BCCI clarification on Suryavanshi: టీమిండియా యంగ్ గన్ వైభవ్ సూర్య వంశీ మైదానంలో అడుగు పెడతాడా.. డెబ్యు మ్యాచ్ ఆడతాడా.. జట్టులో విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో.. అతడి కోసం ఎవరిని పక్కన పెడతారు.. ఎవరు తన స్థానాన్ని త్యాగం చేస్తారు.. ఇవే ప్రశ్నలు కొద్దిరోజులుగా మీడియాలో సర్కులేట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ సూర్య వంశీ డెబ్యూ మీద క్లారిటీ ఇచ్చింది.
సూర్య వంశీ మైదానంలో ఎంట్రీ ఇచ్చే విషయంలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. కోచింగ్ సిబ్బంది కూడా ఇంతవరకు దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. సూర్య వంశీ ఇటీవల కాలంలో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఐపీఎల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇటీవల శ్రీలంకలో జరిగిన ట్రై సిరీస్లో ఫైనల్ మ్యాచ్లో మెరుపు స్థాయిలో ఇన్నింగ్స్ ఆడాడు. అందువల్లే అతడిని జాతీయ జట్టులోకి తీసుకున్నారు. జట్టులోకి తీసుకున్నప్పటికీ అతడు మైదానంలోకి అడుగు పెడతాడా.. లేదా అనే విషయంపై క్లారిటీ లేదు.. అయితే సూర్య వంశీ ఎంట్రీ కి సంబంధించి టీమిండియా బ్యాటింగ్ కోచ్ శీతాన్ష్ కొటక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతని కోసం మెరుగ్గా మరొక ఆటగాడిని పక్కన పెట్టడం భావ్యం కాదని పేర్కొన్నాడు.
ఇది ఇలా ఉండగానే బీసీసీఐ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోని చూసిన అభిమానులు సంతోష పడుతున్నారు.. ఎందుకంటే ఐర్లాండ్ సిరీస్లో అతడు ఆడతాడని.. అతడు మైదానంలో అడుగుపెడతాడని బీసీసీఐ అనధికారికంగా క్లారిటీ ఇచ్చేసింది. ఎందుకంటే సూర్య వంశీ ఆట చూసేందుకే ఐర్లాండ్ లో అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. టికెట్లు కూడా భారీగా అమ్ముడుపోయాయి. అదనంగా సీట్లును కూడా ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అలాంటప్పుడు వైభవ్ ఆడకపోతే అభిమానుల నుంచి నిరసన వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. అందువల్ల బిసిసిఐ సూర్య వంశీకి అవకాశం ఇస్తుందని సమాచారం. అందువల్లే తన అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్లో వీడియో పోస్ట్ చేసినట్టు తెలుస్తోంది.
సూర్యవంశీ కూడా మైదానంలో అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే మైదానంలో తీవ్రంగా సాధన చేశాడు. అతడు సాధన చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అతడి ఆట కోసం ఐర్లాండ్ లో స్థిరపడిన భారతీయులు ఎదురు చూస్తున్నారు. అతడు ఆడుతుంటే చూసి ఆనందించేందుకు సిద్ధంగా ఉన్నారు.
Start of something special
Glimpses of Vaibhav Sooryavanshi’s first time in the #TeamIndia nets #IREvIND pic.twitter.com/zp3mPMch5R
— BCCI (@BCCI) June 26, 2026
