Operation Sindoor: పహల్గాం దాడి తర్వాత భారత్ ఉగ్రవాదులపై దాడికి పాల్పడింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆకస్మికంగా దాడులు చేయడంతో చాలామంది ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు భారత్ ఉగ్రవాదులపై దాడులు చేస్తుంటే.. పాకిస్తాన్ మాత్రం సరిహద్దుల్లో విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతోంది. ఈ కాల్పుల్లో భారత పౌరులు మరణించారు. ఈ నేపథ్యంలో భారత్, పాక్ మధ్య వైరుధ్యం పెరిగిపోయింది. దీంతో భారత్ లోని సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న కొన్ని విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. అవేంటంటే?
Also Read: ఆపరేషన్ సిందూర్: భారత్‌కు గర్వకారణం, పాక్‌కు షాక్
భారతదేశం, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇప్పటికే భారత్కు చెందిన విమానాలు పాక్ నుంచి వెళ్లడంపై నిషేధించింది. అయితే తాజాగా యుద్ద పరిస్థితి ఏర్పడడంతో భారత్లోని కొన్ని విమాన సర్వీసులను పూర్తిగా మూసివేసినట్లు ప్రకటించాయి. పాకిస్తాన్ కు సరిహద్దులో ఉన్న ధర్మశాల, లేహ్, జమ్ము శ్రీనగర్, అమృత్ సర్ విమానాశ్రయాలను ప్రస్తుతం మూసివేసినట్లు పేర్కొన్నాయి. తదుపరి అప్డేట్ వచ్చేవరకు ఈ సర్వీసులు నిలిపివేస్తున్నట్లు తెలిపాయి. అలాగే రాజ్కోట్, బుచ్, జామ్ నగర్ లో మధ్యాహ్నం 12 గంటల వరకు విమాన రాకపోకలపై ప్రభావం ఉంటుందని ఎయిర్ ఇండియా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఇండిగో ఎయిర్లైన్స్ కూడా ఫ్లైట్ అడ్వైజర్ ని జారీ చేసింది. శ్రీనగర్, జమ్ముతోపాటు చండీగఢ్ ధర్మశాలల నుంచి విమాన రాకపోగలపై ప్రభావం పడుతుందని తెలిపింది.
ఇవే కాకుండా ఏ విమానాశ్రయాల్లోనైనా ప్రయాణం చేయాలని అనుకునేవారు తమ అప్డేట్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని తెలుపుతున్నాయి. ఎందుకంటే యుద్ధ పరిస్థితిలో కారణంగా ఆయా ప్రాంతాల్లో అకస్మాత్తుగా ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల స్టేటస్ను బట్టి ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకోవాలని తెలుపుతున్నారు. తర్వాతి అప్డేట్ వచ్చేవరకు ఆయా ప్రాంతాల్లో విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు తెలిపాయి.
ఇదిలా ఉండగా ఇప్పటికే పాక్ మీది నుంచి భారత్ విమానాలు వెళ్లడం నిషేధించడంపై విమానాలు.. అరేబియా సముద్రం పైనుంచి వెళ్తున్నాయి. దీంతో ప్రయాణికులకు అదనపు భారం పడుతుంది. అయితే ప్రస్తుతం యుద్ధ పరిస్థితులు తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో విమానాల రాకపోకలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయా సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో విమానాలు అకస్మాత్తుగా ప్రయాణాలు నిలిచిపోతే ప్రయాణికులు సహకరించాలని కోరుతున్నారు.
మరోవైపు భారత్ ఆర్మీ 9 ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది. ఈ దాడిలో కొందరు ప్రముఖులు కూడా మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై పాకిస్తాన్ ఎలా స్పందిస్తుందోనని భారత్ ఎదురుచూస్తుంది. ఒకవేళ పాక్ కవ్వింపు చర్యలు కొనసాగిస్తే నేరుగా యుద్ధంలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: ఉగ్రవాదానికి భారత్ సమాధానం.. ఒక చిత్ర కథ