Rs 2000 Bank Notes : పెద్ద నోట్ల రద్దు తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 నోటును తెరపైకి తీసుకువచ్చింది. కొంతకాలం తర్వాత దాని ముద్రణను నిలిపివేసింది. ఆ తర్వాత ఆ నోట్లో ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది. దీనికి కొంతకాలం గడువు ఇచ్చింది. ఆ గడువు సెప్టెంబర్ 30 తో తీరిపోయింది. ఈ క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 నోట్ల స్వీకరణకు సంబంధించి కీలకమైన నిర్ణయాన్ని వెలువరించింది.
2000 నోట్ల డిపాజిట్, మార్పిడికి సెప్టెంబర్ 30 వరకు గడువు విధించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. దానిని మరొకసారి పొడిగించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 నోట్లను చెలామణి నుంచి వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. నోట్ల మార్పిడికి, డిపాజిట్ కు సంబంధించి సెప్టెంబర్ 30 వరకు గడువు విధించిన విషయం కూడా తెలిసిందే. ఈ క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి గడువును పొడిగించింది. అక్టోబర్ 7 వరకు ప్రజలు నోట్లను మార్చుకోవచ్చని పేర్కొంది. ఇప్పటికే 90 శాతానికి పైగా నోట్లు తిరిగి వచ్చాయని గతంలో ఆర్బిఐ పేర్కొంది. ఉపసంహరణ పై సమీక్ష జరిపిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరొకసారి నోట్లను మార్చుకునేందుకు ప్రజలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ఇక ప్రస్తుతం వాడుకలో ఉన్న 2000 నోట్లు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది.
ఎవరి వద్దనైనా నోట్లు ఉంటే బ్యాంకులో లేదా పోస్ట్ ఆఫీస్ లలో మార్చుకోవచ్చని సూచించింది. కాగా, మే 16న 2000 నోట్లు ఉపసంహరించుకుంటున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అదే నెల 19 నుంచి నోట్లను మార్చుకునేందుకు అవకాశం ఇచ్చింది. అదే ప్రస్తుతం వాడుకలో ఉన్న 2000 నోట్లలో 93% బ్యాంకులకు తిరిగి వచ్చినట్టు ఈనెల 2న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇక ప్రధాన బ్యాంకు నుంచి సేకరించిన సమాచారం ప్రకారం 2000 డి నామినేషన్ లో ఉన్న మొత్తం నోట్లో 87% డిపాజిట్ల రూపంలో ఉండగా, దాదాపు 13 శాతం ఇతర డి నామినేషన్ నోట్లలోకి మార్చుకున్నట్టు వివరించింది. ఎవరి వద్దనైనా రెండు రోజుల నోట్లు ఉంటే సమీపంలోని బ్యాంకు బ్రాంచ్ లకు వెళ్లి మార్చుకోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది. వాస్తవానికి సెప్టెంబర్ 30 నాటికి 2000 నోటు ఒక చరిత్రగా మిగిలిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుని నిర్ణయం వల్ల అది అక్టోబర్ 7 వరకు పొడగింపునకు గురైంది. ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశంలో 3.6 లక్షల కోట్ల విలువైన 2000 నోట్లు వాడుకలో ఉన్నాయి. వాటిలో సెప్టెంబర్ 1 నాటికి 93% నోట్లు బ్యాంకుల్లో జమయ్యాయి. అంటే వీటి విలువ 3.32 లక్షల కోట్లు. మరో ఏడు శాతం అంటే 24 వేల కోట్ల విలువైన నోట్లు వెనక్కి రావాల్సి ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. కాగా గతంలో రిజర్వ్ బ్యాంక్ ఇండియా ఇచ్చిన వెసలు బాటు ప్రకారం 2000 నోట్లను ఒకేసారి 20వేల వరకు మార్చుకునే అవకాశం ఉంది. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2016 నవంబర్లో ప్రవేశపెట్టింది. 2018_19లో దీని ముద్రణను నిలిపివేసింది.