కరోనాతో చనిపోయిన వ్యక్తి ఫ్యామిలీకి రూ.7 లక్షలు.. ఎలా పొందాలంటే..? 

భారత్ లో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా 3,000కు పైగా మరణాలు నమోదవుతున్నాయి. గతేడాది నవంబర్ నెల తర్వాత కరోనా కేసులు తగ్గాయి. అయితే ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి మళ్లీ భారత్ లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అయితే కరోనాతో మరణించిన వ్యక్తికి ఈపీఎఫ్ అకౌంట్ ఉంటే ఆ వ్యక్తి కుటుంబం రూ.7 లక్షలు పొందే అవకాశం ఉంటుంది.   కరోనా వల్ల ఎన్నో కుటుంబాలు వీధిన […]

Written By: Navya, Updated On : May 20, 2021 9:52 pm
Follow us on

భారత్ లో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా 3,000కు పైగా మరణాలు నమోదవుతున్నాయి. గతేడాది నవంబర్ నెల తర్వాత కరోనా కేసులు తగ్గాయి. అయితే ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి మళ్లీ భారత్ లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అయితే కరోనాతో మరణించిన వ్యక్తికి ఈపీఎఫ్ అకౌంట్ ఉంటే ఆ వ్యక్తి కుటుంబం రూ.7 లక్షలు పొందే అవకాశం ఉంటుంది.

 

కరోనా వల్ల ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్న తరుణంలో ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ కూడా ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న వ్యక్తి ఫ్యామిలీకి ప్రయోజనం చేకూరనుంది. ఈపీఎఫ్ ఫామ్ 20 సబ్మిట్ చేయడం ద్వారా ఈ డబ్బులు పొందే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న వ్యక్తికి సంబంధించిన వివరాలను అందజేయాల్సి ఉంటుంది. ఉద్యోగి అకౌంట్ నుంచి డబ్బులు క్లెయిమ్ చేసుకోవాలనుకునే వ్యక్తులు వాళ్ల వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది.

 

క్లెయిమ్ ప్రాసెస్‌లో పలు దశల్లో మెసేజ్ లు వస్తాయి. ఆధార్ నంబర్ తో లింక్ అయిన మొబైల్ నంబర్ ను తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఫామ్ 20 ద్వారా ఉద్యోగి ఈపీఎఫ్ అకౌంట్‌లో ఉన్న డబ్బులను సులభంగా డ్రా చేయడం సాధ్యమవుతుంది. ఫామ్ సబ్మిట్ చేసిన 30 రోజుల్లో క్లెయిమ్ సెటిల్ కావడం జరుగుతుంది. 10సీ లేదా 10డీ ఫామ్ ల ద్వారా కూడా ఈపీఎఫ్, ఈపీఎస్, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ ద్వారా డబ్బులు పొందే అవకాశం ఉంటుంది.

 

సమీపంలో ఈపీఎఫ్వో ఆఫీస్ ను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ స్కీమ్ ద్వారా ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఎంతగానో మేలు జరుగుతుందని చెప్పవచ్చు.