అయితే కొన్నిసార్లు వేర్వేరు కారణాల వల్ల నగదు డిపాజిట్ చేసే సమయంలో పని మధ్యలోనే నిలిచిపోతుంది. నగదు డిపాజిట్ మెషిన్ లో నగదు జమ చేసినా అవతలి వ్యక్తి ఖాతాలో నగదు జమ కాకపోవడం వల్ల ఇబ్బందులు పడేవాళ్లు చాలామంది ఉంటారు. ఇలాంటి సమస్య ఎదురైతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా డబ్బును సులభంగా తిరిగి పొందే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తోంది.
తాజాగా ఒక కస్టమర్ కు ఇలాంటి అనుభవం ఎదురు కాగా కస్టమర్ ట్విట్టర్ ద్వారా ఎస్బీఐకి ఫిర్యాదు చేశారు. ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్ లో ఫిర్యాదు చేయవచ్చని 1800 11 2211, 1800 425 3800, 080 -26599990 నంబర్ల ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సులభంగా ఫిర్యాదు చేసే అవకాశాలు అయితే ఉంటాయని తెలుస్తోంది.
ఈ విధంగా ఫిర్యాదు చేయడం ద్వారా సమస్యను పరిష్కరించుకుని డబ్బులను పొందవచ్చు. ఏవైనా సందేహాలు ఉంటే సమీపంలోని బ్రాంచ్ మేనేజర్ ను సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు. డబ్బులు జమ కాకపోయినంత మాత్రాన ఏ మాత్రం కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు.