ఇబ్బందుల్లో లేదా ప్రమాదంలో ఉన్నప్పుడు బయటకు తీసుకురావడానికి, బయట ఉన్న వ్యక్తి లోనికి వెళ్లడానికి ఉపయోగపడుతుంది.
= కింద ఖాళీ ఉండడంతో లోపల వ్యక్తి ఉన్నాడన్న విషయం డోర్ కొట్టకుండానే తెలుసుకోవచ్చు. డోర్ కొడితే లోపల ఉన్నవారికి అసౌకర్యంగా కూడా ఉంటుంది. అందుకే పబ్లిక్ టాయిలెట్ డోర్ల కింద ఖాళీగా వదిలేస్తారు.