https://oktelugu.com/

ఎస్బీఐ కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. ఆ సర్వీసులు బంద్..?

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మన దేశంలో ఇతర బ్యాంకులతో పోలిస్తే ఎక్కువ సంఖ్యలో కస్టమర్లు ఉన్న సంగతి తెలిసిందే. 40 కోట్లకు పైగా కస్టమర్లు ఉన్న ఎస్బీఐ ఖాతాదారులకు భారీ షాక్ ఇచ్చింది. మే 21, 22, 23 తేదీలలో కొన్ని సర్వీసులు అందుబాటులో ఉండవని వెల్లడించింది. ట్విట్టర్ వేదికగా ఎస్బీఐ ఈ విషయాన్ని వెల్లడించగా ఖాతాదారులు బ్యాంక్ సేవలకు సంబంధించిన విషయాన్ని ముందే తెలుసుకుంటే మంచిది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : May 20, 2021 9:59 pm
    Follow us on

    దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మన దేశంలో ఇతర బ్యాంకులతో పోలిస్తే ఎక్కువ సంఖ్యలో కస్టమర్లు ఉన్న సంగతి తెలిసిందే. 40 కోట్లకు పైగా కస్టమర్లు ఉన్న ఎస్బీఐ ఖాతాదారులకు భారీ షాక్ ఇచ్చింది. మే 21, 22, 23 తేదీలలో కొన్ని సర్వీసులు అందుబాటులో ఉండవని వెల్లడించింది. ట్విట్టర్ వేదికగా ఎస్బీఐ ఈ విషయాన్ని వెల్లడించగా ఖాతాదారులు బ్యాంక్ సేవలకు సంబంధించిన విషయాన్ని ముందే తెలుసుకుంటే మంచిది.

    ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యూపీఐ వంటి సేవలు అందుబాటులో ఉండవని ఎస్బీఐ వెల్లడించింది. మే నెల 21వ తేదీన 22.45 గంటల నుంచి మే 22న 01.15 గంటల వరకు, మే 23వ తేదీన 02.40 గంటల నుంచి 06.10 గంటల వరకు ఉండవని ఎస్బీఐ తెలిపింది. ఖాతాదారులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుపోకుండా లావాదేవీలు జరిపే ప్రయత్నం చేస్తే మంచిదని చెప్పవచ్చు.

    ఆన్ లైన్ లో లావాదేవీలు జరపాలని అనుకునే వాళ్లు ఈ సమయాల్లో కాకుండా మిగిలిన సమయాల్లో చేస్తే మంచిదని చెప్పవచ్చు. మెయింటెనెన్స్ కారణంగా ఈ సేవలకు అంతరాయం ఏర్పడుతుండటం గమనార్హం. మరోవైపు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే పనివేళలు ఉండేలా చూసుకోవాలని బ్యాంకులకు ఆదేశాలను జారీ చేసింది.

    మే 31 వరకు ఈ కొత్త బ్యాంకింగ్ టైమింగ్స్ అమలులో ఉండనున్నాయని కొన్ని రకాల సేవలను మాత్రమే బ్యాంకులు అందించనున్నాయని తెలుస్తోంది. క్యాష్ విత్‌డ్రాయెల్స్, రెమిటెన్స్, ప్రభుత్వ బిజినెస్‌లు, డిపాజిట్ల స్వీకరణ లాంటి సేవలు మాత్రమే బ్యాంక్ కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది.