దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కొత్త రకం పర్సనల్ లోన్స్‌ను కస్టమర్ల కొరకు అందుబాటులోకి తెచ్చింది. ఎవరైతే ఈ రుణాలను పొందాలని అనుకుంటారో వాళ్లు ఎటువంటి తనఖా లేకుండా ఈ రుణం తీసుకోవచ్చు. కవచ్ పర్సనల్ లోన్ పేరుతో ఎస్‌బీఐ ఈ రుణాలు అందిస్తుండగా ఈ రుణాల వల్ల కస్టమర్లకు ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు.
ఎవరైనా కరోనా వైరస్ చికిత్స కొరకు ఈ లోన్ ను తీసుకునే అవకాశం ఉంటుంది. ఎస్‌బీఐ కవచ్ పర్సనల్ లోన్‌పై 8.5 శాతం వడ్డీ రేటును అమలు చేస్తుంది. ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులతో పోలిస్తే తక్కువ వడ్డీకే ఎస్బీఐ పర్సనల్ లోన్ ను అందిస్తుండటం గమనార్హం. ఎవరైతే ఎస్బీఐ కవచ్ పర్సనల్ లోన్ కింద డబ్బులు తీసుకుంటారో వాళ్లు 60 నెలలలోగా డబ్బులను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
ఈ లోన్ ను తీసుకున్న వాళ్లు మొదటి మూడు నెలల పాటు ఎటువంటి ఈఎంఐలను చెల్లించాల్సిన అవసరం లేదు. కరోనా వైరస్ విజృంభణ వల్ల ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఎస్బీఐ రుణాల వల్ల లోన్ తీసుకున్న వాళ్లకు ప్రయోజనం చేకూరనుంది. ఎస్బీఐ మాత్రమే ఈ తరహా రుణాలు ఇస్తుండటం గమనార్హం.
సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్ ను సంప్రదించి ఈ రుణాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. 3 నెలల మారటోరియం ఫెసిలిటీ లభిస్తుండటం వల్ల లోన్ తీసుకున్న వాళ్లకు బెనిఫిట్ కలగనుంది.