Homeబిజినెస్Citibank CEO: సిటీ బ్యాంకు సీఈవో సంచలన వ్యాఖ్యలు.. ప్రమాదంలో 2,40,000 ఉద్యోగుల భవితవ్యం

Citibank CEO: సిటీ బ్యాంకు సీఈవో సంచలన వ్యాఖ్యలు.. ప్రమాదంలో 2,40,000 ఉద్యోగుల భవితవ్యం

Citibank CEO: సిటీ బ్యాంక్.. ఈ పేరు తెలియని ఐటి ఉద్యోగి ఉండడు అంటే ఆశ్చర్యం కలగక మానదు. అలాంటి ఈ కంపెనీ అమెరికా కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా కార్యకర్తలపాలు సాగిస్తూ ఉంటుంది. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ సిటీ బ్యాంకుకు శాఖలు ఉన్నాయి. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 2,40,000 మంది ఉద్యోగులు ఈ బ్యాంకులో పనిచేస్తున్నారు. బ్యాంకింగ్ సేవలు, ఇన్సూరెన్స్, మొబైల్ బ్యాంకింగ్ వంటి విభాగాల్లో సిటీ బ్యాంకు విస్తృతమైన సేవలు అందిస్తోంది. అయితే అమెరికాలో నెలకొన్న ఆర్థిక మాధ్యం ఇప్పుడు ఆ బ్యాంకు అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ క్రమంలో ఆ బ్యాంకుకు చెందిన సీఈవో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. ఇన్నాళ్లు బాగుంది, ఇక తిరుగులేదు అనుకున్న సిటీ బ్యాంకులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటుండడం ఆ బ్యాంకు ఉద్యోగులనే కాదు, మార్కెట్ వర్గాలను సైతం నివ్వెర పరుస్తున్నాయి.

సిటీ బ్యాంకు.. అమెరికాలో మూడవ అతిపెద్ద బ్యాంకు గా ఉంది. అయితే ఈ బ్యాంకు సీఈవో జేన్ ఫ్రేజర్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్ వర్గాల్లో చర్చకు దారితీసాయి. ” రిస్క్ ను తగ్గించాలి. లాభదాయకతను పెంచాలి” అని సీఈవో వ్యాఖ్యలు చేయడం కలకలం సృష్టిస్తోంది. సీఈవో చేసిన ఈ వ్యాఖ్యలు ఆ బ్యాంకు ఉద్యోగులు ఆందోళనకు కారణమవుతున్నాయి. ఇప్పటికే ఆర్థికమాంద్యం పేరుతో చాలామందిని తొలగించారని, సీఈవో ఆ వ్యాఖ్యలు చేయడంతో తమ పరిస్థితి ఏమిటని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫైనాన్షియల్ టైమ్స్ అనే మ్యాగజిన్ ఇచ్చిన నివేదిక ప్రకారం సిటీ బ్యాంక్ను ముందుకు తీసుకెళ్ళేందుకు చేపట్టే మార్పులకు ఉద్యోగులు రెడీగా ఉండాలని, లేనిపక్షంలో సంస్థ నుంచి వైదొలగాలని సీఈవో హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది.. అంతేకాదు ఈ మెయిల్ ద్వారా సీఈవో 2,40,000 మంది ఉద్యోగులకు కఠినమైన సందేశాన్ని పంపారని సమాచారం. ఆర్థిక మాధ్యం వల్ల తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సిటీ బ్యాంకు.. ఆశించినంత వృద్ది రేటు నమోదు చేయలేదు. గత దశాబ్దాన్నర క్రితం ఏర్పడిన ఆర్థిక మాంద్యం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందో.. ఇప్పుడు కూడా బ్యాంకు అలాంటి పరిస్థితులనే చవి చూస్తోంది. ఈ క్రమంలో సీఈవో బ్యాంకు పునర్ నిర్మాణానికి సంబంధించిన ప్రణాళిక ప్రకటించారు. ఉద్యోగులు మొత్తం సంఘటితంగా పనిచేయాలని సూచించారు. కానీ ఆమె ప్రకటించిన కొద్ది రోజులకే ఇలాంటి హెచ్చరిక రావడాన్ని ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు.

2021 లో సీఈవో గా బాధ్యతలు స్వీకరించిన జేన్ ఫ్రేజర్.. బ్యాంకు అభివృద్ధి బాటలో పయనించడానికి అనేక మార్పులు తీసుకొచ్చారు. సగటు ఖాతాదారు ఏమాత్రం ఇబ్బంది పడకుండా బ్యాంక్ లావాదేవీలు నిర్వహించే విధంగా పలు సంస్కరణలు ప్రవేశపెట్టారు. కానీ అవి అమలులో ఉన్న దశలోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం ఒకింత ఆందోళన కలిగిస్తోంది. ఇక గతవారం జరిగిన టౌన్ హాల్ మీటింగ్ లో ఉద్యోగులను ఉద్దేశించి సీఈవో మాట్లాడారు. ” ఈ వేగవంతమైన ప్రయాణంలో త్వరితగతిన ఉద్యోగులు మాతో పయనించాలి. అంతేకాదు చాలా వేగంతో ఈ బ్యాంకు కార్యకలాపాలు సాగుతున్నాయి.. ఈ బ్యాంకు పురోగతికి సంబంధించి చాలా ఆశయాలు ఉన్నాయి.. ఉద్యోగులూ మేల్కోండి.. ఖాతాదారులను గెలుచుకోవడంలో సహాయపడండి. సంస్థ అందించిన లక్ష్యాలను అందుకోండి.” అంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు.. ఆమె ఈ వ్యాఖ్యలు చేసిన అనంతరం సిటీ బ్యాంక్ లాటిన్ అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ కార్యకలాపాల హెడ్ ఎడ్వర్డో క్రజ్ తో సహా ఎగ్జిక్యూటివ్ కంపెనీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కాగా, దాదాపు 160 దేశాల్లో సిటీ బ్యాంకు కార్యకలాపాలు సాగిస్తోంది. మిలియన్ల కొద్దీ ఖాతాదారులు ఈ బ్యాంకుకు ఉన్నారు. ఈ సంస్థకు తొలిసారిగా జేన్ ఫ్రేజర్ సీఈవోగా నియమితులు కావడం విశేషం.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version