America, Afghanistan : అమెరికా సొమ్ము.. అఫ్గాన్ వశం

America, Afghanistan: ఏటిలో వేసినా పైసలు ఎంచి వేయాలంటారు. ఇది అక్షరాలా అమెరికాకు సరిపోతుంది. అఫ్గనిస్తాన్(Afghanistan)లో అమెరికా(America) పెట్టిన పెట్టుబడులు వృథాగా పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో అమెరికా వాసుల్లో ఆందోళన నెలకొంది. వేల కోట్లు సొమ్ము పనికిరాకుండా పోవడంతో వారిలో సహజంగానే ఆగ్రహం కలుగుతోంది. అఫ్గాన్ యుద్ధంలో అమెరికా సుమారు లక్ష కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. కానీ అక్కడ సాధించిందేమీ లేదు. ఫలితంగా ప్రజాధనం వృధా అయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటలీ తయారు చేసిన […]

Written By: Raghava Rao Gara, Updated On : August 20, 2021 6:08 pm
Follow us on

America, Afghanistan: ఏటిలో వేసినా పైసలు ఎంచి వేయాలంటారు. ఇది అక్షరాలా అమెరికాకు సరిపోతుంది. అఫ్గనిస్తాన్(Afghanistan)లో అమెరికా(America) పెట్టిన పెట్టుబడులు వృథాగా పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో అమెరికా వాసుల్లో ఆందోళన నెలకొంది. వేల కోట్లు సొమ్ము పనికిరాకుండా పోవడంతో వారిలో సహజంగానే ఆగ్రహం కలుగుతోంది. అఫ్గాన్ యుద్ధంలో అమెరికా సుమారు లక్ష కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. కానీ అక్కడ సాధించిందేమీ లేదు. ఫలితంగా ప్రజాధనం వృధా అయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇటలీ తయారు చేసిన జీ222 ట్విన్ టర్బోఫ్రాన్ విమానాలను అఫ్గాన్ లో పునర్వినియోగానికి తెచ్చేందుకు 549 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. 20 విమానాలపై ఈ మొత్తం ఖర్చు చేయగా వాటిలో 16 విమానాల్లో సాంకేతిక సమస్యలు ఏర్పడడంతో ఎగరలేని పరిస్థితుల్లో కాబుల్ ఎయిర్ పోర్టులో నిలిచిపోయాయి. తరువాత వాటిని తుక్కు వ్యాపారులకు కేవలం 32 వేల డాలర్లకు విక్రయించి నష్టాలను మూటగట్టుకుంది.

అఫ్గాన్ లో నల్లమందు పంటను నిర్మూలించేందుకు అమెరికా దాదాపు 15 ఏళ్లు యుద్ధం చేసింది. నల్లమందు అక్రమ రవాణా నుంచి ఉగ్రవాదులకు లభించే సొమ్మును అడ్డుకోవాలని భావించింది. కానీ దాదాపు 8.6 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ఫలితం మాత్రం దక్కలేదు. 2017 నాటికి నల్లమందు సాగు రికార్డు స్థాయికి చేరింది. పది లక్షల మంది అఫ్గాన్ వాసులకు విద్యుత్ అందించేందుకు 116 మిలియన్ డాలర్లను అమెరికా సైన్యంలో ఇంజినీర్స్ కోర్ వెచ్చించింది.

ఓవర్సీస్ ప్రైవేటు ఇన్వెస్ట్ మెంట్ కార్పొరేషన్ నుంచి 85 మిలియన్ డాలర్ల రుణం తీసుకుని 209 గదుల హోటల్ 150 కాబుల్ గ్రాండ్ రెసిడెన్స్ అపార్ట్ మెంట్ నిర్మాణం చేపట్టారు. ఇది అమెరికా దౌత్య కార్యాలయానికి దగ్గరగా ఉంది. కానీ 2016 నవంబర్ నుంచి వీటి నిర్మాణం ఆగిపోయింది. రుణాలు మొండి బకాయిలుగా మారాయి.

అఫ్గనిస్తాన్ సైన్యానికి శిక్షణ నిమిత్తం 20 ఏళ్లలో 83 బిలియన్ డాలర్లను ఖర్చు చేసిది. కానీ తాలిబన్లు ఆక్రమణ మొదలు పెట్టాక కనీస ప్రతిఘటన లేకుండా అఫ్గాన్ సైన్యం లొంగిపోయింది. అమెరికా సైన్యం ఈ పరిణామాలతో నివ్వెరపోయింది. అఫ్గాన్ సైన్యం పతనంపై అమెరికాకు ముందే తెలుసు. పదుల సంఖ్యలో విమానాలు, హెలికాప్టర్లు, వందల టన్నుల ఆయుధాలు, మందు గుండు తాలిబన్ల వశమైంది.