Samsung Galaxy Z Fold 8: శామ్‌సంగ్ కంపెనీ నుంచి రాబోతున్న సరికొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ‘శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8’. ఈ ఫోన్ కు సంబంధించిన కీలక వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఈసారి శామ్‌సంగ్ తన ఫోల్డబుల్ సిరీస్‌లో డిస్‌ప్లే క్రీజ్, బరువు విషయంలో ఊహించని మార్పులు చేయబోతోంది. ఈ సిరీస్‌లో రెండు మోడల్స్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 , గెలాక్సీ Z ఫోల్డ్ 8 ఆల్ట్రా రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్లు ఎలా ఉన్నాయి? ఎవరికి ఉపయోగంగా ఉంటాయి? పూర్తి వివరాల్లోకి వెళితె..
కొత్త గెలాక్సీ Z ఫోల్డ్ 8 ‘వైడ్’ మోడల్ బరువు చాలా తేలికంగా ఉండే అవకాశం ఉంది. ఇది కేవలం 201 గ్రాముల బరువు మాత్రమే ఉండొచ్చని అంచనా. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న గెలాక్సీ Z ఫోల్డ్ 7 బరువు 215 గ్రాములుగా ఉంది. దానితో పోలిస్తే ఇది చాలా తక్కువ. సాధారణ స్మార్ట్‌ఫోన్‌ల బరువుతో పోటీ పడనుంది. ఫోల్డ్ 8 ఆల్ట్రా మోడల్ మాత్రం దాదాపు 215 గ్రాముల బరువుతో రానుంది.
ఫోల్డబుల్ ఫోన్ వినియోగదారులను ఎప్పటినుంచో వేధిస్తున్న ప్రధాన సమస్య స్క్రీన్ మధ్యలో కనిపించే మడత (Crease). అయితే, ఈసారి శామ్‌సంగ్ దీనికి శాశ్వత పరిష్కారం చూపించబోతోంది. కంపెనీ తన కొత్త మోడల్స్‌లో అల్ట్రా థిన్ గ్లాస్ సాంకేతికతను, లేజర్ డ్రిల్డ్ మెటల్ సపోర్ట్ ప్లేట్‌ను వాడుతోంది. దీనివల్ల స్క్రీన్‌ను తాకినప్పుడు లేదా చూసినప్పుడు ఆ మడత మార్క్ అస్సలు కనిపించదు. సాధారణ ఫోన్ డిస్‌ప్లే లాగే స్మూత్‌గా ఉంటుంది.
లండన్‌లో జూలై 22న నిర్వహించే ‘గెలాక్సీ అన్‌ప్యాక్డ్’ ఈవెంట్‌లో గెలాక్సీ Z ఫోల్డ్ 8 సిరీస్‌ను అధికారికంగా లాంచ్ చేస్తారు. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి ప్రీ బుకింగ్స్ ప్రారంభం కానుంది. ఆగస్టు 7 నుంచి ఈ మొబైల్స్ మార్కెట్లో విక్రయానికి వచ్చే అవకాశం ఉంది. ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో క్వాల్‌కామ్ సంస్థకు చెందిన అత్యంత శక్తివంతమైన ‘స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్’ సిరీస్ ప్రాసెసర్‌ను ఉపయోగించనున్నారు. అలాగే ఆల్ట్రా మోడల్‌లో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5,000 mAh భారీ బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీకి 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండనున్నాయి. భారతదేశంలో ఈ ఫోన్ ప్రారంభ ధర సుమారు రూ. 1,65,000 నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
